రేడియో
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కాంతి వేగ పౌన:పున్యాల(Frequency)తో విద్యుత్‌అయస్కాంత(Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అని అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అని అంటారు. మొదటిరోజులలో వాల్వ్‌లను ఉపయోగించి రేడియోలను తయారు చేశేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడ చాలా పెద్దవిగా ఉండేవి.ఒక చోట ఉంచి మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్‌సిస్టరులను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి.వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి వుద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము(బ్యాటరీ-Battery)తో కూడ పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios)వచ్చినాయి.
ప్రజలు వినగలిగే రేడియో తరంగాలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. అవి మధ్యతరహాతరంగాలు(Medium Wave), అతి చిన్న తరంగాలు(Short Wavre) గలవి ,కలవి మరియు ఎఫ్.ఎమ్(Frequency Modulation).
- మధ్య తరహా తరంగాలు(Medium Wave): ఈ ప్రీక్వెన్సీని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్య రకంగా ఉంటుంది. ధ్వని ప్రసారంలో ఎక్కువ తక్కువలు సామాన్యంగా ఉండవు. ట్రాన్స్‌మిటరు నుండి అన్ని పక్కలకు ఏరియల్ ద్వారా వలయాకారంగా ప్రయాణించి రేడియోలను చేరుకుంటాయి. మనం వింటున్న హైదరాబాదు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు చేస్తున్నాయి.
- అతి చిన్న తరంగాలు(Short Wave): ఈ ప్రీక్వెన్సీని సుదూర ప్రాంతాలకు ప్రసారనికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్ యొక్క కోణాన్ని బట్టి ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్ల ను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్ నుండి వెలువడిన రేడియో తరంగాలను భూవాతావరణపు పై పొర (Ionosphere)ను తమకు కావల్సిన కోణంలో ఢీ కొట్టేట్టుగా వదులుతారు. ఆ రేడియో తరంగాలు , భూవాతావరణపు పై పొర (Ionosphere)ను ఢీకొని వికేంద్రీకరించబడి(Reflect)తిరిగి భూమి మీదకు ప్రసారమవుతాయి. సామాన్యంగా, ట్రాన్స్‌మిటర్‌కు, ప్రసారమయ్యే ప్రాంతానికి దూరం 3,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ట్రాన్స్‌మిటరు ఏరియల్ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరెగే ప్రసారాలు చాలా దూరం వినబడినా,ధ్వనిలో నాణ్యత ఉండదు. భూ వాతావరణపు పొరలో వచ్చే మార్పులమీద అధారపడి ప్రసారాలు జరుగుతాయి కాబట్టి, రేడియోలలో వచ్చే ప్రసార కార్యక్రమాల ధ్వని పైకి కిందకూ జరుగుతూ ఉంటుంది. ఒకే ప్రాతంలో వాతావరణపు పొరను ఢీ కొట్టటం వలన ఒక రేడియో స్టేషన్‌కు మరొక స్టేషన్‌కు తరంగాలు కలసి పోయి ఒక్కొక్కసారి అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి(British Boradcasting Corporation),వి.వొ.ఎ(Voice of America) మొదలగు అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేసినాయి, ఇప్పటికి కూడ చేస్తున్నాయి.
- ఎఫ్.ఎమ్(Frequency Modulation):ఈ ప్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు చేస్తున్నాయి. మన బారతదేశంలో కూడ అనేక ప్రవైటు ఛానల్స్ ఈ విధానంలో ప్రసారం చేస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్ ఎఫ్.ఎంమ్.వంటివి ఈ తరహాకు చెందిన ప్రసారాలు చేస్తున్నాయి. ఈ ప్రసార విధానంలో, రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ను కొంత ఎత్తులో ఉంచుతారు. అక్కడనుండి, ప్రసారమయ్యో రేడియో తరంగాలు సూటిగా ప్రయాణిస్తాయి. మధ్యలో ఎత్తయిన భవనాలు మరియు ఇతర కట్టడాలు అడ్డు వస్తే తరంగాలు అక్కడితో ఆగిపోతాయి. దీనికి కారణం, ఈ పద్ధతిలో లైన్ ఆఫ్ సైట్ (Line of sight)[తెలుగు పదము కావాలి]ప్రసారాలు జరుగుతాయి. ఈ పద్ధతిలోని ప్రసారాలు చక్కటి నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. స్టీరియో(Stereo)లో కూడ ప్రసారాలు ఈ పద్ధతిలో చేయవచ్చును.
