అంతర్జాతీయ రంగుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ రంగుల దినోత్సవం
అంతర్జాతీయ రంగుల దినోత్సవం
అంతర్జాతీయ రంగుల దినోత్సవ లోగో
అధికారిక పేరుఅంతర్జాతీయ రంగుల దినోత్సవం
యితర పేర్లురంగుల దినోత్సవం
జరుపుకొనేవారు30కి పైగా దేశాలలో
జరుపుకొనే రోజుమార్చి 21
సంబంధిత పండుగరంగులు
అంతర్జాతీయ రంగు సంఘం
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

అంతర్జాతీయ రంగుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.[1] ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన విషయాలలో ఒకటైన రంగు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడానికి అంతర్జాతీయ రంగు సంఘం ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుపుకుంటారు.[2]

నేపథ్యం[మార్చు]

2008లో పోర్చుగీస్ కలర్ అసోసియేషన్ సంస్థ అంతర్జాతీయ రంగు దినోత్సవాన్ని ప్రతిపాదించింది. సంస్థ అధ్యక్షుడు మరియా జోవా దురావ్ Archived 2016-04-25 at the Wayback Machine ఈ దినోత్సవ ప్రతిపాదనను అంతర్జాతీయ రంగు సంఘానికి సమర్పించాడు.[3] అంతర్జాతీయ రంగు సంఘంలోని 30కి పైగా దేశాల ప్రాతినిధ్య జాతీయ సంఘాలచే 2009లో ఈ ప్రతిపాదన అంగీకరించబడింది.

మార్చి 21 తేది ఎంపిక[మార్చు]

ప్రతి సంవత్సరం, మార్చి 21 “విషువత్తు” చుట్టూ, రాత్రిపగలు సుమారు సమానంగా ఉంటాయి. కాంతి - చీకటి, కాంతి - నీడ పరిపూరకరమైన స్వభావానికి సంబంధించినదని మానవ సంస్కృతులలో వ్యక్తీకరించబడింది. కాబట్టి మార్చి 21 ఎంపిక చేయబడింది.

లోగో[మార్చు]

లోగో రూపకల్పనకు సంబంధించి అంతర్జాతీయంగా పోటీ నిర్వహించారు. 2012లో తైవాన్లోని తైపీలో జరిగిన ఇంటర్నేషనల్ కలర్ అసోసియేషన్ సమావేశంలో విజేతను ప్రకటించారు."రెండు వృత్తాలు ఒక కన్నును ఏర్పరుస్తాయి, సమానమైన ఇంద్రధనస్సు రంగు నలుపు కాంతి, చీకటిని సూచిస్తుంది, పగలు రాత్రి, ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ రంగు దినోత్సవం సందర్భంగా ఒకరి కన్నును విందు చేస్తారు" అని హాంకాంగ్ కి చెందిన డిజైనర్ హోసన్నా యౌ వ్యక్తం చేశాడు.

కార్యకలాపాలు[మార్చు]

అంతర్జాతీయ రంగు దినోత్సవం సందర్భంగా కార్యకలాపాలు:

  • కళల ప్రదర్శనలు, నిర్మాణ ప్రాజెక్టులు, డిజైన్, అలంకరణ, ఫ్యాషన్. . . .
  • సమావేశాలు, చర్చలు, సదస్సులు. . .
  • పెద్దలు, పిల్లలకు రంగు - కాంతి వాడకంపై వర్క్‌షాప్‌లు.
  • రంగు రూపకల్పనపై పోటీలు.
  • జాతీయ లేదా ప్రాంతీయ గుర్తింపు రంగులను ధరించడం.

మూలాలు[మార్చు]

  1. Begum-Hossain, Momtaz (2021-03-14). "International Colour Day 2021: 21 March #RainbowFest". Craft and Travel. Retrieved 2021-03-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "AIC - International Colour Association - home". aic-color.org. Retrieved 2021-03-21.
  3. "AIC - International Colour Association - NEWS" (PDF). aic-color.org. Archived from the original (PDF) on 2021-05-08. Retrieved 2021-03-21.

అంతర్జాతీయ రంగు దినం[మార్చు]

  • [1] ఆస్ట్రేలియా
  • [2] బ్రెజిల్
  • [3] చిలీ
  • [4] Archived 2016-03-04 at the Wayback Machine థాయిలాండ్
  • [5] నెదర్లాండ్స్
  • [6] పాకిస్తాన్
  • [7] యునైటెడ్ స్టేట్స్
  • [8] Archived 2022-10-12 at the Wayback Machine స్పానిష్‌లో ఈ దినోత్సవం గురించి
  • [9] Archived 2022-10-09 at the Wayback Machine దినోత్సవ లోగో పోటీ