స్క్రూడ్రైవర్
స్క్రూడ్రైవర్ (English: Screwdriver) అనేది స్క్రూలను ఊడదీయడానికి, లేదా బిగించడానికి ఉపయోగించే సాధనం. స్క్రూడ్రైవర్ తో స్క్రూలను తిప్పినప్పుడు సాధారణంగా అనగా స్క్రూను క్లాక్‌వైజ్‌గా త్రిప్పినప్పుడు స్ర్కూ బిగించబడుతుంది, స్క్రూను యాంటీక్లాక్‌వైజ్‌గా త్రిప్పినప్పుడు స్ర్కూ ఊడివస్తుంది. ఇది ఒక స్క్రూ యొక్క తలపైకి సరిపోయే ఒక నిర్దిష్ట ఆకారం యొక్క కొనతో అక్షసంబంధ షాఫ్ట్ కలిగి ఉంటుంది. స్క్రూడ్రైవర్ యొక్క మరొక చివరలో వ్యక్తి చేతితో పట్టుగా పట్టుకొనుటకు స్థూపాకార హ్యాండిల్ ఉంటుంది. స్క్రూ తల భాగంపై స్క్రూడ్రైవర్ మొనను ఆనించి త్రిప్పినట్లయితే టార్క్ ఏర్పడి స్క్రూ తిరుగుతుంది. స్క్రూడ్రైవర్లు అనేక రకాలలో, వివిధ పరిమాణాలలో ఉన్నాయి. స్క్రూడ్రైవర్ సాధారణంగా దాని మొన ఆకారంతో గుర్తించబడుతుంది. స్క్రూడ్రైవర్ మొన స్క్రూ తలపై కట్ చేయబడిన గాడిలో సరిగా సరిపోతే స్క్రూ సులభంగా తిరుగుతుంది, అప్పుడు స్క్రూను సులభంగా ఊడదీసుకోవచ్చు, లేదా బిగించుకోవచ్చు. స్క్రూడ్రైవర్ మొన స్క్రూ తలపై కట్ చేయబడిన గాడిలో సరిగా సరిపోకపోతే స్క్రూ సులభంగా తిరగక స్క్రూ తలపై కట్ చేయబడిన గాడి నుంచి స్క్రూడ్రైవర్ జారిపోతుంది, అప్పుడు స్క్రూను సులభంగా ఊడదీయలేము, బిగించలేము. అందుకని స్క్రూని గట్టిపట్టు గా పట్టుకొనుటకు, అలాగే వ్యక్తి గట్టిపట్టుగా పట్టుకొనుటకు సరియైన స్క్రూడ్రైవర్ ఉపయోగించాలి, అప్పుడు దీనితో పని సులభంగా, తొందరగా చేయగలుగుతాము. ఇది అందరి ఇళ్ళలో ఉండవలసిన సాధారణ పనిముట్టు. దీనితో ప్రతిఒక్కరికి అవసరముంటుంది. దీనిని ఎక్కువగా మెకానిక్ లు ఉపయోగిస్తారు. స్క్రూడ్రైవర్‌ను స్క్రూకు టార్క్ వర్తింపజేసి గట్టి ప్రదేశాలలో (చెక్క, గోడ వంటి) స్క్రూను దిప్పడం, లాగడం అనేది ఒక యంత్రవిధానం.[1]
దీనిని జాగ్రత్త ఉపయోగించాలి, లేకపోతే గాయం అయ్యే అవకాశం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Screwdriver". Encyclopaedia Britannica. Retrieved 21 July 2013.