గృహలక్ష్మి (1938 సినిమా)
| గృహలక్ష్మి (1938) | |
| దర్శకత్వం | హెచ్.ఎమ్.రెడ్డి |
|---|---|
| నిర్మాణం | మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి, హెచ్.ఎమ్.రెడ్డి |
| కథ | సముద్రాల రాఘవాచార్య |
| తారాగణం | కన్నాంబ, కాంచనమాల, చిత్తూరు నాగయ్య, రామానుజాచారి, గౌరీపతిశాస్త్రి, రోహిణి, గోవిందరాజులు సుబ్బారావు, సరళ, మోహిని |
| సంగీతం | ప్రభల సత్యనారాయణ |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| ఛాయాగ్రహణం | కె.రామ్‌నాథ్ |
| నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
గృహలక్ష్మి హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం. దేశభక్తికి, సమాజం పట్ల వున్న బాధ్యతలు రెండింటికీ ప్రాధాన్యత నిచ్చి, జనచైతన్యానికి శక్తివంతమైన మాధ్యమం 'సినిమా' అని హెచ్.ఎం.రెడ్డి నిరూపించారు. ఈ చిత్రానికి సోమరాజు రామానుజరావు రచించిన 'రంగూన్ రౌడీ' అనే నాటకం ఆధారం. ఇందులో వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తం.
విషయ సూచిక |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
నర్తకి మాధురి (కాంచనమాల) ని ప్రేమించిన డాక్టర్ కృష్ణారావు (రామానుజాచారి) తన భార్య రాధ (కన్నాంబ) ను నిర్లక్ష్యం చేస్తాడు. తాగుడుకు బానిస అయిన కృష్ణారావుపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు అభియోగం మోపబడుతుంది. సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే గోపీనాథ్ (నాగయ్య) రాధను చేరదీసి ఆదుకుంటాడు. మాధురితో గొడవపడిన సందర్భంగా రాధ మతిస్థిమితం కోల్పోతుంది. అతనిలోని వేశ్యాలోలత్వం వలన అతని డబ్బు దస్కం కోల్పోతాడు. దైవవశాత్తు భార్య నోములు ఫలించి మరణదండన తప్పుతుంది. భార్యాపిల్లలు కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది.
[మార్చు] పాటలు
- దేవుడు లేడూ, న్యాయం ధర్మం లేవూ
- కల్లు మానండోయ్, బాబూ కళ్ళు తెరవండోయ్ - నాగయ్య
- లెండు భారత వీరులారా - నాగయ్య
[మార్చు] విశేషాలు
- చిత్తూరు నాగయ్య కు ఇది తొలి సినిమా.
- హీరో పాత్రధారి రామానుజాచారి కి ఇదే తొలి మరియు చివరి చిత్రం.
- కొడవటిగంటి కుటుంబరావు, ఆంధ్ర వార పత్రిక లో చిత్రసమీక్ష రాస్తూ ఎన్ని లోపాలున్నా గృహలక్ష్మి తెలుగు చిత్రాల్లో ఉత్తమమైనవి' అని రాశారు.
- ఈ చిత్రంలో అశ్లీలమైన సన్నివేశాలు ఉన్నాయని, హాస్య సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.
[మార్చు] మూలాలు
- నాటి సంచలన చిత్రం 'గృహలక్ష్మి', నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీ.13.