జాకబ్ జుమా
| His Excellency Jacob Zuma GCB |
|
|
|
|
| Incumbent | |
| Assumed office 9 May 2009 |
|
| [[Deputy President of South Africa|Deputy]] | Kgalema Motlanthe |
|---|---|
| ముందు | Kgalema Motlanthe |
|
|
|
| Incumbent | |
| Assumed office 18 December 2007 |
|
| [[Deputy President of the African National Congress|Deputy]] | Kgalema Motlanthe |
| ముందు | Thabo Mbeki |
|
|
|
| పదవీ కాలము 14 June 1999 – 14 June 2005 |
|
| President | Thabo Mbeki |
| ముందు | Thabo Mbeki |
| తరువాత | Phumzile Mlambo-Ngcuka |
|
|
|
| పదవీ కాలము 1999 – 2005 |
|
|
|
|
| జననం | మూస:Bda Inkandla, South Africa |
| రాజకీయ పార్టీ | African National Congress (1959–present) |
| భార్య/భర్త | Gertrude Sizakele Khumalo (1973–present) Kate Zuma (1976–2000)[1] Nkosazana Dlamini (1982–1998) Nompumelelo Ntuli (2008 – present) Thobeka Mabhija (2010–present)[2] |
| సంతానము | 20 |
| మతం | Protestantism, Full Gospel Church of Southern Africa [3] |
జాకబ్ గెడ్లెయిహ్లెకిసా జుమా (జననం ఏప్రిల్ 12, 1942) దక్షిణాఫ్రికా అధ్యక్షుడు,[4] 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించింది, ఆపై దేశ పార్లమెంట్ ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
అధికార రాజకీయ పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC)కు జుమా అధ్యక్షుడిగా ఉన్నారు, 1999 నుంచి 2005 వరకు ఆయన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడిగా పని చేశారు.[5] పేరులోని మొదటి అక్షరాలు JZ తో కూడా ఆయనను సూచిస్తారు,[6] ఆయన జాతి పేరు షోలాజీ .[7][8] డిసెంబరు 18, 2007న జుమా ANC అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు, పోలోక్వాన్‌లో జరిగిన ANC సమావేశంలో అప్పటి అధ్యక్షుడు థాబో బెకీని ఓడించి ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. జుమా గతంలో సౌత్ ఆఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీ (SACP) సభ్యుడిగా కూడా వ్యవహరించారు,[9] 1990లో ఈ పార్టీ నుంచి బయటకు రాకముందు పార్టీ పొలిట్‌బ్యూరోలో కూడా కొద్దికాలం పనిచేశారు.[10] సెప్టెంబరు 20, 2008న, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కార్యనిర్వాహక కమిటీ తన అధ్యక్ష హోదాను రద్దు చేయడంతో థాబో బెకీ రాజీనామా చేశారు,[11] జాకబ్ జుమాపై అవినీతి అభియోగాలు మోపడంతోపాటు, నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) (జాతీయ నేరవిచారణ యంత్రాంగం)లో న్యాయమూర్తి నికోల్సన్ అనుచితంగా జోక్యం చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బెకీ అధ్యక్ష హోదాను కమిటీ రద్దు చేసింది.[citation needed]
జుమా అనేక న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొన్నారు. 2005లో ఆయనపై అత్యాచార అభియోగాలు మోపబడ్డాయి, అయితే ఈ కేసు నుంచి ఆయన నిర్దోషిగా విముక్తులయ్యారు. అంతేకాకుండా, ఆయన అక్రమ వ్యాపార కార్యకలాపాలు మరియు అవినీతి ఆరోపణలపై సుదీర్ఘ న్యాయ వివాదాల్లో పోరాడారు, తన ఆర్థిక సలహాదారు షాబీర్ షేక్ అవినీతి మరియు మోసం అభియోగాల్లో శిక్షించబడటంతో జుమా ఈ వివాదాల్లో చిక్కుకున్నారు. ఏప్రిల్ 6, 2009న, జాతీయ న్యాయవిచారణ యంత్రాంగం రాజకీయ జోక్యాన్ని చూపిస్తూ ఆయనపై అభియోగాలను ఎత్తివేయాలని నిర్ణయించింది.
