అన్యా'స్ ట్యుటోరియల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్యా'స్ ట్యుటోరియల్
తరంసైకలాజికల్ థ్రిల్లర్
రచయితసౌమ్య శర్మ
దర్శకత్వంపల్లవి గంగిరెడ్డి
తారాగణంరెజీనా కసాండ్రా
నివేదితా సతీష్
సంగీతంఅర్రోల్ కొరెల్లి
దేశంభారతదేశం
అసలు భాషలుతెలుగు
తమిళం
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
Producersశోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
ఛాయాగ్రహణంవిజయ్ కె. చక్రవర్తి
ఎడిటర్రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ కంపెనీఆర్కా మీడియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఆహా ఓటీటీ
వాస్తవ విడుదల2022 జూలై 1 (2022-07-01)

అన్యా'స్ ట్యుటోరియల్ 2022లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఆర్కా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించింది. రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్, అనుజ్ గుర్వారా ప్రధాన పాత్రల్లో నటించిన టీజర్‌ను జూన్ 10న నటుడు ప్రభాస్‌ విడుదల చేయగా[1], ట్రైలర్‌ను జూన్ 18న విడుదల చేసి[2], వెబ్ సిరీస్‌ను 2022 జులై 1న ఆహా ఓటీటీలో[3] తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలైంది.[4]

కథ[మార్చు]

అన్య (నివేదితా సతీష్), మధు (రెజీనా కెసాండ్రా) అక్కాచెల్లెళ్లు. అన్య ఒక సోషల్ ఇన్‌ఫ్లియెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంటుంది. తన చెల్లి మధు ప్రొఫెషన్ అంటే అన్యకు అస్సలు నచ్చదు. కానీ అనుకోకుండా ఒక రోజు మొత్తం మారిపోతుంది ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది ? ఆ తరువాత ఏమైంది అనేదే మిగతా కథ.[5]

నటీనటులు[మార్చు]

  • రెజీనా కసాండ్రా
  • నివేదితా సతీష్
  • అనుజ్ గుర్వారా
  • ప్రమోదిని పమ్మి
  • సమీర్ మల్ల
  • కామాక్షి భాస్కర్ల
  • ఫల్గుణి నాయుడు
  • శ్రీతేజ ప్రసాద్
  • లావణ్య రెడ్డి
  • బేబీ నందిత
  • బేబీ దివ్య

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఆర్కా మీడియా
  • నిర్మాత: శోభు యార్లగడ్డ[6], ప్రసాద్ దేవినేని
  • కథ, స్క్రీన్ ప్లే : సౌమ్య శర్మ
  • మాటలు: సౌమ్య శర్మ, పల్లవి గంగిరెడ్డి
  • దర్శకత్వం:పల్లవి గంగిరెడ్డి
  • సంగీతం: అర్రోల్ కోరెల్లి
  • సినిమాటోగ్రఫీ: విజయ్ కె చక్రవర్తి

మూలాలు[మార్చు]

  1. Hindustantimes Telugu (11 June 2022). "అన్యాస్‌ ట్యుటోరియల్‌ టీజర్‌ లాంచ్‌ చేసిన ప్రభాస్‌". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  2. TV9 Telugu (19 June 2022). "అన్యా'స్ ట్యుటోరియల్ ట్రైలర్‏కు అనుహ్య స్పందన.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే." Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 10TV Telugu (16 July 2021). "'ఆహా' లో మరో అద్భుతమైన వెబ్ సిరీస్." (in Telugu). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. V6 Velugu (11 June 2022). ""అన్యా'స్ ట్యుటోరియల్" ఆహా'లో జులై 1నుంచి స్ట్రీమింగ్". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. A. B. P. Desam (1 July 2022). "'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  6. The New Indian Express (12 July 2022). "Comedies, large spectacle films seem to be doing well: Producer Shobu Yarlagadda" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.

బయటి లింకులు[మార్చు]