చర్చ:పొగ చుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొగ చుట్ట అని అంటారు కాని వాడుకలో వట్టి "చుట్ట" అనే పిలుస్తారు--చామర్తి 18:15, 26 మే 2007 (UTC)

అవును. నేనూ అదే అనుకుంటున్నాను --వైఙాసత్య 18:18, 26 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమే. కాని, 'పొగచుట్ట' లోని 'పొగ' పొగాకు లోంచి వచ్చింది. కనుక 'పొగచుట్ట' అన్నప్పుడు పొగాకుతో చుట్టిన చుట్ట అవుతుంది. గంజాయి ఆకుతో చుట్టిన చుట్ట 'గంజాచుట్ట' అవుతుంది, కాని ఈ మాటని ఎవ్వరూ వాడగా నేను చూడ లేదు. బీడీ ఆకుతో చుట్టిన చుట్ట బీడీ అవుతుంది. చుట్టలని ఒక్క పొగాకుతోనే చుట్టాలని నియమం లేదు కదా! కాగితంలో చుట్టిన చుట్ట సిగరెట్ అవుతుంది. ఈ సిగరెట్ చివర ఉన్న 'ఎట్' అన్న మాట 'చిన్న సిగార్' అన్న అర్ధాన్ని స్పురింప జేస్తుంది.

మాట ఉత్పత్తి ఎలా ఉన్నా, చుట్ట అన్నప్పుడు పొగచుట్ట అన్న ఆర్ధంతోటే వాడతారు.

ఇదే విధంగా 'పొగబండి' ని కూడ విశ్లేషించవచ్చు కానీ ,, ```వేమూరి