ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్
Classification and external resources
ICD-10 K58
ICD-9 564.1
DiseasesDB 30638
MedlinePlus 000246
eMedicine med/1190
MeSH D043183

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ లేదా ఐ. బి. ఎస్‌ పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే వ్యాధి. ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్న వారిలో, గతంలో పెద్దపేగులు, జీర్ణవ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో పట్టేసినట్లు నొప్పి ఉండి, దైనందిన కార్యక్రమాలకు చాలా వరకు అంతరాయం కలిగిస్తుంది. ఈ సిండ్రోమ్‌వల్ల తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు, ప్రయాణాలలో చాలా ఇబ్బంది పడతారు. ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత ఉదృతం చేస్తాయి.

కారణాలు[మార్చు]

ఐబీఎస్‌కి ప్రత్యేక కారణమంటూ ఇప్పటి వరకు తెలియలేదు. అయితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల బారినపడిన వారిలో పెద్దపేగుకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లకు గరైన వారిలో ఆరు రెట్లు ఐబీఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఇన్‌ఫెక్షన్లు పెద్దపేగులో బాక్టీరియా పెరుగుటకు దోహదం చేస్తుంది. కొందరు వ్యక్తులతో తీసుకునే ఆహారపదార్థాల ద్వారా పెద్దపేగుల్లోని కండరాలు అసాధారణంగా స్పందించడం ద్వారా కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఐబీఎస్ రావడానికి కారణమవుతాయి.

లక్షణాలు[మార్చు]

 • మలవిసర్జన సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం జరుగుతుంది. మలబద్ధకం ఉంటుంది. కొన్నిసార్లునీళ్ల విరేచనాలు అవుతాయి.
 • మలవిసర్జన సాఫీగా జరగనట్టు అనిపిస్తుంది. మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది.
 • కడుపు ఉబ్బరం, నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
 • ఉదయం లేవగానే త్వరగా విసర్జనకు వెళ్లాల్సి రావడం, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది.
 • భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.

వ్యాధి నిర్ధారణ[మార్చు]

మలపరీక్ష చేయడం ద్వారా బ్యాక్టీరియా, అమీబిక్ సిస్ట్‌లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే జీర్ణం కాని ఆహారపదార్థాలు వస్తున్నాయా అనే విషయాన్ని కనుక్కోవచ్చు. దీనిద్వారా సిలియాక్ డిసీజ్, మాల్ అబ్జార్బ్షన్ ఉందా అనేది తెలుస్తుంది. వీటితో పాటు సీబీపీ, ఈఎస్ఆర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొలనోస్కోపి పరీక్ష ద్వారా పెద్దపేగుల్లో ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయా తెలుసుకోవచ్చు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ జబ్బులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుస్తుంది.

జాగ్రత్తలు[మార్చు]

 • ఆహార పదార్థాల్లో ఎక్కువ మసాలాలు, అతి కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
 • పాలు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
 • చల్లని లేదా అతి వేడిగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
 • కాఫీ ఎక్కువగా తీసుకోవడం,అతిగా మద్యపానం చేయడం, దూమపానం మానేయాలి.
 • తినే ఆహార పదార్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.
 • వ్యక్తిగత శుభ్రత పాటించాలి. టాయిలెట్ వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 • మలబద్దక సంబంధితమైన ఐబిఎస్ (ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్) ఉంటే ఎక్కువగా పండ్లు, పీచుపదార్థాలు, అధికంగా నీరు తీసుకోవాలి.
 • నీటి విరేచనా సంబంధితమైన ఐబిఎస్ ఉంటే పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పాలపదార్థాలు తీసుకోకూడదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం అలవర్చుకోవాలి., రోజూ గంట పాటు వ్యాయామం చేయాలి.

హోమియో వైద్యం[మార్చు]

హోమియోలో వ్యక్తి మానసికి ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే మందులు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చు.

 • అర్జెంటినమ్ నైట్రికమ్‌  : తీవ్రమైన ఆందోళన, గాబరా ఎక్కువగా ఉండటం, బయటకు వెళ్లే ముందు మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.
 • నక్స్‌వామికా : విపరీతమైన కోపం, చిరాకు ఉంటుంది. ఎక్కువగా మసాలా పదార్థాలు ఇష్టపడతారు. టాయిలెట్‌కి వెళ్లినపుడు మలవిసర్జన వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ జరగదు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఉపయోగకరమైన మందు.
 • ఆర్సెనిక్ ఆల్బమ్‌  : ఏదైనా బయటకు ఆహారపదార్థాలు తినగానే విరేచనాలు అవుతాయి. ఇవేకాకుండా పల్సటిల్లా, అల్‌సొకట్రినా, లైకోపోడియం మందులు బాగా పనిచేస్తాయి.