గుస్సాడీ నృత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుస్సాడి
గుస్సాడి
గుస్సాడి నృత్యం కళాకారుడు
అధికారిక పేరుగుస్సాడి
యితర పేర్లుగుస్సాడి తాదో
జరుపుకొనేవారురాజ్ గోండ్ గిరిజనులు
రకంప్రాంతీయ జానపదం
జరుపుకొనే రోజుదీపావళి నేలలో
ఆవృత్తిదండారి
2015, ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గుస్సాడీ కళాకారుల ప్రదర్శన
అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇష్టా) సమావేశంలో గుస్సాడీ కళాకారుల ప్రదర్శన

గుస్సాడి నృత్యాన్ని దండారి పండుగ సందర్భంగా చేస్తారు , దండారి పండుగను ఆదిలాబాద్ మరియు మహారాష్ట్రకు చెందిన రాజ్ గోండ్ గిరిజనులు జరుపుకుంటారు .మాన మర్యాదలకు ఉదాహరణగ ఈ పండుగాను చేప్పుకోవచ్చు.9 రోజులూ నిర్వహించే ఈ పండుగలో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు దీంతో పాటు చచోయీ, మహిళలు చేసే రేలా నృత్యాలూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

దండారి పండుగ భోగి తో మొదలవుతుంది భోగి రోజు ఎత్మసూర్ దేవతను దండారి నృత్యం లో వాయీంచే వాయీద్యాలూ అయీన గుమ్మెళ,పర్ర, వెట్టె,కోడల్ లను పూజించి గుస్సాడి వేషధారణ ను వేస్తరూ, నేమలి ఈకలతో చేసిన టోపి  మేడలో హరలు,ఒంటికి బుడిదను రాస్తారు భూజనికి మేక తోలు ధరిస్తారూ దాంతో పాటు చేతికి గంగారం సోట అనే కర్రను పట్టుకుంటారు వీరీతో పాటు చచోయీ నృత్యం చేసేవారిని డియూర్ అంటారు వారు దోతి , రూమాలు కట్టుకుంటారు ప్రతి ఒక్క డియూర్ తో నృత్యం చేయడానికి ఒక పోరిక్ ఉందుంది, మహిళలు మగ వారితో కాకుండా వేరుగ నృత్యన్ని ప్రదర్శీస్తరు మహిళలు చేసే నృత్యాన్ని "రేలా" నృత్యం అని పిలుస్తారు మరియు నృత్యం చేసే మహిళలను డీయాంగ్ అంటారు...

ఒక ఊరి నుండి మరోక ఊరికి దండారి బృందం అనేది వేళ్ళడం జరుగుతుంది.ఊరి పోలిమెరలో వెళ్లి తుడుం మెగించి ఆ ఊరిలో డప్పులు కోడుతు ఊరిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఊరి వారు కూడ డప్పులు కోడుతు వీరికి ఘన స్వాగతం పలుకుతారు... చివరి రోజున కోలబోడి తో ఈ పండుగను ముగిస్తారు

2018 ఉగాది వేడుకల్లో గుస్సాడీ కళాకారుల నృత్యం

విధానం

[మార్చు]

వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను గుస్సాడీ అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, జింక కొమ్ములున్న తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. ఇందులోని వాయిద్యాలు డప్పు, తుడుము, పిప్రి, కొలికమ్ము. నృత్యం అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యం ప్రత్యేకత.[1]

దీపావళి గోండులకు అతి పెద్ద పండుగ. గుస్సాడి పండుగ దీపావళి పండుగకు 1 వారం లేదా 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ప్రారంభ రోజును "భోగి" అని పిలుస్తారు. ముగింపు రోజును "కోలబోడి" అని పిలుస్తారు. గుస్సాడీలు రంగురంగుల దుస్తులను ధరించి ఆభరణాలతో అలంకరించుకుంటారు. వారు బృందాలతో పాడుతూ, నృత్యాలు చేస్తూ పొరుగు గ్రామాలకు వెళతారు. ఇటువంటి బృందాలను "దండారి" అంటారు. ప్రతి బృందంలో నలభై మందికి పైగా సభ్యులు ఉంటారు. 'గుసాడి' దండారిలో ఒక భాగం. డప్పు, తుడుము, వెట్టే, డోల్కి, పెప్రే, కాలికోంలు వారి సంగీత వాయిద్యాలు.

దండారిలో ఉపయోగించే వాద్యాలు

[మార్చు]

1.గుమ్మెళ

2.పర్ర

3.వెట్టె

4.పెప్రె

5.కాళికోం

6.తుడుం

7.డప్పు

8.పేటి

గుస్సాడీ రాజు

[మార్చు]
గుస్సాడీ కనకరాజు
గుస్సాడీ కనకరాజు

తెలంగాణ కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల గుస్సాడీ కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.[2][3] ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజుకు గుస్సాడీ రాజుగా పిలుస్తారు.1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. 55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ వస్తున్న ‘రాజు’, ఈ నృత్యానికి దేశవ్యాప్తంగా ‘గుర్తింపు’ని కూడా తెచ్చారు. కనకరాజుకు పద్మ పురస్కారంతో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న గోండి ఆదివాసీ నృత్యానికి వంటవానిగా పనిచేసే అతనికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.[2]

మూలాలు

[మార్చు]
  1. గుస్సాడీ నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.
  2. 2.0 2.1 "గుస్సాడీ నృత్యానికి గౌరవం". www.andhrajyothy.com. Retrieved 2021-01-27.
  3. Telugu, TV9 (2021-01-26). "Kanaka Raju: తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే పద్మశ్రీ.. కుమురంభీం జిల్లా గుస్సాడీ నృత్య ప్రదర్శనకు గుర్తింపుగా.. - kanaka raju wins padma shri". TV9 Telugu. Archived from the original on 2021-01-26. Retrieved 2021-01-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బాహ్య లంకెలు

[మార్చు]