జంతువులతో సంభోగం
జంతువులతో జరిపే సంభోగం పేరు ఆంగ్లంలో జూఫీలియా (Zoophilia). గ్రీకుబాషలో జోఇన్ అంటే జంతువు, ఫీలియా అంటే ప్రేమ అని అర్థం. జంతువులతో రతి జరిపే వారిని (ఆడ అయినా కావచ్చు లేదా మొగ అయినా కావచ్చు) జూఫైల్ అంటారు. జూఫీలియా ఒక మానసిక ఋగ్మత (సైకొపాథియా సెక్సుయాలిస్)గా 1886లో రిచర్డ్ ఫ్రెహీ (Richard Freiherr), మొట్టమొదటి సారిగా పేర్కొన్నాడు. జూఫీలీయా అనబడే జంతువులతో జరిపే సంభోగం, జంతు హింసగా లేదా పారాఫీలియాగా, (paraphilia) పరిగణింపబడుతుంది. ఇది ఒక విపరీత రతిప్రవృతిగా (sexual orientation) అని మనోవైద్యులు పరిగణిస్తారు. ప్రక్యాత సెక్సాలజిస్ట్' కిన్సే' తన నివేదికలో ఇటువంటి తరహా సంభోగంలో పాల్గొనే వారు (సంభోగింప తగిన వయసు గల జనాబాలో) 8% మొగవారనీ, 3.6% ఆడవారని, 40–50 శాతం పొలాలలో, పశుసంరక్షక, పశుసంవృద్ది కేంద్రాలలో పని చేసే వారని పేర్కొన్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన పరిశోధనలలో ఆ నిష్పతి 4.9%, 1.9% మాత్రమే అని తెలిసింది.
.
వాత్సాయనుడి, కామశాస్త్రంలో జంతువులను రమించడం గురించి పేర్కొనబడింది. ఖజరాహోలోని యెన్నోశిల్పాలు, జంతు సంభోగం అప్పటికే రతి క్రీడలో ఒక అంశం అని తెలిపే శిల్పాలున్నాయి. ఉదాహరణ: పక్కన చూపిన చిత్రంలో అశ్వాన్ని సంభోగిస్తున్న మొగవాడి చుట్టు చేరి ఉత్సాహపరుస్తున్నట్టుగా ఉంది.