చదరంగం (ఆట)
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. (అనువాదకులకు వనరులు) |
| చదరంగం (Chess) | |
|---|---|
ఎడమ నుండి, ఒక తెల్ల రాజు, నల్ల ఏనుగు మరియూ మంత్రి,తెల్ల బంటు, నల్ల గుర్రం, తెల్ల శకటు |
|
| Players | {{{players}}} |
| Setup time | {{{setup_time}}} |
| Playing time | {{{playing_time}}} |
| Random chance | లేదు |
| Skills required | {{{skills}}} |
| * Games by correspondence may last many months, while blitz chess games are even shorter than 10 minutes | |
| BoardGameGeek entry | |
చదరంగం (Chess Game) ఇద్దరు ఆటగాళ్ళ మధ్య ఒక వినోద మరియు పోటీ రేపెట్టే ఆట. కొన్ని సార్లు దీనిని Western Chess లేక International Chess అని అంటారు. ఈ పేర్లు తతిమ్మా (పూర్వపు) చదరంగం వంటి ఆటలను భిన్నంగా గుర్తిచడానికి తోడ్పదతాయి. భారత దేశపు మూలమైన పురాతన ఆటల నుంచి పుట్టి దక్షిణ ఐరోపా ఖండంలో, పదిహేనవ శతాబ్దపు రెండవ భాగంలో పెరిగిన ఈ ఆట ప్రస్తుత దశకు చేరుకుంది.
ఈ రోజున, చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించింది. ఈ ఆటను ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 61 కోట్ల మంది చదరంగం క్లబ్బులలోను, ఇంటర్నెట్ లోను, ఈ మైల్ ద్వారాను, ప్రపంచ వ్యాప్తమ్గా జరిగే పోటిలలో ఆడతారు. చదరంగం ఆడడం బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును.
ఈ ఆటకు కావలసిన సామాగ్రి, ఒక నలుపు తెలుపు గల్లు గల బోర్డు, నలుపు, తెలుపు పావులు. ఒక ఆటగాడు తెలుపులను మరొక ఆటగాడు నలుపులను ఎంచుకుంటారు. ఆట ఆరంభంలో 16 తెల్ల పావులు 16 నల్ల పావులు బొమ్మలో చూపిన విధంగా అమర్చి ఉంటాయి, తెల్ల పావులను ఒక ఆతటగాడు కంట్రొల్ చేస్తే నల్ల పావులను మరి ఒకడు. 16 పావులు: ఒక రాజు (king), ఒక మంత్రి (queen), రెండు ఏనుగులు (rooks), రెండు గుర్రాలు(knights), రెండు శకటాలు (bishops), మరియు ఎనిమిది బంట్లు (pawns). ఆట యొక్క ఉద్దేశ్యం ఎదుటి రాజును చెక్ మేట్(checkmate) చెయ్యడమే, అంటే ఎదుటి రాజు మీద మన దగ్గర ఉన్న ఎదో ఒక పావుతో దాడి చెయ్యడం, ఆ సమయంలో ఎదుటి రాజుకు దాడి (in "check") నుండీ తప్పుకొవటానికి ఇంకా ఏ ఎత్తూ లేకపోవటమే. ఆట కనుగొన్నప్పటి నుండీ సైద్దాతులెంతోమంది వివరమైన ఎత్తుగడలూ, యుక్తులూ పెంపొందించారు.
క్రమబద్దమైన చదరంగం ఆటల పోటీల సంప్రదాయం 16 వ శతాబ్ధంలో ప్రారంభించారు. మొదటి official ప్రపంచ చదరంగ ఛాంపియన్, విల్ హెల్మ్ స్టీనిజ్ 1886 లో తన టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇదే వరసలో ఈ రోజు వ్లాదిమిర్ క్రామ్నిక్14 వ ప్రపంచ ఛాంపియను. చదరంగం ఒలింపియాడ్స్ ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. 20 వ శతాబ్ధ ప్రారంభమునుండీ, వరల్డ్ ఛెస్ ఫెదరేషన్ మరియూ ఇంటర్నేషనల్ కరస్పాండెన్స్ ఛెస్ ఫెడరేషన్, అను రెండు అంతర్జాతీయ సంస్థలు చదరంగం ఆటల పోటీలను నిర్వహిస్తున్నాయి.
కంప్యూటర్ శాస్త్రజ్ఞుల ఒక goal, కంప్యూటర్ చదరంగాన్ని సృష్టించడం, అంటే చదరంగం ఆడే కంప్యూటర్ ని సృష్టించడం. ఈ రోజున కంప్యూటర్ చదరంగ సామర్ధ్యత ప్రభావం నేటి ఆట మీద ఎంతో ఉంది. 1997 లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ అయిన గారీ కాస్పరోవ్ మరియూ IBM సృస్టించిన Deep Blue ఛెస్ ప్రొగ్రాము ల మధ్య జరిగిన పోటీలో గారీ కాస్పరోవ్ ఓటమితో కంప్యూతర్ ప్రొగ్రాము అత్యంత శక్తివంతమైన మానవ ఆటగాణ్ణి కూడా జయిమ్చగలవని నిరూపించబడినది. 1990 దశాబ్ధ మధ్యంలో ఇంతెర్నెట్ పెరగడంతో పాటు ఆన్ లైన్ చదరంగం కూడా అభివృద్ది చెందింది.