విషయ సూచిక |
[మార్చు] జీవితం మరియు వృత్తి
[మార్చు] ప్రారంభ జీవితం
జుమా (ప్రస్తుతం క్వాజులు-నాటల్‌లో భాగంగా ఉన్న) జులుల్యాండ్‌లోని కాండ్లాలో జన్మించారు.[12] ఆయన తండ్రి పోలీసు, జుమా బాల్యంలోనే ఆయన మరణించారు, ఆయన తల్లి గృహ కార్మికులురాలిగా పనిచేశారు.[13] JZ ఆత్మకథ ప్రకారం, ఆయనకు సరైన పాఠశాల విద్య కూడా అందలేదు. "బాల్యం పేదరికంలో గడవడంతో, జాకబ్ జుమాకు సరైన పాఠశాల విద్య పొందలేదు." [14] జులుల్యాండ్ మరియు ఉకుంబాన్ అనే ప్రాంతంలోని (కాస్టెర్విల్లేకు సమీపంలో) డర్బన్ శివారుల మధ్య ఆయన బాల్యాన్ని గడిపారు. ఆయనకు ఒక సోదరుడు ఉన్నారు, పేరు మైకెల్.
[మార్చు] జైలు జీవితం మరియు నిషేధం
చిన్నప్పటి నుంచే జుమా రాజకీయాల్లో ఉన్నారు, 1959లో ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు. 1961లో ANCని రద్దు చేసిన తరువాత, 1962లో ఆయన ఉంఖోంటో వి సీజ్వెలో క్రియాశీల సభ్యుడిగా వ్యవహరించారు. 1963లో ఆయన సౌత్ ఆఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీ (SACP)లో చేరారు.[9] 1963లో, ప్రస్తుతం నార్త్ వెస్ట్ ప్రావీన్స్‌లో భాగంగా ఉన్న పశ్చిమ ట్రాన్స్‌వాల్‌లోని జీరస్ట్ సమీపంలో 45 మంది కొత్త సభ్యుల బృందంతో ఆయన అరెస్టయ్యారు. శ్వేతజాతి మైనారిటీల నేతృత్వంలోని జాతి వివక్ష గల ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నారనే ఆరోపణలపై ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు, నెల్సన్ మండేలాతో కలిసి రాబెన్ ద్వీపంలో ఆయన ఈ జైలు శిక్షను అనుభవించారు, ఇదే జైలులో ఇతర ప్రముఖ ANC నేతలను కూడా ఉంచారు. ఇదిలా ఉంటే ఖైదీల అసోసియేషన్ ఫుట్‌బాల్ గేమ్స్‌లో జుమా నిర్ణేత (రిఫరీ)గా వ్యవహరించారు, ఖైదీల సొంత పాలక మండలి మకానా F.A. నేతృత్వంలో ఈ ఫుట్‌బాల్ పోటీలు జరిగేవి[15]
జైలు నుంచి విడుదలైన తరువాత, ఆయన నాటల్ ప్రావీన్స్‌లోని రహస్య యంత్రాంగాలు ద్వారా ANC పునఃస్థాపన కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు.[5]
1975లో మొదటిసారి దక్షిణాఫ్రికాను విడిచిపెట్టి వెళ్లిన జుమా స్విట్జర్లాండ్‌లో థాబో బెకీని కలుసుకున్నారు, అక్కడి నుంచి మొజాంబిక్‌కు వెళ్లారు, సోవెటో తిరుగుబాటు సందర్భంగా ఇక్కడకు వచ్చిన వేలాది మంది ప్రవాసులతో కలిసి పనిచేశారు.
1977లో ఆయన ANC జాతీయ కార్యవర్గంలో సభ్యుడయ్యారు. మొజాంబిక్‌లో ఆయన ANC ఉప ప్రధాన ప్రతినిధిగా సేవలు అందించారు, మొజాంబిక్ మరియు దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు 1984లో కోమాటీ ఒప్పందంపై సంతకం చేసేవరకు జుమా ఈ బాధ్యతలు నిర్వహించారు. ఒప్పందంపై సంతకం చేసిన తరువాత, ఆయన ANC ప్రధాన ప్రతినిధిగా నియమితులయ్యారు.
