Jump to content

సెయింట్ థామస్ క్రిస్టియన్లు

వికీపీడియా నుండి
సెయింట్ థామస్ క్రిస్టియన్లు
The మర్ థోమా స్లివా లేదా సెయింట్ థామస్ శిలువ (నస్రానీ మెనోరాహ్గా కూడా ప్రసిద్ధం), నస్రానీ ప్రజలకు సంకేతం
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
భారతదేశం (కేరళ, బెంగళూరు, ముంబై); యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్); (ఒమన్); (కువైట్); యు.ఎస్.ఎ. (న్యూయార్క్ నగరప్రాంతం, చికాగో, హ్యూస్టన్, డల్లాస్, టంపా, లాస్ ఏంజెలస్; కెనడా (టొరంటో)[1]
భాషలు
Vernacular: మలయాళం Liturgical: సిరియాక్ (అరమాయిక్)[2]
మతం
సెయింట్ థామస్ క్రైస్తవ చర్చ్‌లు
సంబంధిత జాతి సమూహాలు
క్ననయ,[2] మళయాళీలు
మార్త్ మారియం సిరో-మలబార్ కాథలిక్ చర్చి, అరకుజా, కేరళ

సెయింట్ థామస్ క్రైస్తవులు లేదా సిరియన్ క్రైస్తవులు లేదా నస్రానీ కేరళకు చెందిన క్రైస్తవ సమాజానికి చెందినవారు, వీరి మూలాలు 1వ శతాబ్దిలో సెయింట్ థామస్ చేసిన మతప్రచార ఫలితాల్లో ఉన్నాయి. సెయింట్ థామస్ క్రైస్తవ సమాజం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచీన క్రైస్తవ సమాజాల్లో ఒకటిగా పేరుపొందింది.[3][4] ఈ సమాజం చారిత్రికంగా నాయకత్వంలోనూ, మతపరమైన కార్యకలాపాల్లోనూ ఐక్యంగా వ్యవహరించింది, ఐతే 17వ శతాబ్దిలో వివిధ చర్చిల ఆధిపత్యాలు, సంప్రదాయాల క్రింద విడిపోయింది.

చారిత్రికంగా సెయింట్ థామస్ సమాజం పర్షియా కేంద్రంగా నెలకొన్న సిరియన్ సంప్రదాయ చర్చి (లేదా చర్చ్ ఆఫ్ ఈస్ట్)లో భాగంగా ఉండేది. కొందరు బిషప్స్, ఒక వంశపారంపర్య ఆర్క్‌డెకాన్ సేవలందించే ఎక్లెసియస్టికల్ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా అనే మతసంస్థశాఖ 8వ శతాబ్దిలో వారిని వ్యవస్థీకృతం చేశారు. 16వ శతాబ్దంలో సెయింట్ థామస్ క్రైస్తవులను కాథలిక్ చర్చి కిందకు తీసుకురావాలని పోర్చుగీస్ పడ్రొడొ(పోర్చుగీసు రాజ్యానికి, కాథలిక్ మతగురువులకు మధ్యనున్న ఓ పదవి) చేసిన ప్రతిపాదన, ప్రయత్నమూ సెయింట్ థామస్ క్రైస్తవ సమాజంలో తొట్టతొలి విభేదాలకు బీజమయ్యాయి. దీని కారణంగా కాథలిక్, మలంకర చర్చిలు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచీ మరిన్ని వేర్పాట్లు జరిగి, ప్రస్తుతం సెయింట్ థామస్ క్రైస్తవులు తూర్పు కాథలిక్, ఓరియంటల్ ఆర్థొడాక్స్, ఇతర స్వతంత్ర శాఖలుగా విడిపోయారు. ఒక్కో విభాగానికి వేర్వేరు సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి.

సెయింట్ థామస్ క్రైస్తవులు ప్రస్తుతం ఒకే జాతి(ఎత్నిక్ గ్రూప్)ని ప్రతిబింబిస్తున్నారు. సెయింట్ థామస్ క్రైస్తవ సంస్కృతి ప్రధానంగా మూలాల్లో హిందూ సంస్కృతిగానూ, తూర్పు సిరియన్, పశ్చిమ సిరియన్, యూదు, తర్వాతికాలంలో ఐరోపీయ ప్రభావాలతోనూ ఉంది. వారి భాష కేరళలో విస్తారంగా మాట్లాడే మలయాళం కాగా ఆచార వ్యవహారాల్లో సైరియక్ వాడతారు. సైరియక్ అనేది క్రీస్తు మాట్లాడినట్టుగా భావించే అర్మానిక్ భాషలో ఒక మాండలీకం, ప్రస్తుతం కేవలం చైనా, మలబార్ కోస్ట్ ప్రాంతాల్లోని సిరియన్ క్రైస్తవుల్లో మతాచారాల భాషగానే వ్యవహారంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Eparchy of Saint Thomas the Apostle of Chicago (Syro-Malabarese)". Catholic-Hierarchy.org. David M. Cheney.
  2. 2.0 2.1 Ross, Israel J. (1979) "Ritual and Music in South India: Syrian Christian Liturgical Music in Kerala." Asian Music. 11 (1): 80–98
  3. The Encyclopedia of Christianity, Volume 5 by Erwin Fahlbusch. Wm. B. Eerdmans Publishing - 2008. p. 285. ISBN 978-0-8028-2417-2.
  4. The Jews of India: A Story of Three Communities by Orpa Slapak. The Israel Museum, Jerusalem. 2003. p. 27. ISBN 965-278-179-7.