కెలాయిడ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Keloid
వర్గీకరణ & బయటి వనరులు
Verbrennungsnarbe keloid1.jpg
Keloid on the throat
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
MeSH {{{m:en:MeshID}}}

కెలాయిడ్' (Keloid) (ఇదే "కెలాయిడాల్ స్కార్" [1]:1499అని కూడా పిలవబడుతున్నది) అనేది ఒక రకమైన మచ్చ, అప్పుడు అది ఉన్న పరిస్థితిని, స్థాయిని బట్టి ముఖ్యముగా అది మూడవ రకము టైప్ III (ప్రారంభ దశ) లేదా మొదటి రకము టైప్ I (అంత్య దశ) కోలాజేన్ గా ఉంటుంది. అది దెబ్బ తాకి తగ్గిన పుండు మీద ఉన్న చర్మము పై అతిగా నూకలు నుకలుగా కణజాలాలు పేరుకోవడం వలన (కోలాజేన్ టైప్ 3) గా మొదలై క్రమముగా కోలేజన్ టైప్ I గా రూపాంతరము చెందుతుంది. కెలాయిడ్ లు గట్టిగా, రబ్బర్ లా సాగేవి లేదా మెరుస్తూ,పీచు పీచుగా ఉండే నూడుల్స్ కానీ అయి ఉంటాయి మరియు ఇవి గులాబి నుండి మాంసము రంగులో కానీ లేదా ఎరుపు నుండి ముదురు బ్రౌన్ రంగులో కానీ ఉంటాయి. ఈ కెలాయిడ్ మచ్చ అనేది సున్నితము అయినది, వ్యాపించనిది మరియు కొన్ని సార్లు చాలా దురదతోను మరియు నొప్పితోను[2] కూడి ఉంటుంది మరియు చూడడానికి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. చాలా తీవ్రమైన సందర్భములలో మాత్రమే, ఇది చర్మము యొక్క కదలికల పై ప్రభావము కలిగి ఉంటుంది.

కెలాయిడ్ లను హైపర్ ట్రోఫిక్ మచ్చలుగా పొరపడవద్దు, ఇవి కేవలము అసలు గాయము అయిన దాని పరిధిలోనే పెరిగే మచ్చలు.

సంఘటన[మార్చు]

కెలాయిడ్ లు మాములు చర్మము పై పంజా వలె పెరుగుతాయి.[3] ఇవి సూదులు పెట్టి పొడుస్తున్నట్లుగా ఉండే నొప్పితో లేదా చెప్పా పెట్టకుండా వచ్చే దురదతోనూ ఉండే సామర్ధ్యం కలిగి ఉంటాయి, కాని ఒక రోగికి నుండి మరొక రోగికి వీటి ప్రభావము మారుతూ ఉంటుంది.

కెలాయిడ్ లో సూక్ష్మజీవులు చేరితే అది వ్రణముగా మారుతుంది. ఈ మచ్చను తొలగించడం అనేది ఒక రకమైన చికిత్స, కానీ దీని ఫలితములు ఒక్కోసారి తీవ్రముగా ఉండవచ్చు, అంటే ఈ మచ్చుకు జరిగే శస్త్ర చికిత్స వలన ఆ గాయము కెలాయిడ్ గా మారడానికి 50% కంటే ఎక్కువగా అవకాశములు ఉన్నాయి. లేజర్ చికిత్స కూడా ఇవ్వవచ్చును, కానీ ఎంత వరకు సత్ఫలితములు ఇవ్వగలుగుతుంది అనేది రోగిని బట్టి మారుతూ ఉంటుంది.

