గ్రంథాలయము

వికీపీడియా నుండి
(గ్రంధాలయము నుండి దారిమార్పు చెందింది)

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంథాలయము. దీనిని ఆంగ్లమున లైబ్రరీ (Library) అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉదృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

విషయ సూచిక

జాతీయ గ్రంథాలయాలు [మార్చు]

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం[1] కోల్కతాలో వున్నది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వశతాబ్దంలో ప్రచురించిన పుస్తకాలు వున్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు (2010 నాటికి) వున్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులోవుంచే పని జరుగుతున్నది. అలాగే భారత డిజిటల్ లైబ్రరీ [2] కూడా, వివిధ పుస్తకాలను కంప్యూటర్ లో భద్రపరచి అందరికి అందుబాటులోకి తెస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు [మార్చు]

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ [3] 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 బిడిసి (పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers)గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ[4]ప్రాజెక్టు లో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.


యల్లాయపాళెం అనే గ్రామంలో గ్రంథాలయం లోపల
ఏలూరు ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయం
ఏలూరు ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయంలోని డిజిటల్ రిఫరెన్సు సెక్షన్

అంతర్జాల గ్రంథాలయము [మార్చు]

అంతర్జాల వ్యాప్తి చెందిన తరువాత, గ్రంథాలయములోని పుస్తకాలను డిజిటైజ్ చేసి, ఎక్కడినుండైనా చదవాటానికి వీలుగా వెబ్సైట్ల ద్వారా అందచేస్తున్నారు. వీటిలో తెలుగు గ్రంథాలున్న ప్రముఖమైనవి.

ఇవి కూడా చూడండి [మార్చు]

వనరులు [మార్చు]

  1. జాతీయ గ్రంథాలయం
  2. భారత డిజిటల్ లైబ్రరీ
  3. Functioning of Regional Public Libraries in Andhrapradesh-A study, LV Chandrasekhara Rao, 2008, Kalpaz publications, Delhi (Google Books partial preview)
  4. డిజిటల్ లైబ్రరీ నివేదిక


"http://te.wikipedia.org/w/index.php?title=గ్రంథాలయము&oldid=809864" నుండి వెలికితీశారు