ఇంద్రసేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రసేన
దర్శకత్వంజి.శ్రీనివాసన్
రచనజి.శ్రీనివాసన్
నిర్మాతరాధికా శరత్ కుమార్
ఫాతిమా విజయ్ ఆంథోని
నీలం కృష్ణారెడ్డి (తెలుగు)
తారాగణంవిజ‌య్ ఆంటోని
డయానా చంపిక
మహిమా
ఛాయాగ్రహణంకె.దిల్‌రాజు
కూర్పువిజ‌య్ ఆంటోని & శ్రేయాస్ కె.ఎస్
సంగీతంవిజ‌య్ ఆంటోని
నిర్మాణ
సంస్థలు
ఆర్‌.స్టూడియోస్‌
విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌
విడుదల తేదీ
30 నవంబర్ 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇంద్రసేన 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఆర్‌.స్టూడియోస్‌, విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్ పై రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మించిన ఈ సినిమాకు జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వం వహించగా తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేశాడు.[2] విజ‌య్ ఆంటోని, డయానా చంపిక, మహిమా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘అన్నాదురై’ పేరుతో తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో 30 న‌వంబ‌ర్ 2017న విడుదలైంది.

కథ[మార్చు]

ఇంద్రసేన (విజయ్ ఆంటోనీ), రుద్రసేన(విజయ్ ఆంటోనీ) ఇద్దరు కవలలు. ఇంద్రసేన తన కుటుంబ వారసత్వంగా వచ్చిన బట్టల షాపు చూసుకుంటు, తను ప్రేమించిన అమ్మాయి చనిపోయిందనే బాధతో మద్యానికి బానిసవుతాడు. రుద్రసేన స్కూల్లో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. తన వల్ల కుటుంబం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఇంద్రసేన మారుదామని అనుకుంటున్న సమయంలో ఆ మద్యం మైకంలో ఒక వ్యక్తిని చంపి జైలుకెళ్తాడు. అక్కడి నుంచి బయటికొచ్చేసరికి తన తమ్ముడు పెద్ద రౌడీగా మారతాడు. రుద్రసేన అలా మారడానికి కారణాలు ఏంటి ? ఇంద్రసేన ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఆర్‌.స్టూడియోస్‌, విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌
  • నిర్మాత: నీలం కృష్ణారెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.శ్రీనివాసన్
  • మాటలు, పాటలు: భాష్యశ్రీ
  • కొరియోగ్రఫీ: కల్యాణ్‌
  • ఫైట్స్: రాజశేఖర్‌
  • ఆర్ట్‌: ఆనంద్‌ మణి
  • ఎడిటర్‌ & సంగీతం: విజ‌య్ ఆంటోని
  • సినిమాటోగ్రఫీ: కె.దిల్‌రాజు
  • లైన్‌ ప్రొడ్యూసర్‌: శాండ్రా జాన్‌సన్‌

మూలాలు[మార్చు]

  1. Zee Cinemalu (10 November 2017). "ఇంద్రసేన" (in ఇంగ్లీష్). Retrieved 10 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Sakshi (14 October 2017). "లోకంపై దండెత్తే ఇంద్రసేన". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  3. The Hindu (30 November 2017). "'Indrasena' review: Twin battles but no hope" (in Indian English). Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంద్రసేన&oldid=3703583" నుండి వెలికితీశారు