కెలాయిడ్ లు మచ్చకు సంబంధించిన కణజాలంలోనే తయారవుతాయి. ఈ పుండును సరిచేయడం కొరకు వాడే కోలేజన్ కొన్నిసార్లు అసలు పుండు కంటే చాలా చాలా పెద్దగా పెరిగేలా కూడా చేస్తుంది. మాములుగా కెలాయిడ్ లు గాయం తగిలిన చోట పెరుగుతాయి అయినప్పటికీ, అవి ఏమి లేకుండా కూడా రావచ్చును. అవి కేవలము కొంచెం గుచ్చుకున్న ప్రదేశములో కూడా రావచ్చును మరియు చిన్న గీత లేదా మొటిమ వంటి సాధారణము అయిన వాటి వద్ద కూడా రావచ్చును. అవి బాగా నల్లబడి పోవడం వలన లేదా ఆటలమ్మ మచ్చల వలన కూడా రావచ్చును,అలాగే పుండు అయిన ప్రదేశములో సూక్ష్మ జీవులు పెరగడం వలన, ఒకే ప్రదేశములో మరల మరలా దెబ్బలు తగలడం వలన, పుండు అయిన చోట చర్మము బాగా ఇబ్బందికి గురి కావడము లేదా గాయములో ఏదైనా అవాంఛిత పదార్ధము చేరడం వలన కానీ రావచ్చును. కెలాయిడ్ లకు కొన్ని సార్లు క్లోరిన్ పడకపోవచ్చును. యవ్వనములో ఈ కెలాయిడ్ మచ్చలు వచ్చినట్లయితే, మాములుగా శరీరము ఆ వయసులో పెరుగుతుంది కాబట్టి దానితో పాటుగా అవి కూడా పెరుగుతాయి.

హిస్టలాజికల్ గా, కెలాయిడ్స్ అనేవి కోలేజన్, ఫైబ్రోనెక్టిన్, ఎలాస్టిన్ మరియు ప్రోటియోగ్లైకన్స్ వంటి అసామాన్యమైన ఫైబ్రోబ్లాస్ట్ లు అపరిమితముగా పెరిగి, మాట్రిక్స్ కాంపోనెంట్స్ కూడా స్థానభ్రంశము చెందడము వంటివి అన్ని కలిగి జరగడం వలన వ్రణముగా తయారయినవి. మాములుగా, గాయము అయిన చోట పుండు పడి నూకలుగా ముందు తయారై, విస్తారమైనవిగా, లోతుగా మరియు లావుగా వ్యాపించిన కోలేజన్ మూటలుగా తయారైన కెలాయిడ్ లు చాలా నొప్పి కలిగి ఉంటాయి. ఈ కెలాయిడ్ లు సరైన వైద్యము కనుగొని తీరవలసిన అవసరముతో వైద్యపరమైన సవాలుగా నిలిచాయి, ఎందుకంటే ఈ కెలాయిడ్ పుండ్లు చాలా భరించలేనంత నొప్పి కలిగి ఉండి, బాగా దురదతో కూడి ఉండి, శారీరకముగా అందవిహీనముగా కూడా ఉంటాయి. సమయము గడిచే కొద్ది అవి తగ్గకపోగా, ఒకవేళ కీళ్ళ పై గనుక వస్తే ఆ శరీర భాగము యొక్క కదలికలు కూడా తగ్గించగలుగుతుంది.

కెలాయిడ్ లు స్త్రీ, పురుషులు ఇరువురి పైనా ఒకేలా ప్రభావము చుపించగలుగుతుంది, అయినపట్టికీ యువతులైన రోగులలో ఇది వచ్చే అవకాశము యువకుల కంటే ఎక్కువగా ఉన్నట్లు నమోదు అయింది, బహుశా ఇది స్త్రీలు ఎక్కువగా చెవి తమ్మె కుట్టించుకోవటం వలన కావచ్చు. ఎక్కువగా నల్లగా వారికి ఇది వచ్చే అవకాశం పదిహేను రెట్లు ఎక్కువగా ఉంది. ఆఫ్రికన్ల సంతితికి చెందినవారికి ఈ కెలాయిడ్ లు ఎక్కువగా రావడానికి చాలా అవకాశము ఉంది.[1]

వైద్యశాస్త్రములో వీటి చరిత్ర[మార్చు]

కెలాయిడ్ లు 1700 BC సమయములో ఈజీప్శియన్ శస్త్రచికిత్స నిపుణులచే వివరించబడ్డాయి. బరోన్ జేయన్లూయిస్ అలిబర్ట్ (1768–1837) కెలాయిడ్ ను ఒక ఎంటిటీ గా 1806లో గుర్తించాడు. అతను దానిని కంక్రాయిడ్ అని పిలిచేవాడు, ఆ తరువాత అతను కాన్సర్ తో తికమక పడకుండా ఉండడం కొరకు అతను దాని పేరును చేలాయిడ్ గా మార్చాడు. ఈ పదము గ్రీక్ పదము χηλή,చేలే నుంచి తీసుకోబడినది, దీని అర్ధము "హుఫ్", ఇక్కడ "ఎండ్రకాయలా బెజ్జాలు వేసుకునే వారు" అని అర్ధం వస్తుంది మరియు ఆ తరువాత వచ్చే -oid , యొక్క అర్ధము "ఇలా" అని ఉంటుంది. చాలా సంవత్సరముల వరకు,L'హాస్పిటల్ సెయింట్-లూయిస్ లో ఉన్న అలిబర్ట్ యొక్క క్లినిక్ మాత్రమే ప్రపంచములో ఉన్న చర్మమునకు చెందిన ఇబ్బందులకు సంబంధించిన వైద్యశాలగా ఉంది.

