ఐరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐరా
దర్శకత్వంసర్జున్
రచనప్రియాంక రవీంద్రన్
నిర్మాతకోటపాడి జె రాజేష్
తారాగణంనయన తార
యోగి బాబు
ఛాయాగ్రహణంసుదర్శన్ శ్రీనివాస్
కూర్పుకార్తీక్ జోగేష్
సంగీతంసుందర మూర్తి కె.ఎస్
నిర్మాణ
సంస్థ
కేజేఆర్ స్టూడియోస్
విడుదల తేదీ
2019 మార్చి 28 (2019-03-28)
సినిమా నిడివి
142 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఐరా 2019లో విడుదలైన తెలుగు సినిమా. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కోటపాడి జె రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు సర్జున్ దర్శకత్వం వహించాడు. నయనతార, యోగిబాబు, జయప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 మార్చి 28న విడుదలైంది.[1]

కథ[మార్చు]

యమున (నయనతార) వైజాగ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటుంది. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందని ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తారు. యమున ఇష్టం లేని ఉద్యోగంతోపాటు పెళ్లిని తప్పించుకోవడం కోసం ఇంట్లో చెప్పకుండా ఒంగోలులోని తన అమ్మమ్మ (లీలావతి) ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లిన ఆమె ఆ ఊర్లో ఉంటూ దెయ్యాలపై కొన్ని వీడియోలు తీసి యూ ట్యూబ్ లో పెడుతూ జనాలని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో యమున బామ్మ చనిపోతుంది. యమున అప్పుడే ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందని తెలుసుకుంటుంది. ఇంతకీ ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం ఎవరు? చివరికి ఆ దెయ్యం ఏమయ్యింది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

  • నయనతార
  • యోగి బాబు
  • జయప్రకాశ్
  • కలైయరసన్
  • లీలావ‌తి
  • మాస్టర్ అశ్వంత్
  • మీరా కృష్ణన్
  • గోకుల్ నాథ్
  • నిశాంత్ రామకృష్ణన్
  • యశ్వంత్ అశోక్ కుమార్
  • సెంథి కుమారి
  • నితీష్ వీరా
  • వినోద్ సాగర్
  • విన్నర్ రామచంద్రన్
  • సాన్విత
  • జీవా సుబ్రమణియన్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: కేజేఆర్ స్టూడియోస్
  • నిర్మాత: కోటపాడి జె రాజేష్
  • కథ, స్క్రీన్‌ప్లే: ప్రియాంక రవీంద్రన్
  • దర్శకత్వం: సర్జున్ కెఎమ్
  • సంగీతం: సుందర మూర్తి
  • సినిమాటోగ్రఫీ: సుదర్శన్ శ్రీనివాసన్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • పాటలు : రాకేందు మౌళి
  • ఎడిటర్: కార్తీక్ జోగేష్

మూలాలు[మార్చు]

  1. 10TV (27 March 2019). "నాకు బతకడమే ఓ కల : 28న ఐరా" (in telugu). Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. TV9 Telugu (28 March 2019). "ఐరా తెలుగు మూవీ రివ్యూ". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Zee News Telugu (29 March 2019). "'ఐరా' మూవీ రివ్యూ.. మీ కోసం". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐరా&oldid=4085242" నుండి వెలికితీశారు