కుమ్మరి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము.ఈ కులాన్ని కులాల , శాలివాహన పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి (Potter) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరము (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టిని గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ద, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పని సరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.
[మార్చు] కుటీర పరిశ్రమగా కుమ్మరం
కొందరు కుమ్మరులు దీనిని ఒక పరిశ్రమగా కూడా విస్తరించి, కేవలం కుండల వరకే కాక మట్టితో వివిద రకాలైన అలంకరణ సామగ్రి సైతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వృత్తి వారు గతంలో వున్నంత లేకున్నా వున్నవారు కొన్ని కుండలు, ఎక్కువగా పట్టణాలలో కూజాలు, ఎక్కువగా పెద్ద భవంతులలో అలంకరణ సామాగ్రి చేసి అమ్ముతున్నారు. అవి ఎంతో ఆకర్షణీయంగా కూడ వుంటున్నవి. ఇవిగాక పూల కుండీలు కూడ ఎక్కువగా అమ్ముడవుతున్నవి. ఈ వృత్తి పూర్తిగా కనుమరుగయే అవకాశం లేదు. కుండలు తయారీ విదానం