అంతర్జాతీయ కెలాయిడ్లు[మార్చు]

మెక్సికో కు చెందిన ఒల్మేక్ ప్రీ-కొలంబియన్ సమయములో కెలాయిడ్ మచ్చలను అలంకరణకు వాడుకునే వాడు. ఇప్పటి నవీన సమయములో, సుడాన్ లోని నుబియా-కుష్ కు చెందిన స్త్రీలు ముఖముపై వచ్చే కెలాయిడ్స్ ను అలంకరణకు వాడుకోవడంలో అంతర్జాతీయముగా పేరు పొందారు. న్యూర్ మరియు న్యూబా లు నుదిటితో పాటుగా పెదవులు కలిపితే కనిపించేలా కెలాయిడ్ టాటూలను వేయించుకుంటారు, అలాగే చుబుకము, పై పెదవి మరియు కార్న్రోల పై వేయించుకుంటారు. పపు, న్యూ గినియాకు చెందిన ప్రజలు వారి ఆచారములో భాగముగా, చర్మమును కుట్టించుకుంటారు మరియు ఆ పుండులో పేడ మరియు బూడిద పెట్టుకుంటారు, దాని వలన శాశ్వతమైన వాపు వస్తుంది(దీనినే కెలాయిడ్ లేదా వీల్స్ అని అంటారు). ఇలా అత్యంత నొప్పి కలిగించే ఈ ఆచారమును పాటించే వారిని ఆ తెగ వారు వారి ధైర్యము మరియు ఓర్పునకు ఉత్సవము చేసి గౌరవిస్తారు.

కెలాయిడ్స్ ఉండే ప్రదేశములు[మార్చు]

కెలాయిడ్ లు శరీరములో ఒరుచుకుని పోయిన ఏ ప్రదేశములో అయినా రావచ్చును. అవి మొటిమల వలన కానీ, పురుగులు కుట్టడం వలన కానీ, కాలడం వలన కానీ లేదా మరే ఇతర చర్మ సంబంధమైన ఇబ్బంది వలన కానీ రావచ్చును. కెలాయిడ్ మచ్చలు శస్త్ర చికిత్స అనంతరము కూడా రావచ్చును. ఇంకా ఎదురు రొమ్ము పైనా, వీపు పైనా, భుజముల పైనా మరియు చెవి తమ్మెల పైనా వంటి ప్రదేశములు సాధారణముగా కెలాయిడ్ లు వచ్చే అవకాశము కలిగి ఉంటాయి. అవి శరీరము పై మరే చోట అయినా కుట్టించడం వలన కూడా వస్తాయి.

సంభవము[మార్చు]

ఏ వయసు వారికైనా సరే కెలాయిడ్ రావచ్చును. పదకొండు సంవత్సరముల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు చెవులు కుట్టించినప్పటికీ వారికీ కెలాయిడ్ పెరిగే అవకాశము చాలా తక్కువ. కెలాయిడ్ లు స్యూడోఫోల్లికల్టిస్ బార్బే వలన కూడా రావచ్చును, ఎవరికైనా గడ్డం చేసుకుంటూ ఉండడం వలన పుండు పడి(అదే ప్రదేశము భవిష్యత్తులో కాన్సర్ వచ్చే స్థానము కూడా కావచ్చును),మరల మరలా జరగడం వలన సూక్ష్మక్రిముల పాలిటపడి ఆ తరువాత కెలాయిడ్ అవ్వవచ్చును. అందుకే ఇలా రేజర్ తో గడ్డం చేసుకోవడం వలన పుండు పడిన వారు కొంత కాలము గడ్డము చేసుకోవడం ఆపి, మరే ఇతర తరహాలో అయినా గడ్డం తీసేసే ముందుగా చర్మమునకు తనంత తాను సరి చేసుకునే అవకాశము ఇవ్వడమనేది తెలివైన పని. మరియు ఇలా కెలాయిడ్ లు రావడము అనేది వంశ పారంపర్యముగా వస్తుంది అనీ, ఒక తరము నుంచి మరొక తరమునకు వస్తుంది అనీ అంటుంటారు.[citation needed]