ఇవి కాక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుకొని సాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్ రేడియోలు కూడ ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] రేడియో ప్రసారాలు
[మార్చు] ఆకాశవాణి
- ప్రధాన వ్యాసం: ఆకాశవాణి
ఆలిండియా రేడియో ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రాంగ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగము. దూరదర్శన్ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి.
[మార్చు] భారత దేశఅభివృద్ధిలో రేడియో పాత్ర
దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోను సమాచారన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది
[మార్చు] వ్యవసాయ అభివృద్ధిలో
1966 ప్రాంతాలలో వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పటానికి పంటసీమలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రూపొందించంటంలో ఆ తరువాత నిర్వహించటంలో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అప్ప్తట్లో పని చేస్తున్న శ్రీ గుమ్మలూరి సత్యనారాయణగఅరి కృషి ఎంతగానో ఉన్నది. పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సశ్యరక్షణ, వ్యవసాయ పద్ధతులగురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి ఏఅ కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్క సారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని రక్తి కట్టించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు తెలియచెప్పవలసిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందచేశేవారు. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకటం గురించి కూడ చక్కగా విశదపరచేవారు. ఇప్పుడు ఈ టేవీ మొదలుకొని ఇతర టేవీలలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలకు స్పూర్తి, మూలాలు, పంటసీమల కార్యక్రమమే అనటంలో అతిశయోక్తి లేదు.
[మార్చు] వయోజన విద్యా ప్రచారంలో
[మార్చు] మహిళాభ్యుదయంలో
[మార్చు] కార్మిక విద్యా ప్రచారంలో
[మార్చు] పిల్లల అభిరుచులను అభ్వృద్ధిపరచటంలో
[మార్చు] సంఘం రేడియో
దళిత మహిళలు ప్రారంబించిన సంఘం రేడియో ఆసియాలోనే తొలి మహిళా రేడియో, భారత్‌లోనే తొలి గ్రామీణ కమ్యూనిటీ రేడియో (Community Radio). జహీరాబాద్‌కు ఐదారు మైళ్ల దూరంలోని మాచునూరు గ్రామంలో ప్రాణం పోసుకుంది. ఇది జనం కోసం, జనమే నడిపే, జనం రేడియో.
ఈ 'రేడియో' కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా, గంటన్నర సేపు ప్రసారమవుతాయి. జహీరాబాద్ చుట్టుపక్కల పాతిక కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో వినొచ్చు. పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీ.డీ.ఎస్.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరఫున ముందుండి పోరాడింది.
సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ సారమంతా టేపుల్లో నిక్షిప్తం అవుతుంది. వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకొవడాని ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెప్పవచ్చును, సంగీత కచేరీ కూడా చేయవచ్చును.
కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కమ్యూనిటీ రేడియోలకు తలుపులు తెరిచింది. బోణీ 'సంఘం రేడియో' వారిదే. బుందేల్‌ఖండ్‌లో కూడా ఈమధ్యే కార్యక్రమాలు మొదలయ్యాయి. కచ్ మహిళా వికాస్ సంఘటన్ (గుజరాత్), ఆల్టర్నేటివ్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ (జార్ఖండ్), వాయిస్ ప్రాజెక్ట్ (కర్ణాటక)... ఇప్పటికే కమ్యూనిటీ రేడియోల్ని జనానికి పరిచయం చేశాయి. ఇంకో ఏడాదిలో పాతిక దాకా కొత్త రేడియోలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ రేడియో ఫోరం అంచనా. కమ్యూనిటీ రేడియో లైసెన్సు కింద చాలా విశ్వవిద్యాలయాలు సొంత స్టేషన్లు పెట్టుకున్నాయి. ఒక యూనిట్ స్థాపనకు 'ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
[మార్చు] ఇవి కూడా చూడండి
తెలుగులో రేడియో కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టిన రేడియో అన్నయ్య మరియు రేడియో అక్కయ్యల గురించి చదవండి.