కథ వెనుక కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథ వెనుక కథ
దర్శకత్వంకృష్ణ చైత‌న్య
నిర్మాతదంద‌మూడి అవ‌నీంద్ర కుమార్
ఛాయాగ్రహణంగంగ‌న‌మోని శేఖ‌ర్‌
కూర్పుఅమర్ రెడ్డి కుడుములు
సంగీతంశ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్
నిర్మాణ
సంస్థ
దండ‌మూడి బాక్సాఫీస్
సినిమా నిడివి
2023 మే 12
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ వెనుక కథ 2023లో విడుదలైన తెలుగు సినిమా. దండ‌మూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై దంద‌మూడి అవ‌నీంద్ర కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైత‌న్య దర్శకత్వం వహించాడు. సునీల్‌, విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభశ్రీ రాయగురు, అలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేసి, సినిమాను మే 12న విడుదలైంది.[1][2]

కథ[మార్చు]

విశ్వంత్ దర్శకుడు కావాలని కలలుకంటాడు. తన మ‌ర‌ద‌లిని ప్రేమిస్తాడు, ఈ విషయం తెలుసుకున్న అతడి మామ‌య్య సంవ‌త్స‌రంలో హిట్ సినిమా తీసి డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకుంటేనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాన‌ని కండీష‌న్ పెడ‌తాడు. ఈ క్రమంలో విశ్వంత్ త‌న క‌థ‌తో దర్శకుడిగా అవకాశగం సంపాదిస్తాడు. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సినిమా యూనిట్ లోని ఐదుగురు క‌నిపించ‌కుండా పోతారు. అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోవ‌ట‌మే కాదు హ‌త్య‌కు కూడా గుర‌వుతుంటారు. దీంతో పోలీసులు ఈ కేసును సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ స‌త్య (సునీల్)కి అప్ప‌గిస్తారు. అస‌లు అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోవ‌టానికి కార‌ణం ఎవ‌రు ? దీని వెనుకున్నది ఎవరు ? స‌త్య ఈ కేసును ఎలా ఛేదించాడు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: దండ‌మూడి బాక్సాఫీస్
  • నిర్మాత: దంద‌మూడి అవ‌నీంద్ర కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైత‌న్య
  • సంగీతం: శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్
  • సినిమాటోగ్రఫీ: గంగ‌న‌మోని శేఖ‌ర్‌
  • ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుములు
  • పాటలు: కాసర్ల శ్యామ్, పూర్ణాచారి
  • ఆర్ట్ డైరెక్టర్: వెంకట్ సాలపు
  • కోరియోగ్రఫీ: బాను
  • ఫైట్స్: అంజి, రియల్ సతీష్

మూలాలు[మార్చు]

  1. "కథ వెనుక కథ.. మార్చి 24న విడుదల". 14 March 2023. Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  2. Andhra Jyothy (8 May 2023). "కథ వెనుక కథ తెలిసేది ఎప్పుడంటే." Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
  3. "స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ వెనుక క‌థ‌…". 20 February 2023. Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  4. NTV Telugu (14 March 2023). "విశ్వంత్ చెప్పబోతున్న 'కథ వెనుక కథ!?". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.