పూతలు[మార్చు]

ఈ రోగులలో ముందుగా ఈ జబ్బు రాకుండా స్థానభ్రంశము చేసి తీసుకునే నివారణ చర్యలు దీనికి సరైన వైద్యముగా భావించబడుతున్నది. వీటిలో వీలైనంతగా అనవసరముగా వ్రణములు తొలగించడము మరియు శస్త్ర చికిత్సలు చేయించకపోవడము (వీటితో పాటుగా చెవులు కుట్టించడము, పులిపిర్లను కరెంటు సహాయముతో తొలగించడము వంటివి చేయకుండా ఉండాలి)వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మమునకు సంబంధించిన ఏ ఇబ్బంది కలిగిన వారైనా(ఉదాహరణకు అతిగా నల్ల బడడము, సూక్ష్మ క్రిముల పాలు పడడము) వాటికి ముందుగానే వైద్యం తీసుకుని అవి పెద్దవి కాకుండా జాగ్రత్త వహించాలి.

  • చాలా కెలాయిడ్ లకు గాయము లోపలికే తీసుకునే కార్టికో స్టెరాయిడ్ లు మొదటిగా వైద్యములో వాడబడతాయి. ఒక పద్దతి ప్రకారము చేసిన అధ్యయనము ప్రకారము ఈ గాయములోకి తీసుకునే కార్టికో స్టెరాయిడ్ లకు 70% మంది సత్ఫలితములు పొందారని తెలుస్తోంది, దీని వలన ఆ కెలాయిడ్ లు అణిగి పోయాయి కానీ అవి తిరిగి రావడానికి అవకాశము చాలా ఎక్కువగా ఉంది అని ఈ అధ్యయనములలో తేలింది(ఐదు సంవత్సరములలో సగము వరకు తిరిగి రావచ్చును).[4]
  • ధ్వంసం చేయడము- ఇంజెక్షన్ ద్వారా వైద్యము చేయడం అనేది పని చేయనప్పుడు లేదా దీని ద్వారా సరిపోయేంత అభివృద్ధి లేకున్నా కూడా శస్త్ర చికిత్స చేసిన కత్తిని ధ్వంసం చేయమని సూచిస్తారు. ఇలా శస్త్ర చికిత్సకు ముందు, ఆ సమయములో, ఆ తరువాత మూడుసార్లు వాడబడిన వస్తువులు మరియు లోపలికి ఇచ్చిన ఇంజెక్షన్ లు కూడా ధ్వంసం చేయవలసిన వాటిలో ఉన్నాయి.[4] కేవలము ఇలా వైద్యం చేయబడిన రోగులలో 45 నుండి 100 శాతము మందికి తిరిగి రావడము గమనించబడినది; ఇది రెండు రకముల వైద్యము కలిపి చేయబడిన రోగుల కంటే 50 శాతము తక్కువగా ఉంటుంది.[5]
  • సిలికాన్ జెల్ షీటింగ్ - సిలికాన్ జెల్ షీటింగ్ అనేది కెలాయిడ్ ను కలిగి ఉండి కొన్ని లక్షణములు (నొప్పి మరియు దురద వంటి లక్షణములు)కలిగి ఉన్న రోగులకు వైద్యము చేయడానికి మరియు రాబోతున్న కెలాయిడ్ లకు మరియు కొత్తగా తగిలిన గాయములు కెలాయిడ్ లు కాకుండా ఉండేలా చూడడానికి వాడబడుతున్నది. చక్కగా చేయబడిన ఒక విశ్లేషణ ప్రకారము సిలికాన్ జెల్ షీటింగ్ అనేది అనూహ్యముగా మచ్చలు పడడమును తగ్గించగలదు అనడానికి ఆధారము దొరికినప్పటికీ, ఇది సరిగ్గా చేయబడిన ట్రయల్స్ యొక్క ఫలితము కానందున మరియు సరైన విచక్షణ వాడబడనందున ఈ ఫలితము ఖచ్చితము అని చెప్పలేము.[6] సిలికోన్ జెల్ షీట్ తో వైద్యము చేయడం అనేది కొన్ని అధ్యయనములలో ప్రత్యేక మచ్చల విషయములో మంచి ఫలితములు కలిగి ఉన్నట్లుగా ఆధారము చూపినప్పటికీ, మరలా దానికి సంబంధించిన ట్రయల్స్ సరిగా చేయలేదు మరియు సరైన విచక్షణ వాడబడక పోవడం వలన అవి అంతగా నమ్మదగినవి కాదు.
