చార్మినారు

వికీపీడియా నుండి


చార్మినార్ (ఆంగ్లం : Charminar) (హిందీ : चार मीनार,) చార్-మీనార్ లేదా నాలుగు మీనార్లు గల్గిన ఓ కట్టదము, ఇది హైదరాబాదు నగరమునందు ఒక ప్రాచీన కట్టడము. ఇది చార్మినార్ ప్రాంతములో ఉన్ది. ప్రక్కనె చిన్న గుడి ఉ0ది.

చార్మినార్, రాత్రి సమయ సుందర దృశ్యం.

చార్మినారు హైదరాబాదు నగరానికి చెందిన ఒక పురాతన కట్టడం. ఇది మునుపు నగరానికి ఒక ముఖ్యమైన గుర్తు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించినాడు.

[మార్చు] మసి'బారుతున్న చార్మినార్

అందమైన చార్మినార్‌ కాలుష్యం ధాటికి రంగుమారుతోంది. 1997లో ప్రకటించిన 'చార్మినార్‌ పెడస్టేరియన్‌జోన్‌' పథకం ప్రకారం చార్మినార్‌ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల వరకూ వాహనాలు తిరగకుండా కేవలం పాదచారులు మాత్రమే సంచరించాలి.తద్వారా కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచొచ్చని భావించారు. పర్యాటకులకు ఆహ్లాదం కూడా లభిస్తుంది. పర్యాటక శాఖ ఈ పథకం కోసం అప్పట్లోరూ.34 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ నిధులు సర్దుబాటు చేసుకోలేక కేంద్రాన్ని సాయం చేయండి అంటూ తాజా పల్లవి ఎత్తుకుంది. మరో రూ.70 కోట్లు ఖర్చుపెడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందట.హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ ఎలాగో ఢిల్లీలో కుతుబ్‌మినార్‌ అలా ప్రసిద్ధికెక్కింది. ఇది కూడా జనావాసాల మధ్యే ఉంది. ప్రభుత్వం రెండుదశాబ్దాల క్రితమే కట్టడం చుట్టూ 30 ఎకరాల స్థలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసింది. ఫర్లాంగు దూరం వరకూ రోడ్లు లేవు. రక్షిత ప్రాంతంగా ప్రకటించిన ఖాళీ స్థలం చుట్టూ ఎత్త్తెన ప్రహరీ, చెట్లు ఉన్నాయి. మరింత భద్రంగా ఉంది. ఇందుకే చార్మినార్‌ కన్నా 150 ఏళ్లు ముందుగా నిర్మించినా చెక్కుచెదరకుండా ఉంది.(ఈనాడు9.11.2009)

చార్మీనార్ వద్ద తెలుగులో సమాచార ఫలకము
"http://te.wikipedia.org/w/index.php?title=చార్మినారు&oldid=699568" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు