కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు (1904 - 1976) తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.

బాల్యము[మార్చు]

శ్రీ కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు గారు 1904 వ సంవత్సరములో జన్మించారు.

గ్రంథాలయోధ్యమముతో అను బంధము[మార్చు]

శ్రీ కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు గారు, వయోజన విద్య - గ్రంథాలయ ఉధ్యమం కొరకు కాలి నడకన యాత్రలు నిర్విహించారు. వీరి యాత్రల ఫలితంగా కొన్ని క్రొత్త గ్రంథాలయాలు వెలిశాయి. అన్నింటికి మించి కోగంటి వారు అపారమైన సంఖ్యలో చిన్న పుస్తకాలు, కర ఆత్రాలు ప్రచురించి ఉధ్యమము ప్రచారినికి ఉచితంగా పంచారు. ముఖ్యంగా అయ్యంకి వారు చూపిన మార్గం పై విశేష ప్రచారం ఇచ్చే వారు., అందుకు ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సేవా సంస్థ వేధికగా చేసుకున్నారు. వీరి కృషిని ప్రసంసిన అయ్యంకి వారు ఈయనకు గ్రంథాలయోధ్యమ భూషణ అనే బిరుదును ప్రథానము చేశారు. అరుదైన నిస్వార్థ సేవకులలో కోగంటి వారు ఒకరు.

మూలాలు[మార్చు]

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము. పుట. 101