ఉర్ఫీ జావేద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉర్ఫీ జావేద్
2021లో ఉర్ఫీ జావేద్
జననం (1997-10-15) 1997 అక్టోబరు 15 (వయసు 26)
లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లుUrfi Javed
విద్యమాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్
విద్యాసంస్థసిటీ మాంటిస్సోరి స్కూల్, లక్నో
అమిటీ యూనివర్సిటీ, లక్నో
వృత్తి
  • నటి
  • మోడల్
  • ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం

ఉర్ఫీ జావేద్ (ఆంగ్లం: Uorfi Javed) (జననం 1997 అక్టోబరు 15) ఒక భారతీయ టెలివిజన్ నటి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1997 అక్టోబరు 15న ఉర్ఫీ జావేద్ జన్మించింది.[1] ఆమె లక్నోలోనే చదువు పూర్తి చేసింది. సిటీ మాంటిస్సోరి స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. అమిటీ యూనివర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పొందింది.[2] 2017 నుంచి ఒక సంవత్సరం పాటు ఆమె మేరీ దుర్గా సహనటుడు పరాస్ కల్నావత్‌తో డేటింగ్ లో ఉంది.[3] 2022లో న్యూమరాలజిస్ట్ సలహా మేరకు తన పేరు ఉచ్ఛరణ మారకుండా స్పెల్లింగ్‌లో మార్పు చేసుకుంది.[4][5][6]

కెరీర్[మార్చు]

2016లో సోనీ టీవీ ప్రసారం చేసిన బడే భయ్యా కి దుల్హనియాలో అవనీ పంత్‌గా ఉర్ఫీ జావేద్ ఆలరించింది.[7] ఆమె స్టార్ ప్లస్ లో 2016 నుండి 2017 వరకు చంద్ర నందినిలో ఛాయా పాత్ర పోషించింది. ఆ తర్వాత స్టార్ ప్లస్ ప్రసారం చేసిన మేరీ దుర్గాలో ఆమె ఆర్తి పాత్ర పోషించింది.[8] 2018లో ఆమె సబ్ టీవి సాత్ ఫెరో కి హేరా ఫెరీలో కామినీ జోషిగా, కలర్స్ టీవి బేపన్నాలో బెల్లా కపూర్‌గా, స్టార్ భారత్ జిజి మాలో పియాలీగా అలాగే &టీవి దయాన్‌లో నందినిగా నటించింది.[9][10] 2020లో యే రిష్తా క్యా కెహ్లతా హైలో శివాని భాటియాగా ఆమె చేసింది.[11] ఆ తర్వాత కసౌతి జిందగీ కేలో తనీషా చక్రవర్తిగా ఆమె నటించింది.[12] ఆమె బిగ్ బాస్ OTT మొదటి సీజన్‌లో పోటీ పడింది.[13] 2022లో కున్వార్‌తో కలిసి ఆమె ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది.[14][15]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

టెలివిజన్[మార్చు]

Year Show Role Ref(s)
2016 బడే భయ్యా కి దుల్హనియా అవనీ పంత్
2016–2017 చంద్ర నందిని యువరాణి ఛాయా
2017 మేరీ దుర్గా ఆర్తి సింఘానియా
2018 సాత్ ఫేరో కీ హేరా ఫెరీ కామినీ జోషి
బేపన్నాః బెల్లా కపూర్
జిజి మా శ్రావణి పురోహిత్/ పియాలీ సెహగల్
2018–2019 దయాన్ నందిని
2020 యే రిష్తా క్యా కెహ్లతా హై అడ్వోకేట్ శివాని భాటియా
కసౌతి జిందగీ కే తనీషా చక్రవర్తి
ఆయ్ మేరే హమ్సఫర్ పాయల్ శర్మ [16]

వెబ్ సిరీస్[మార్చు]

Year Show Role Ref(s)
2021 పంచ్ బీట్ 2 మీరా [17]
బిగ్ బాస్ OTT పోటీదారు

మూలాలు[మార్చు]

  1. Grace Cyril (December 23, 2021). "I don't believe in Islam, I am reading the Bhagavad Gita, says Urfi Javed". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-04-12.
  2. Cyril, Grace (29 November 2021). "Who is Urfi Javed and why is everyone talking about her?". India Today.
  3. Kumar, Aakash (2018-04-26). "'Meri Durga' actors Paras Kalnawat and Urfi javed no more together!". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-04.
  4. "Actress Urfi Javed Changes her Instagram Bio Name to Uorfi". news18.com. 7 May 2022.
  5. "Urfi Javed changes her name to Uorfi". indiatimes.com. 10 June 2022.
  6. Grace Cyril (11 June 2022). "Urfi Javed reveals why she changed her name to Uorfi". indiatoday.in.
  7. "Urfi Javed sets hearts racing with these bold pictures". Times of India (in ఇంగ్లీష్).
  8. "Meri Durga actors Urfi Javed and Vicky Ahuja join &TV's Daayan". Tellychakkar (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-06. Retrieved 2022-08-11.
  9. "This actress is all set to enter Jennifer Winget and Harshad Chopda's Bepannaah". India Today (in ఇంగ్లీష్).
  10. "Charu Asopa replaces Urfi Javed in 'Jiji Maa'". The Times of India.
  11. "Yeh Rishta Kya Kehlata Hai: Urfi Javed to enter as Trisha's lawyer". ABP Live (in ఇంగ్లీష్). 23 February 2020.
  12. "Urfi Javed to enter Kasautii Zindagii Kay post leap". ABP Live (in ఇంగ్లీష్). 3 March 2020.
  13. "Urfi Javed Wears A 'Single Knot' Top Exposing Her Assets, Gets Trolled "Urfi Presents The Great Indian Circus"". Koimoi (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-01. Retrieved 2022-03-01.
  14. "Befikra (Official Video) - Kunwarr ft. Urfi Javed - Dhruv G - New Punjabi Songs 2022". Youtube.
  15. "Urfi Javed - बीबी ओटी फेम उर्फी जावेद अपने गाने 'बेफिक्रा' के प्रचार में नजर आए". Tollywood Life Facebook.
  16. "Urfi Javed surprises her co-actors with some healthy food". The Times of India.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. Sana Farzeen (29 June 2021). "Puncch Beat 2 first impression: The curse of second season takes down Siddharth Sharma-Priyank Sharma show". indianexpress.com. Retrieved 29 November 2021.