కోడూరు ప్రభాకర రెడ్డి
డా. కోడూరు ప్రభాకర రెడ్డి తెలుగు కవులు. సాహితీ కారులు. వృత్తిపరంగా వైద్యులు[1].
జీవిత విశేషాలు
[మార్చు]శ్రీ కోడూరు ప్రభాకరరెడ్డి గారు కడపజిల్లా పాలగిరి గ్రామంలో ఆగస్టు 11 , 1947 న జన్మించారు వీరి తండ్రి శ్రీ కోడూరు చెన్నారెడ్డి గారు, తల్లి శ్రీమతి కోడూరు ఓబులమ్మ గారు .వీరి విద్యార్హత యం.బి.బి.యస్.-యం.డి ,వృత్తి -శిశువైద్యం ,వీరి సహధర్మ చారిణి -శ్రీమతి.పార్వతి - బి .ఎ. వీరి సంతానం కళ్యాణ చక్రవర్తి,- బి .టేక్.,హిమబిందు , బి యస్సీ.,నరేంద్ర కుమార్ రెడ్డి , బి. టేక్ .
శ్రీ ప్రభాకరరెడ్డి గారు వృత్తి రీత్యా శిశు వ్వైద్యులైనప్పటికి వీరి ప్రవ్రుత్తి మాత్రం సాహిత్యం . రేనాటి పలుకుబడులు- పేరుతో డా కోడూరు ప్రభాకర రెడ్డి రేనాటి ప్రాంతపు మూడు వేలకు పైగా పదాలను సేకరించి వాటిని ఆకారాది క్రమంలో పేర్చి, వాటి అర్ధం, సమార్ధక ఆంగ్లపదం ఇస్తూ ఆ పదాన్ని ఎలా వాడారో ఉదాహరణగా ఇచ్చారు.[2]
====
కృతులు
[మార్చు]- రాగావిపంచి ( ఖండ కావ్యం ) రెండు ముద్రణలు ,
- పల్నాటి భారతం ( పద్య కావ్యం ) రెండు ముద్రణలు ,
- ద్రౌపది ( గద్యకృతి ) రెండు ముద్రణలు,
- హృదయరాగం ( ఖండకావ్యం ) ,
- చాటుకవిసార్వభౌమ "శ్రీనాథుని చాటువులు -రెండు ముద్రణలు ,
- కవికోకిల "దువ్వూరి రామిరెడ్డి కవిత్వం - వ్యక్తిత్వం ,
- కవితారస పానశాల ( వ్యాససంకలనం ) ,
- శ్రీనాథ విజయం ( రేడియో నాటికలు ) ,
- దేవర ( ఖండకావ్యం ),
- బాలగేయాలు ( సంకలనం ) ,
- శృంగార తిలకం ( అనుసృజనం ),
- అశ్రుగీతి ( అనుసృజనం )
- మీరా గీతామృత ధార ( అనుసృజనం )
పురస్కారాలు
[మార్చు]- ఉండేల విజ్ఞాన పీఠం ( హైదరాబాద్ ) వారిచే "పల్నాటిభారతం " పద్య కావ్యానికి ఉత్తమ కావ్యంగా 25000 రూపాయలు బహుమతి ( 1997 )
- సి.పి.బ్రౌన్ ( కడప ) స్మారక పురస్కారం ( 2001 )
- శ్రీ నన్నయ భట్టారక పీఠం ( తణుకు ) వారిచే "రాగావిపంచి " పద్యకృతికి ఉత్తమ పద్య గ్రంథ పురస్కారం ( 2005 )
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) ధర్మనిధి పురస్కారం ( 2006 )
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) సాహిత్య పురస్కారం ( 2009 ) -నాటక ప్రక్రియలో "శ్రీనాథ విజయం " గ్రంథానికి
- బాల శౌరి రెడ్డి సమ్మాన్ పురస్కారం ( 2010 )
- శ్రీ నన్నయభట్టారక పీఠం - తణుకు -డా.జి.యస్వీ.ప్రసాద్ -పురస్కారం ( 23-03-2015).
మూలాలు
[మార్చు]- ↑ "AUTHOR'S PROFILE". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-28.
- ↑ పదిమందిని ఉసిగొల్పే ప్రయత్నం[permanent dead link]