Jump to content

ఖడ్గ యుద్ధం

వికీపీడియా నుండి
ఫెన్సింగ్
Final of the Challenge Réseau Ferré de France–Trophée Monal 2012, épée world cup tournament in Paris.
FocusWeaponry
ఒలెంపిక్ క్రీడPresent since inaugural 1896 Olympics
అధికార వెబ్‌సైట్www.fie.ch
www.fie.org

ఫెన్సింగ్ లేదా ఖడ్గ యుద్ధం ఒక యుద్ద క్రీడ. ఆటపై గురి.. ఎదుటి వ్యక్తి కదిలికలను వేగంగా గ్రహించడం.. ఆటపై ఏకాగ్రత సాధించడం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ఆటల్లో ఫెన్సింగ్ ఒకటి. బాలికల ఆత్మరక్షణకు అండగా నిలిచే ప్రత్యేక క్రీడ ఇది.కరాటే, తైక్వాండో వంటి క్రీడల ద్వారా ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఆటే ఫెన్సింగ్. దీనివలన ఎవరికీ ఎలాంటి గాయాలు కావు. ప్రాణాపాయమూ ఉండదు. పైగా ఎదుటి వ్యక్తులను ఎదుర్కొనే ఆత్మస్త్థెర్యం కలుగుతుంది. చేతిలో చిన్న కర్ర ఉన్నా ఖడ్గంలా ఉపయోగించే నేర్పరితనం ఉంటుంది. ఎదుటి వ్యక్తుల దాడిని ఎలా ఎదుర్కోవాలి? ఎదుటి వ్యక్తులపై ఎలా దాడి చేయాలో నైపుణ్యాన్ని సాధించవచ్చు.మనదేశంలో చాలా క్రీడల్లాగే విద్య, ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఈ ఆటపై బాలికలు దృష్టి సారిస్తే శరీరాన్ని వేగంగా కదిలించడంతో పాటు ఆటపై పట్టు సాధించే అవకాశముంది.

నేపధ్యము

[మార్చు]

ఫ్రెంచ్ దేశస్థులు ఒకప్పుడు యుద్ధంలో ఫెన్సింగ్‌ని ఉపయోగించేవారు. రాను రాను అదో క్రీడగా మారిపోయింది. 1896లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనప్పుడు ఈ క్రీడను అందులో ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా మూడు విభాగాలుంటాయి. ఈపీఈఈ (ఇపీ) అనేది మొదటి విభాగం. ఇందులో తల నుంచి కింద కాలు వరకు కత్తితో తాకవచ్చు. ఎఫ్‌వోఐఎల్ (ఫాయిల్) అనేది రెండో విభాగం. ఇందులో మెడ నుంచి నడుము వరకు మాత్రమే కత్తితో తాకించవచ్చు. ఇక ఎస్ఏబీఆర్ఈ (సాబర్) అనేది మూడో విభాగం. ఇందులో తల భాగం నుంచి నడుము భాగం వరకు మాత్రమే కత్తితో తాకవచ్చు. ఈ ఆటలో ఉపయోగించే స్క్వాడ్ (ఖడ్గం), తలకు ఉపయోగించే మాస్క్, చేతులకు గ్లౌవ్స్, ఛెస్ట్‌గార్డు, కాళ్లకు ప్రత్యేక బూట్లు ప్రధానం.

ఈ ఆటలో ఖడ్గం ఉపయోగిస్తారు. ఆట ఆడేటప్పుడు తలకు మాస్క్, ఛెస్ట్‌గార్డ్, చేతులకు గ్లవ్స్, కాళ్లకు ప్రత్యేక బూట్లు ఉపయోగించడం వలన ప్రమాదం ఉండదు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సాధారణ పరికరాలను ఉపయోగిస్తారు. అంపైర్లే పాయింట్లను నిర్ణయిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఖడ్గం ఎదుటి వ్యక్తికి తగలగానే స్కోర్‌బోర్డుపై పాయింట్లు నమోదు అవుతాయి. 1896లో ఒలింపిక్ క్రీడను ప్రారంభించినప్పుడు ఫెన్సింగ్ విభాగంలో పురుషులకు మాత్రమే అవకాశం కల్పించారు. 1920 నుంచి మహిళలకు కూడా అవకాశం కల్పించారు. వ్యక్తిగత విభాగం పోటీలో 12 నిమిషాల ఆట ఉంటుంది. ప్రతి మూడు నిమిషాలకు ఒకటిన్నర నిముషం విశ్రాంతి ఇస్తారు. గ్రూపు విభాగంలో నలుగురు క్రీడాకారులుంటారు. వీరిలో ముగ్గురు మ్రాతమే ఆడతారు. మొదటగా ఒక వ్యక్తి మూడు నిమిషాలు ఆడి పక్కకొస్తే రెండో వ్యక్తి ఆడతాడు.. తరువాత మూడో వ్యక్తి ఆడతాడు.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]