  • క్రైపో సర్జరీ- క్రైపో శస్త్రచికిత్స కెలాయిడ్ ల కొరకు వేరే ఇతర చికిత్సలతో పాటుగా వాడబడినప్పుడు చాలా ఉపయోగకరముగా ఉంటుంది.[5] దీనికి ఉన్న ముఖ్యమైన అవాంఛనీయ ప్రతికూల ఫలితము హైపోపిగ్మేన్టేషన్, దీని వలన నల్లని చర్మము కలిగిన వారికి దీని ఉపయోగం అంతగా లేకుండా అయిపోయింది.
  • రేడియేషన్ థెరపీ- అన్ని కాకున్నా చాలా అధ్యయనములు[4] కెలాయిడ్ లకు జరగవలసిన వైద్యములో రేడియేషన్ థెరపీ మిగతా అన్నిటికంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా తెలిపాయి, శస్త్ర చికిత్స తరువాత దీనిని తీసుకోవడం ద్వారా వచ్చే మంచి ఫలితములు 70 నుండి 90 శాతము వరకు ఉంటాయి. ఒక చిన్న అధ్యయనములో శస్త్ర చికిత్స తరువాత ఈ రేడియేషన్ తీసుకోవడం వలన పదహారు చెవి తమ్మె కెలాయిడ్ లలో రెండు(పదమూడు శాతము)తిరిగి రావడం తగ్గింది మరియు పన్నెండు చెవి తమ్మె కెలాయిడ్ లలో నాలుగు(33 శాతము)వరకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ల వలన తగ్గాయి.[7] ఏది ఏమైనప్పటికీ, రోజులు గడిచే కొద్దీ వచ్చే ధీర్గకాల ఇబ్బందులు (ఉదాహరణకు దోషము వంటివి)రేడియేషన్ తో ముడిపడి ఉంటాయి, ఈ నష్టము కారణముగా దీని వాడకం చాలా మంది రోగులకు సాధ్యం కాదు. కెలాయిడ్ లకు చేసే రేడియేషన్ చికిత్సకు కేవలము చాలా కొంతమంది విషయములో మాత్రమే కొద్ది దోషములు వచ్చినట్లుగా నమోదు చేయబడినది. ఇలాంటి సందర్భములలో కారణము తెలియ రానప్పటికినీ, ఈ రేడియేషన్ చికిత్సను వాడుకొమ్మని సూచించే ముందుగా చాలా జాగ్రతగా యోచించాలి, ముఖ్యముగా యువతీ యువకులకు ఈ చికిత్స ఇవ్వవలసి వస్తే చాలా జాగ్రత్త వహించాలి. వేరే ఏ ఇతర వైద్యమునకు లొంగని కెలాయిడ్ లకు మాత్రమే, ఇలాంటి ప్రత్యేక సందర్భములలో మాత్రమే ఆ రేడియేషన్ చికిత్స సరైనది. దీనికి తోడుగా, అస్సలు లొంగని గాయములకు, పుండ్లకు రేడియేషన్ చికిత్స ఒక చక్కటి మార్గముగా సూచించవచ్చు.
  • ఇంటర్ఫెరాన్ ఆల్ఫా- ఇంటర్ఫెరాన్ ఆల్ఫా ఇంజెక్షన్లు శస్త్రచికిత్స తరువాత తిరిగి వచ్చే అవకాశమును బాగా తగ్గించి వేస్తాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అధ్యయనములు కూడా పద్ధతి లోపము వలన బాధ పడుతున్నాయి, దాని వలన ఆయా ఆధారములను బట్టి వాటిని వాడే విధానము గురించి ఒక అభిప్రాయమునకు రావడము చాలా కష్టముగా ఉన్నది.[4]
  • పల్స్ద్ డై లేజర్ - పల్స్ద్ డై లేజర్ కెలాయిడ్ ల వైద్యములో బాగా ఉపయోగపడుతుంది మరియు కెలాయిడ్ యొక్క ఫైబ్రో బ్లాస్ట్ ప్రోలిఫరేషన్ ను వత్తి పెట్టి ఉంచడం వలన మరియు అపోప్తోసిస్ మరియు ఎంజైమ్ ల పని తీరు మెరుగు పరచడం వలన కెలాయిడ్ లు తిరిగి వచ్చే అవకాశమును బాగా తగ్గించి వేస్తాయి. పల్స్ద్ డై లేజర్ ప్లస్ ఇంట్రా లెజినల్ చికిత్స మరియు/లేదా ఫ్లురోఉరకిల్ చికిత్సలు విడివిడిగా ఇచ్చిన దాని కంటే రెండు కలిపి ఇవ్వడము అనేది బాగా పనిచేస్తుంది.[8]

