గజ్జెల నాగేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గజ్జెల నాగేశ్
గజ్జెల నాగేశ్


తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 డిసెంబర్ 2021 - 07 డిసెంబర్ 2023[1]
ముందు జి. దేవీప్రసాద్ రావు

వ్యక్తిగత వివరాలు

జననం 1970
ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు
29, డిసెంబర్ 2021నాటికి

గజ్జెల నాగేశ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 17 డిసెంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడై,[2] 29 డిసెంబర్ 2021న భాద్యతలు చేపట్టాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

గజ్జెల నాగేశ్ తెలంగాణ మాలి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఉద్యంలో క్రియాశీలకంగా పని చేశాడు. ఆయనను కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్‌చార్జ్‌గా కేసీఆర్ బాధ్యతలు అప్పగించి, 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కింది. గజ్జెల నాగేశ్ 2014లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జి. సాయన్న చేతిలో 3,275 స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. ఆ తర్వాత జి. సాయన్న టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో గజ్జెల నాగేశ్ కు పార్టీ 2018 ముందస్తు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు, దింతో ఆయన టిఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసి ఓడిపోయాడు.[4] టిఆర్ఎస్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేశారని కొంతకాలం పాటు ఆయనను పార్టీ సస్పెండ్‌ చేసింది.[5] గజ్జెల నాగేశ్‌ 17 డిసెంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడై,[6][7] 29 డిసెంబర్ 2021న చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[8][9]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (18 December 2021). "అయిదు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  3. Sakshi (30 December 2021). "కార్పొరేషన్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  4. Vaartha (19 November 2018). "సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ నుండి పోటి చేయనున్న గజ్జెల నగేశ్‌". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  5. HMTV (30 November 2018). "నలుగురు రెబెల్స్‌పై టీఆర్ఎస్‌ వేటు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  6. Namasthe Telangana (17 December 2021). "ఉద్యమకారులకు ఉన్నత స్థానం". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  7. Sakshi (17 December 2021). "పలు కార్పొరేషన్‌లకు కొత్త చైర్మన్‌లను నియమించిన కేసీఆర్‌". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  8. TNews Telugu (29 December 2021). "ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన క్రిశాంక్, నగేష్". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
  9. Eenadu (30 December 2021). "మూడు కార్పొరేషన్ల కొత్త ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.