కాండ్రేగుల (ఇంటిపేరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాండ్రేగుల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

చరిత్ర[మార్చు]

కాండ్రేగుల ఇంటిపేరుగా కల కాండ్రేగుల జోగిపంతులు వారసులు 18 శతాబ్ది రెండో అర్థభాగం, 19వ శతాబ్ది తొలి అర్థభాగం కాలంలో దివితాలూకాను జమీందారీగా పరిపాలించారు. `1762 – 66 కాలంలో ప్రాంతీయ సభాపతి హోదా కలిగిన జాన్ సైబస్ కు దుబాసిగా, 1763-65 హైదరాబాద్ నవాబుతో ఈస్టిండియా కంపెనీ తరఫున రాయబారాలు చేసిన గొప్ప వ్యవహారవేత్త, రాజనీతివేత్త కాండ్రేగుల జోగిపంతులు. ఆయన చేసిన సేవలకు ప్రతిఫలంగా 1776లో దివి తాలూకాలోని భూములన్నిటినీ వందేళ్ళ కౌలుకు పొందారు. ఆ భూములు ఆయన తమ్ముని కుమారుడు కాండ్రేగుల జగ్గప్ప పేరుమీదుగా మళ్ళీ కౌలిచ్చారు. 1807లో కాండ్రేగుల జోగిపంతులు మనుమడు గోపాలరావుకు ఈ తాలూకాను జాగీరుగా ఇచ్చారు. 1812లో ఆయన మరణానంతరం వారి చిన్నతమ్ముడు కాండ్రేగుల జగన్నాధరావుకు సంక్రమించింది. తరవాత ఆయన వారసుడు గోపాలరావు జమీందారై కొన్నేళ్ళ తర్వాత మరణిస్తూ భార్యకు దత్తత హక్కునిస్తూ 1836లో మరణించారు. కారణాంతరాలచే 1853లో దివి జమీందారీని వేలం వేసి తిరిగి బ్రిటీష్ ప్రభుత్వమే కొనుక్కుంది.[1]

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

  • కాండ్రేగుల జోగిపంతులు – ఈస్టిండియా కంపెనీ వద్ద ప్రముఖ దుబాసీ, రాయబారి. ఆయన అప్పటి రాజకీయ వ్యవస్థలో అత్యంత శక్తివంతులై జమీందారులను, సంస్థానాధీశులను తన ఇంటివద్ద వేచివుండేలా చేసుకన్న వ్యక్తి.
  • కాండ్రేగుల వారు 18, 19 శతాబ్ది కాలంలో దాదాపు 50 సంవత్సరాల పాటుగా దివి జమీందారీని ఏలారు. అనంతర కాలంలో దివి సంస్థానం బ్రిటీష్ ఇండియాలో పూర్తిగా విలీనమైపోయింది.

మూలాలు[మార్చు]

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.