అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్
గాలి నుండి కనిపించే ప్రేలుడు
దేశం  United States
పరీక్షా - శ్రేణి ఆపరేషన్ అప్‌షాట్ నాథోల్
పరీక్షా ప్రాంతం నావెడా పరీక్షా ప్రాంతం, ఏరియా - 5
తేదీ మే 8, 1953
పరీక్షా రకం ఎట్మాస్ఫెరిక్
ఫలితం 27 కె.టి

అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్ అనునది ఒక "కేంద్రక శస్త్ర పరీక్ష" (అణు పరీక్ష). ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో "ఆపరేషన్ అప్‌నాట్ - నోథోల్"లో భాగంగా చేసిన అణు పరీక్ష . ఈ పరీక్ష మే 8, 1953లో యు.ఎస్.లో గల "నెవాడా టెస్ట్ సైట్"లో గల "యుక్కా ప్లాట్"లో నిర్వహింపబడినది.[1]

పరీక్షా ప్రాంతము[మార్చు]

ఈ పరీక్షా సాధనం యొక్క సంకేతము "ఎన్‌కోర్"గా పిలువబడుతున్నది. ఇది స్థానిక సమయం 8:30 కు విస్పోటనం చెందినది. దీనిని 19,000 అడుగుల ఎత్తు నుండి ఎం.కె.6డి బాంబు ద్వారా విడిచారు. దీనిని "నెవాడా టెస్ట్ సైట్"లో గల ఏరియా 5 వద్ద విడిచారు. 2,423 అడుగుల వద్ద ఈ బాంబు ప్రేలినది. అయినప్పటికీ ఇది తన లక్ష్యం నుండి 15 అడుగుల పశ్చిమ , 937 అడుగుల దక్షిణం వైపున విస్ఫోటనం చెందినది. ఈ శస్త్రం యొక్క అంచనా ఫలితము 30-36 కిలో నాట్స్ అయినప్పటికీ ఇది 27 కిలో నాట్స్ ఫలితాన్ని ఇచ్చింది. "ఎన్‌కోర్" (Encore) అనే సంకేత పదంలో "E" అను అక్షరం "effects" (ప్రయత్నం). అనగా అస్త్రాల పరీక్షచేయు ప్రయత్నమని అర్థము.[2]

పరీక్షా ఫలితాలు[మార్చు]

ఈ అణు పరీక్ష "ఎన్‌కోర్" అనేక విషయాలను గూర్చి తెలుసుకొనే ప్రయత్నం అనగా విస్ఫోటన ఫలితాలను, చెట్లతోసహా వివరించుటకు చేయబడింది. కానీ "నెవాడా టెస్ట్ సైట్" అనునది ఒక ఎడారి. అందులో చెట్లు లేవు. "యునైటెడ్ ఫారెస్ట్ సర్వీసు" వారు 145 "పాండెరొసా పైన్" చెట్లను ఈ ప్రాంతానికి రవాణా చేశారు. ఈ చెట్లను సమీప ప్రాంతం నుండి "ఏరియా 5"కు చేర్చిరి. ఈ చెట్లను ఎడారి ప్రాంతంలో రంధ్రములు చేసి సిమెంటుతో నాటిరి. విస్ఫోటనం జరిగినపుడు ప్రాథమిక అణుధార్మిక వికిరణాలు వెలువడి అనేక చెట్లు మాడిపోయినవి.[3]

సైనికులు ఎడారిలోని రాళ్ళ అవశేషాలను బ్లాస్ట్ తీవ్రతను చూపడానికి తీసుకొని వచ్చారు.[4] దేశంలో గల 3,500 మంది సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కోంబాట్ బెటాలియన్ గా యేర్పడ్డారు. అదనంగా 600 మంది ఉన్నత స్థాయి అధికారులు , కాంగ్రెస్ వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూడటానికి హాజరైరి. ఈ కార్యక్రమం "సైనికులకు అణు ఆయుధాలను ఉపయోగించునపుడు తమను రక్షించుకొనుటకు , శతృవుల నుండి "కోంబాట్ పరిస్థితులు" నుండి రక్షించుకొనుటకు" నిర్దేశించబడింది.[5]

సూచికలు[మార్చు]

  1. U.S. Department of Energy / Nevada Operations Office, United States Nuclear Tests - July 1945 through September 1992, December 2000, DOE/NV-209 Rev 15 Archived 2006-10-12 at the Wayback Machine
  2. "Operation Upshot-Knothole". The Nuclear Weapon Archive. Archived from the original on 2013-05-15. Retrieved 2013-06-04.
  3. Finkbeiner, Ann (31 May 2013). "How Do We Know Nuclear Bombs Blow Down Forests?". Slate.com. Retrieved 31 May 2013.
  4. Operation UPSHOT-KNOTHOLE Fact Sheet Archived 2013-02-18 at the Wayback Machine, Defense Threat Reduction Agency
  5. "Photo Details". United States Department of Energy. Archived from the original on 1 ఫిబ్రవరి 2014. Retrieved 1 June 2013.