విషయ సూచిక |
[మార్చు] నియమాలు
| చదరంగంలో సైన్యం | ||
|---|---|---|
| రాజు (King) | ||
| మంత్రి(Queen) | ||
| ఏనుగు(Rook) | ||
| శకటం(Bishop) | ||
| గుఱ్ఱం(Knight) | ||
| బంటు (Pawn) | ||
చదరంగం అరవైనాలుగు గళ్ళు కలిగిన ఒక చదరపు బల్ల మీద ఆడతారు. ఈ అరవైనాలుగు గళ్ళలో నలుపు తెలుపు గళ్ళు ఒక దాని తర్వాత ఒకటి గా వస్తాయి, అంటే ఒక తెలుపు గడి పక్కన ఒక నలుపు గడి, ఆ తర్వత తెలుపు గడి, అలా.... పావులు రెండు వర్గాలు గా విభజించబడి ఉంటాయి. ఒకటి నలుపు, ఇంకోటి తెలుపు. ఆటగాళ్లు తాము ఆడే పావుల రంగు బట్టి గుర్తించ బడతారు. ఇలా ఇద్దరు ఆటగాళ్లు చెరో పదహారు పావులతో ఆట మొదలు పెడతారు. ఆ పదహారు పావులు ఇవే - ఒక రాజు, ఒక రాణి (మంత్రి అనికూడా వాడుక లో ఉంది), రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, రెండు శకటాలు, మరియు ఎనిమిది సిపాయి పావులు.
ఎవరు తెల్ల పావులని తీసుకోవాలి ఎవరు నల్ల పావులని అనే విషయన్ని స్నెహపూర్వక ఒప్పందం ద్వారా కాని, రూపాయి బిళ్ళను పైకెగరేసి కాని నిర్థారించవచ్చు.
[మార్చు] చదరంగం బల్లని అమర్చడం
ఆటగాడి కుడి చేతి వైపు క్రింద తెల్ల గడి ఉండేట్టుగా బోర్డుని పెట్టాలి. ఆట ప్రారంభంలో మొదటి రెండు అడ్డ వరసలలో (బొమ్మలో చూపినట్టుగా) పావులను అమరుస్తారు. రెండవ వరసలో ఎనిమిది బంట్లు అమర్చి, మొదటి వరసలో మూల గళ్ళలో ఏనుగులు, వాటి పక్క గుర్రాలు, వాటి పక్క శకట్లు అమర్చాలి. ఇప్పుదు మిగిలిన రెండు మధ్య గళ్ళలో రాజు, రాణి అమర్చాలి. అయితే నల్ల రాణీ నల్ల గడిలో, తెల్ల రాణీ తెల్ల గడిలో పెట్టాలి.
[మార్చు] ఎత్తులు
మొదట ఎత్తు వేసే హక్కు తెల్లపావులది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎత్తులు వేసుకుంటూ పోతారు. ఒక ఎత్తులో ఒక పావుని మాత్రమే కదల్చాలి, ఒక్క కోట కట్టడం(castling)లోతప్ప. పావుని వాటి వాటి నియమల ప్రకారం ఏదేని ఖాళీ గడికి కాని, ఎదుటి పావులని చంపి ఆ పావులున్న గడికి కాని కదల్చవచ్చు. చంపిన పావులు ఆట నుండి బయటకు తీసివేయబడతాయి. exception: అయితే (en passant) (ఎన్ పాసంట్)లో మాత్రం బంటు చచ్చిన బంటూన్న గడికి పైగడిలొకి వెల్తుంది.
ఎవరి రాజైనా దాడిలో ఉంటే (అంటే తర్వాతి ఎత్తులో రాజును చంపగలిగే సామర్ధ్యం ఎదుటి పావుల్లో దేనికి ఉన్నా) రాజుకి షరా(Check )అన్న మాట. తన రాజు షరాలోకి వచ్చే ఏ ఎత్తు ఆటగాడు వెయ్యలలేడు. ఎదుటి ఆటగాడు తన రాజు కి ఎదైనా పావుతో షరా చెపితే, 1)రాజుని షరా నుంచి తప్పించగలిగే ఎత్తు కాని, 2)రాజుకి, షరా ఛెప్పిన పావుకీ మధ్య వేరే పావు వచ్చే ఎత్తు కాని, లేదా 3)షరా చెప్పిన పావుని తీసి వేసే ఎత్తు కాని వెయ్యాలి. అటువంటి ఎత్తు లేకపోతే ఆటకట్టు(checkmate) అయినట్లే, అంటే ఆట ఓడిపోయినట్లే.