ఇస్మైల్ తుఫాను
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
Category 1 tropical cyclone (SSHS) | |
---|---|
కాలిఫోర్నియా తీరం దాటే ముందు తుపాను దృశ్యం | |
ఏర్పడిన తేదీ | September 12, 1995 |
సమసిపోయిన తేదీ | September 16, 1995 |
అత్యధిక గాలులు | 1-minute sustained: 130 km/h (80 mph) |
అత్యల్ప పీడనం | 983 hPa (mbar) |
మరణాలు | 116 direct |
నష్టం | $26 million (1995 USD) |
ప్రభావిత ప్రాంతాలు | మెక్సికో |
Part of the 1995 Pacific hurricane season |
ఇస్మైల్ హరికేన్ - ఇది బలహీనమైనదైనా చాలా ప్రమాదకరమైన పసిఫిక్ హరికేన్. ఈ తుఫాను ధాటికి ఉత్తర మెక్సికోలో వంద మందికి పైగా మృతి చెందారు. ఇది 1995 సెప్టెంబరులో సంభవించింది. ఇది సెప్టెంబరు 12న ఒక అల్పపీడనంగా ఏర్పడింది. తరువాత క్రమేణా ఈశాన్యంవైపు కదులుతూ బలపడింది. ఇస్మైల్ హరికేన్ సెప్టెంబరు 14 నాటికి 210 మైళ్ళ (340 km) వేగాన్ని సాధించింది. అప్పటికే మెక్సికో తీరాన్ని చేరినా కాలిఫోర్నియా వరకు ఇది కొనసాగింది. చివరకు టొపొలోబామొ రాష్ట్రంలోని సినలావోలో గంటకు 80 మైళ్ళ (130 km/h) వేగమైన గాలులతో తీరాన్ని తాకింది. ఇస్మైల్ భూమిపై వేగంగా బలహీనపడి సెప్టెంబరు 16న చెదిరిపోయింది.
తీరం వెంబడి, ఇస్మైల్ 30 అడుగుల (9 m) ఎత్తైన అలలు పుట్టించింది. వందలమంది మత్స్యకారులు ఇది మరింత వేగంగా కదులుతుందని భావించారు. అయినా ఇందుకు సిద్ధంగా లేరు. ఫలితంగా 52 ఓడలు శిథిలమయ్యాయి. దీనివల్ల 57 మంది మత్స్యకారులు చనిపోయారు. ఇస్మైల్ కారణంగా మెక్సికో ప్రధాన భూభాగంలో 59 మరణాలు సంభవించాయి. $26 మిలియన్ ల ఆస్తి నష్టం (1995 డాలర్లు, $41.8 USD) జరిగింది. హరికేన్ వినాశనం వల్ల వేల ఇళ్ళు నాశనం అయ్యాయి. 30,000 మంది నిరాశ్రయులు అయ్యారు. యునైటెడ్ స్టేట్స్ లో దీనివల్ల భారీ వర్షపాతం, స్థానికంగా మోస్తరు వర్షం కురిసింది, ఈ వర్షం వల్ల కూడా నష్టం జరిగింది.
