చింతలపల్లి వెంకటరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతలపల్లి వెంకటరావు
వ్యక్తిగత సమాచారం
జననం1871
మూలంమైసూరు రాజ్యం
మరణం1969
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిభారతీయ శాస్త్రీయ సంగీతం గాత్ర విద్వాంసుడు
వాయిద్యాలుగాత్రం

చింతలపల్లి వెంకటరావుకర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు 1871వ సంవత్సరంలో మైసూరు రాజ్యంలోని చింతలపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతని పూర్వీకులు పేరుపొందిన సంగీతకారులు. ఈ చింతలపల్లి గ్రామాన్ని నవాబు రణదుల్లా ఖాన్ ఇతని పూర్వీకులకు బహుమతిగా ఇచ్చాడు. ఇతడు మొదట భాస్కరరావు, వెంకటనరసప్పల వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తర్వాత కరూర్ రామేశ్వరప్ప, పక్కా హనుమంతాచార్, నాయకరపట్టి శేషయ్య, హనగల్ చిదంబరయ్యల వద్ద తన సంగీతానికి మెరుగులు దిద్దుకున్నాడు. ఇతడు మైసూరు దర్బారులో అనేక సభలలో సన్మానాలను పొందాడు. 1960లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఇతడిని విశిష్ట సభ్యునిగా ఎన్నుకుంది. 1962లో మైసూరు రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 1967లో కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక గాత్ర సంగీత విభాగంలో ఇతనికి అవార్డును ప్రకటించింది[1].

మూలాలు[మార్చు]