Jump to content

హైపర్ లింక్

వికీపీడియా నుండి
హైపర్ లింక్ వద్ద చేతి గుర్తులా మారిన మౌస్ పాయింటర్

హైపర్ లింక్ అనేది కంప్యూటరీకరణ గొలుసు యొక్క ఒక భాగం. గొలుసు అనేది లోహం యొక్క అనేక ముక్కలతో తయారవుతుంది; ప్రతి భాగం ఒక లింక్. నేడు ప్రజలు కూడా కొత్త మార్గానికి లింకు పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ లో వరల్డ్ వైడ్ వెబ్ అనేక వెబ్ పేజీలను తయారు చేస్తుంది. ప్రజలు ఉపయోగించుకునేందుకు ఈ పేజీలను (హెచ్‌టిఎమ్ఎల్) కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లు తయారు చేస్తారు, ఈ పేజీలు మనల్ని చాలా వేగంగా, సులభమైన మార్గంలో ఇతర పేజీలకు తీసుకెళ్ళతాయి. దీనర్థం హైపర్‌లింకులపై కంప్యూటర్ మౌస్ తో క్లిక్ చేసినప్పుడు కంప్యూటర్ మనం చూడాలనుకున్న ఆ హైపర్ లింకున్న కొత్త పేజీని చూపుతుంది. ఎక్కువ హైపర్‌లింకులు నీలం రంగులో ఉంటాయి, కానీ అవి ఏ రంగులోనైనా ఉండవచ్చు. బ్రౌజర్ యొక్క కాష్ లో హైపర్ లింకును క్లిక్ చేసినట్లు గుర్తించుకున్నట్లుగా క్లిక్ చేయబడిన హైపర్ లింకు ముదురు నీలం రంగులోకి మారుతుంది. కాష్ క్లియరయితే తప్ప, ఈ లింకు ఎప్పుడూ ముదురు నీలం రంగులోనే ఉంటుంది. హైపర్ లింకులున్న కొత్త పేజీలను చూడాలనుకున్నప్పుడు లింకుపై నేరుగా అనగా మౌస్ లోని లెఫ్ట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా అదే పేజీ స్థానంలో కొత్త పేజీ ఒపెన్ అవుతుంది. అలాకాక మనం చూస్తున్న పేజీని అలాగనే ఉంచుకొని హైపర్ లింకులున్న కొత్త పేజీలను కొత్త టాబ్ లలో లేదా కొత్త విండోలో చూడాలనుకున్నప్పుడు మౌస్ లోని రైట్ బటన్ క్లిక్ చేయటం ద్వారా వచ్చే ఎంపికల నుంచి ఎన్నుకోవచ్చు.

లింకులు చేసే మార్గాలు

[మార్చు]

వెబ్ పేజీలో లింకు తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ వివిధ ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్లకు విభిన్నంగా ఉంటుంది.

Plain HTML

[మార్చు]

In .htm and .html files, a link can be created using this code:

<a href="http://www.example.com">Text of link</a>

వికీ వాక్యనిర్మాణం

[మార్చు]

మీడియావికీ వంటి వికీ వాక్యనిర్మాణం లింకులు తయారుచేయడానికి ఒక సులభమైన మార్గాన్ని ఉపయోగిస్తుంది. ఇదే వెబ్సైట్ యొక్క మరొక పేజీకి లింక్ సృష్టించడానికి:

[[పేజీ పేరు|లింక్ వచనం]] లేదా తిన్నగా [[పేజీ పేరు]].

బాహ్య వెబ్సైట్ కు లింకు కు:

[http://www.example.com Link text], [http://www.example.com], or just http://www.example.com.

BB code is used in forum software. To create a link:

[url]http://www.example.com[/url], or [url=http://www.example.com]Link text[/url]