వాతావరణ శాస్త్ర చరిత్ర
[మార్చు]గ్వాటెమాలకు సుమారు 170 మైళ్ళ (270 కిలోమీటర్లు) దూరంగా సెప్టెంబరు 9న ఒక అల్పపీడనం కొనసాగింది. తరువాత ఆ మాంద్యం వాయవ్య దిశగా కదిలి, తీవ్రమై ఉష్ణమండల ఇస్మైల్ తుఫానుగా సెప్టెంబరు 13న ప్రారంభమైంది. మొదట్లో తుఫాను వాయవ్యంగా కదిలినా బాజా కాలిఫోర్నియా పైన ఉన్న ద్రోణికి ప్రతిస్పందనగా క్రమంగా ఉత్తరానికి మారింది. అటువంటి మార్పు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారు, అయితే వారు ట్రాక్ కారణంగా అనిశ్చితి గుర్తించారు. ఇస్మైల్ ఉత్తరంవైపుకు కదులుతూ క్రమంగా బలోపేతం అయ్యింది. అయితే ఇది మొదట్లో ఉన్నంత బలంగా అవ్వడంలో గణనీయంగా విఫలమైంది. సెప్టెంబరు ప్రారంభంలో ఉన్నప్పటికి గాలులు గంటకు 70 మైళ్ళ వేగానికి (గంటకు 110 కిలోమీటర్లు) పడిపోయాయి. తరువాత సెప్టెంబరు 14న అది తీవ్రమైంది ఆ సమయంలో ప్వెర్టో వల్ళార్టకు 210 మైళ్ళ (340 కిలోమీటర్ల) దూరంలో ఉన్నది .[1]
సన్నాహాలు
[మార్చు]ప్రారంభంలో, ఇస్మైల్ తుఫాను పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంటుందని అంచనా వేశారు . అయితే అది ఉత్తరంవైపుకు ప్రయాణం కొనసగించడం స్పష్టమైన వెంటనే మెక్సికో ప్రభుత్వం ఉష్ణమండల తుఫాను హెచ్చరిక జారీ చేసింది. తుఫాను రాక ముందు 1,572 మందిని ఐదు అత్యవసర ఆశ్రయాలకు తరలించారు.[2]
ప్రభావం
[మార్చు]వాయువ్య మెక్సికో వైపు కదులుతున్న తుఫాను, మోస్తరు నుంచి భారీ వర్షపాతం సహా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 7.76 inches (197 mm) వర్షపాతం నమోదు అయ్యింది, ఫలితంగా నాలుగు మున్సిపాలిటీలను వరదలు ముంచెత్తాయి. మార్గంలోని 373 కార్డ్బోర్డ్ ఇళ్ళు నాశనం అయ్యయి, 4,790 దెబ్బతిన్నవి. చివరకు 177 ఇళ్ళకు త్రాగునీటి సదుపాయం లేకుండా, నాలుగు మున్సిపాలిటీలు విద్యుత్తు లేకుండా చేసింది.[3]
పరిణామాలు
[మార్చు]హరికేన్ ప్రభావం గడవంగానే, ఉపబల కార్మికులు త్వరగా కమ్యూనికేషన్ నెట్వర్క్ కు మరమ్మతులు చేశారు, ఇతర కార్మికులు సొనరా లోని బాధితుల సాయం చేశారు. మెక్సికన్ ప్రభుత్వం $4.5 మిలియన్ (1995 డాలర్లు, $34 మిలియన్ 1995 MXN, $7.23 మిలియన్ 2018 డాలర్లు) నిధులు ఇళ్ళు పునరుద్ధరణ , మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది. అధికారులు 4,800 షీట్లు, 500 మెత్తలు, 1,500 దుప్పట్లు పంపిణీ చేశారు. దెబ్బతిన్న అన్ని ఓడలను, మునిగిపోయిన మృతదేహాలు డైవర్స్ చివరకు వెలికితీశారు.[4]
సూచనలు
[మార్చు]- ↑ Britt Max Mayfield (1995-09-12). "Tropical Storm Ismael Discussion Two". National Hurricane Center. National Oceanic and Atmospheric Administration. Retrieved 2018-05-23.
- ↑ El Presidente de la Comisión Nacional (1996-07-30). "La Recomendación 64/96, del 30 de julio de 1996 por Huracan Ismael" (in Spanish). Comisión Nacional de los Derechos Humanos. Archived from the original on 2010-09-03. Retrieved 2018-05-23.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Daniel Bitrán Bitrán (2001). "Caracterásticas del Impacto Socioeconómico de los Principales Desastres Ocurridos en México en el Período 1980 – 99" (PDF) (in Spanish). Centro Nacional de Prevención de Desastres. Archived from the original (PDF) on 2006-11-11. Retrieved 2018-05-23.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Kuroiwa, Koji (2009-09-01). "Regional Association IV (North America, Central America and the Caribbean) Hurricane Operational Plan 2009 Edition" (PDF). World Meteorological Organization. Retrieved 2018-05-23.