అజీమ్ ప్రేమ్‌జీ
| అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ | |
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 31, 2009 న జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షికోత్సవంలో ప్రసంగిస్తున్న అజీమ్ ప్రేమ్‌జీ |
|
| జననం | జూలై 24 1945 (వయసు 67) ముంబై, |
|---|---|
| నివాసం | బెంగుళూరు, [1] |
| మతం | ఇస్లాం |
| భార్య/భర్త | యాస్మీన్ ప్రేమ్‌జీ |
| సంతానం | రిషద్ & తారిఖ్[2] |
అజీమ్ ప్రేమ్‌జీ (జననం:జులై 24, 1945) గుజరాత్ కు చెందిన ప్రముఖ ఇంజనీరు, మరియు పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థ కు అధ్యక్షుడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ప్రేమ్‌జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు. [3]
వ్యక్తిగత జీవితం [మార్చు]
అజీమ్ ప్రేమ్‌జీ గుజరాత్ నుంచి వచ్చి ముంబై లో నివసిస్తున్న ఒక షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఆయన తండ్రి ఎం.హెచ్. ప్రేమ్‌జీ వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రాడక్ట్ కంపెనీ (దీన్నే తరువాత విప్రో గా మార్చడం జరిగింది)అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ వంటనూనెలు ఉత్పత్తి చేసేది. ఆయన తాత బర్మా లో బియ్యం వ్యాపారం చేసేవాడు. అజీమ్ తండ్రిని మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ కు వెళ్ళమన్నా ఆయన వెళ్ళలేదు.[4]
ముంబై లోని సెయింట్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లో ఎలక్ట్రికల్ ఇంజనీరింలో విద్య నభ్యసిస్తుండగా తండ్రి 1966 లో హఠాత్తుగా కన్నుమూయడంతో చదువును అర్ధాంతరంగా వదిలిపెట్టి వ్యాపార వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది.అప్పటికి ఆయన వయసు 21 ఏళ్ళు. తరువాత ముప్ఫై ఏళ్ళకు మళ్ళీ పట్టుబట్టి అక్కడ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.[5]
మూలాలు [మార్చు]
- ↑ "The World's Billionaires #83 Azim Premji". Forbes.com. November 3, 2009. Retrieved 7 December 2009.
- ↑ "What you didn't know about Rishad Premji". Rediff. June 7, 2007. Retrieved 7 December 2009.
- ↑ "The World's Billionaires". Forbes. March 3, 2009. Retrieved 2009-03-16.
- ↑ http://connect.in.com/azim-premji/biography-392.html
- ↑ http://profiles.incredible-people.com/azim-hashim-premji/