వ్యాధి ఉన్న వారి గురించి తెలపడము[మార్చు]

ఇది రెండు పాదముల మధ్య భాగములో రెండు కెలాయిడ్ లు తయారైన ఒక యువకునికి సంబంధించిన సమాచారము. అతను ఈ పరిస్థితికి ఎప్పుడూ ఎలాంటి వైద్యం చేయించుకోలేదు. ఇంకా చాలా చాలా చిన్న కెలాయిడ్ లు చిన్న చిన్నగా (జుట్టులేని)చర్మము పై గూడు కట్టుకుని ఉన్నాయి.

ప్లాంటర్ కెలాయిడ్ సమాచారము
ప్లాంటర్ కెలాయిడ్ సమాచారము
ప్లాంటర్ కెలాయిడ్ సమాచారము

వీటిని కూడా చూడండి[మార్చు]

  • చర్మ సంబంధమైన పరిస్థితుల జాబితా

సూచనలు[మార్చు]

  1. Rapini, Ronald P.; Bolognia, Jean L.; Jorizzo, Joseph L. (2007). Dermatology: 2-Volume Set. St. Louis: Mosby. ISBN 1-4160-2999-0. 
  2. ఒగవ R. ది మోస్ట్ కరెంట్ అల్గారిథమ్స్ ఫర్ ది ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ హైపర్ట్రోఫిక్ స్కార్స్ అండ్ కెలాయిడ్స్. ప్లాస్ట్ రికాన్స్టర్ సర్జ్. 125: 557-568, 2010.
  3. మీనాక్షి J, జయరామన్ V, రామకృష్ణన్ KM, బాబు M. కెలాయిడ్స్ అండ్ హైపర్ట్రోఫిక్ స్కార్స్ : ఏ రివ్యూ. ఇండియన్ J ప్లాస్ట్ సర్జ్ 2005;38:175-9
  4. 4.0 4.1 4.2 4.3 Shaffer JJ, Taylor SC, Cook-Bolden F (2002). "Keloidal scars: a review with a critical look at therapeutic options.". J Am Acad Dermatol 46 (2 Suppl Understanding): 63–97. PMID 11807470. 
  5. 5.0 5.1 Berman B, Bieley HC (1996). "Adjunct therapies to surgical management of keloids". Dermatologic Surgery 46 (2): 126–130. PMID 8608373. 
  6. O'brien L, Pandit A (2006). "Silicon gel sheeting for preventing and treating hypertrophic and keloid scars.". Cochrane Database Syst Rev. (1): CD003826. doi:10.1002/14651858.CD003826.pub2. PMID 16437463. 
  7. Sclafani AP, Gordon L, Chadha M, Romo T 3rd (1996). "Prevention of earlobe keloid recurrence with postoperative corticosteroid injections versus radiation therapy: a randomized, prospective study and review of the literature.". Dermatologic Surgery 22 (6): 569–574. doi:10.1016/1076-0512(96)00060-X. PMID 8646474. 
  8. Asilian A, Darougheh A, Shariati F (2006). "New combination of triamcinolone, 5-Fluorouracil, and pulsed-dye laser for treatment of keloid and hypertrophic scars". Dermatologic Surgery 32 (7): 907–915. doi:10.1111/j.1524-4725.2006.32195.x. PMID 16875473. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Diseases of the skin and appendages by morphology మూస:Localized connective tissue diseases

"http://te.wikipedia.org/w/index.php?title=కెలాయిడ్&oldid=1289048" నుండి వెలికితీశారు