గ్రంధాలయం (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రంధాలయం
దర్శకత్వంసాయి శివన్‌ జంపన
రచనసాయి శివన్‌ జంపన
మాటలుసాయి శివన్‌ జంపన
నిర్మాతవైష్ణవి శ్రీ
తారాగణం
ఛాయాగ్రహణంసామల భాస్కర్
కూర్పుశేఖర్‌ పసుపులేటి
సంగీతంవర్ధన్‌
నిర్మాణ
సంస్థ
వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
విడుదల తేదీ
2023 మార్చి 3 (2023-03-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్రంధాలయం 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వైష్ణవి శ్రీ నిర్మించిన ఈ సినిమాకు సాయి శివన్‌ జంపన దర్శకత్వం వహించాడు. విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి, కాలకేయ ప్రభాకర్‌, సోనియాచౌదరి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 డిసెంబర్ 19న విడుదల చేసి[1], సినిమాను 2023 మార్చి 3న విడుదల చేశారు.[2]

కథ[మార్చు]

రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) ప్రేమించుకుంటారు. ఇందుమతి ఒక గ్రంధాలయంలో ఉన్న 1965 నాటి బుక్ ను చదవడం మొదలు పెడుతుంది. అయితే ఈ పుస్తకం చదవాలని ప్రయత్నించిన వారు మూడు రోజులు చదివిన తరువాత చనిపోతుంటారు. ఆలా అప్పటి వరకు సుమారు 100 మంది ఆ బుక్ చదివి చనిపోయింటారు. అయితే రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ ఈ విషయం తెలుసుకొని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది. ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు? చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకువాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సమస్యలు ఏమిటి? ఇందుమతిని ఈ ఆపద నుండి కాపాడాడ అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

  • విన్నుమద్దిపాటి
  • స్మిరితరాణిబోర
  • కాలకేయప్రభాకర్‌
  • సోనియాచౌదరి
  • అలోక్‌జైన్‌
  • జ్యోతిరానా
  • కాశీనాథ్‌
  • డా.భద్రం
  • మేక రామకృష్ణ
  • పార్వతి
  • శివ
  • శ్రావణి
  • మురళీకృష్ణ
  • నవ్య శారద
  • నరేంద్ర నాయుడు
  • స్నేహ గుప్తా

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
  • నిర్మాత: వైష్ణవి శ్రీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి శివన్‌ జంపన
  • సంగీతం: వర్ధన్‌
  • సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్
  • ఎడిటర్‌ : శేఖర్‌ పసుపులేటి
  • ఆర్ట్‌ డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అల్లంనేని అయ్యప్ప

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (20 December 2022). "'గ్రంథాలయం'లో ఏం జరిగింది?". Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
  2. Sakshi (27 February 2023). "యాక్షన్‌ థ్రిల్లర్‌". Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
  3. Sakshi (3 March 2023). "'గ్రంథాలయం' మూవీ రివ్యూ". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 4 మార్చి 2023 suggested (help)