అలయ్ బలయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈద్ పండగ వలెనే అలయ్ బలయ్ పర్వదినాన ముస్లిమ్లు ఒకరినొకరు కౌగిలించుకుని అలయ్ బలయ్ చెప్పుకుంటారు

తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్.ముఖ్యంగా దసరా సందర్భంగా నిర్వహిస్తారు పండుగనాడు సాధారణంగా అందరూ ఇంట్లో ఉంటారు.. తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకోవడం ద్వారా అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 29.9.2009 న అలయ్ బలయ్‌ అంటే స్నేహసమ్మేళనం బి.జె.పి.నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేశారు.ఈ సందడిలో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను చూసి ముగ్ధుడైన అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ పాటలు పాడారు. ప్రజాకవి గోరటి వెంకన్న తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని వివరిస్తూ పాటలు పాడారు. లయబద్ధంగా చిందేస్తూ అందర్నీ ఉర్రూతలూగించారు. తెలంగాణ జానపద కళారూపాలైన ఒగ్గుకథ లు, గోండు నృత్యం, పీర్లు, గొర్లకాపరులు, పోతరాజులు, సాధ్యశూరులు, బోణాలు, బంతిపూల బతుకమ్మ లు, గంగిరెద్దులు, సీతమ్మ జడకొప్పులు వంటి వాటితోపాటు, కోలాటాలు, భజనకీర్తనలు, సన్నాయి బాజాలు, జమిడిక మోతలు, బోనాలు, ఘటాలు, వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి.తెలంగాణా వంటకాలు సద్దఅప్పలు, జొన్నరొట్టెలు, మక్కగారెలు, మాలీదా, యాటవేపుడు, కోడిపులుసు, పొట్టురొయ్యలు, గుడాలు, బుడాలు, అటుకుల చుడువా వడ్దించారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అలయ్_బలయ్&oldid=3262839" నుండి వెలికితీశారు