ఆకేపాటి అమరనాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకేపాటి అమరనాథరెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1962
ఆకేపాడు గ్రామం, రాజంపేట మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి జ్యోతి
సంతానం సాయి భరత్ కుమార్, సాయి సహన

ఆకేపాటి అమరనాథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో రాజంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] ఆకేపాటి అమరనాథరెడ్డి 2021లో కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఆకేపాటి అమ‌ర‌నాథ‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క‌డ‌ప జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షునిగా ప‌ని చేశాడు. ఆయన 2009లో రాజంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

ఆకేపాటి అమ‌ర‌నాథ‌రెడ్డి 2009లో ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజ‌కీయం ప‌రిణామాలు నేపథ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేపథ్యంలో ఆయనపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో తిరిగి ఆయ‌న వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఆ తరువాత ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్డ్ గా పని చేశాడు.

2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన మేడా వెంకట మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆకేపాటి అమ‌ర‌నాథ‌రెడ్డికి రాజంపేట సీటు ద‌క్క‌లేదు. ఆయన ఆ తరువాత వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ 2021లో రాజంపేట జెడ్ప‌టీసీ స‌భ్యుడిగా ఎన్నికై కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. CEO Telangana (2009). "Akepati Amaranathareddy Affidavit" (PDF). Archived from the original (PDF) on 12 June 2022. Retrieved 12 June 2022.
  2. Andhra Jyothy (22 September 2021). "జడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  3. Sakshi (18 March 2019). "ఓ నియోజకవర్గం.. ముగ్గురు తొలి ఎమ్మెల్యేలు." Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.