హైడ్రోజన్ బాంబు
హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తివంతమైనది, అణుబాంబు కన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అణుబాంబు కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ద్వారా పనిచేయగా, హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం ద్వారా పనిచేస్తుంది. హైడ్రోజన్ బాంబు చర్యలో హైడ్రోజన్ అణువులు వేగంగా ఒకదానితో మరొకటి ఢీకొనటం ద్వారా పెద్దమొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుంది. సూర్యుడిలో అధిక శక్తి జనించడానికి కారణం కూడా ఈ కేంద్రక సంలీనం చర్యే. హైడ్రోజన్ బాంబు పేల్చడానికి అణుబాంబు అవసరం. హైడ్రోజన్ బాంబు పేల్చినప్పుడు కాంతి, ఉష్ణం, భారీ విస్ఫోటం, భారీ పొగ వెలువడతాయి. దీని పేలుడు తీవ్రతకు విస్ఫోటన పరిధిలో కొన్ని మైళ్ల దూరం వరకు ఉన్న భవనాలు నేలమట్టం అవుతాయి. హైడ్రోజన్, హీలియం అణువులు ఒకదానితో ఒకటి ఢీకొనటం ద్వారా విపరీతమైన శక్తితో పాటు పెద్దమొతంలో కాంతి వెలువడుతుంది. అమెరికా 1952 లో పసిఫిక్ మహా సముద్రంలోని ఒక ద్వీపంపై తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష జరిపింది, ఈ బాంబు ధాటికి ఆ ద్వీపం మొత్తం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది.
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - 07-01-2016 (విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం! అణుబాంబుకన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రభావం)