1980వ దశకం మధ్యకాలంలో ఏర్పాటయిన ANC యొక్క రాజకీయ మరియు సైనిక మండలిలో కూడా ఆయన పని చేశారు, ఏప్రిల్ 1989లో SACP పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.[16]
PW బోథా నేతృత్వంలోని మొజాంబిక్ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో, జనవరి 1987లో మొజాంబిక్‌ను జుమా బలవంతంగా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆపై ఆయన జాంబియాలోని లుసాకాలో ఉన్న ANC ప్రధాన కార్యాలయానికి వెళ్లారు, అక్కడ ఆయన రహస్య యంత్రాంగాల అధిపతిగా నియమించబడ్డారు, తరువాత కొద్దికాలానికే నిఘా విభాగం అధిపతిగా నియమితులయ్యారు. అక్కడ ఆయన పదవీ కాలం ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలివుంది.[9]
[మార్చు] ప్రవాసం నుంచి తిరిగిరాక
ANCపై ఫిబ్రవరి 1990లో నిషేధం ఎత్తివేసిన తరువాత, చర్చల ప్రక్రియను ప్రారంభించేందుకు దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చిన మొదటి ANC నేతల్లో ఆయన కూడా ఒకరు.[5]
1990లో, దక్షిణ నాటల్ ప్రాంతానికి ANC ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు, ANC మరియు ఇంకాథా ఫ్రీడమ్ పార్టీ (IFP) కార్యకర్తల మధ్య ఈ ప్రాంతంలో జరుగుతున్న రాజకీయ హింసాకాండపై పోరాడటంలో కీలక పాత్ర పోషించారు. తరువాతి ఏడాది ఆయన ANC ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు, జనవరి 1994లో, జుమా క్వాజులు నాటల్ యొక్క ప్రధానమంత్రి ఎన్నికల్లో ANC అభ్యర్థిగా ప్రతిపాదించబడ్డారు.
మాంగోసుథు బోథెలెజీ నేతృత్వంలోని IFP ఈ కాలంలో జులు గర్వం మరియు రాజకీయ శక్తిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సందర్భంలో, హింసను అణిచివేయడం కోసం ANC చేపట్టిన కార్యకలాపాల్లో జుమా యొక్క జులు వారసత్వం ఆయనకు ప్రత్యేక పాత్ర కల్పించింది, ఈ ప్రాంతంలో జులు ప్రజల మద్దతు పొందేందుకు హింసాకాండ యొక్క రాజకీయ (గిరిజన మూలాలు కాకుండా) మూలాలపై ANC దృష్టి పెట్టింది.
[మార్చు] జాతీయ నాయకత్వంలో చేరిక
1977లో, పార్టీ విమోచన ఉద్యమంలో ఉన్నప్పుడే, ANC జాతీయ కార్యవర్గంలో పని చేయడం ద్వారా జాతీయ నాయకత్వంలో కూడా జుమాకు అనుభవం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు ANCకి ఆయన ముప్పై సంవత్సరాలు సేవలు అందించారు. 1994 సార్వత్రిక ఎన్నికలు తరువాత, ANC అధికార పార్టీగా అవతరించింది, అయితే క్వాజులు-నాటల్ ప్రావీన్స్‌లో IFP చేతిలో ఇది పరాజయం చవిచూసింది, ఇదిలా ఉంటే ఆయన క్వాజులు-నాటల్ ప్రావీన్స్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాలు మరియు పర్యాటక శాఖ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా (MEC) నియమించబడ్డారు, థాబో బెకీకి మార్గం సుగమం చేసేందుకు ఉపాధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకుని MEC బాధ్యతలు స్వీకరించారు. డిసెంబరు 1994లో, క్వాజులు-నాటల్ ANC విభాగ ఛైర్మన్‌గా మరియు ANC జాతీయ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు, 1996లో ఈ పదవికి ఆయన తిరిగి ఎన్నుకోబడ్డారు. డిసెంబరు 1997లో మాఫికెంగ్‌లో జరిగిన జాతీయ సమావేశంలో ఆయన ANC ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, తరువాత జూన్ 1999లో దక్షిణాఫ్రికా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఈ కాలంలో, ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెనీతో బురుండీ శాంతి ప్రక్రియను అనుకూలపరిచే వ్యక్తిగా కంపాలా, ఉగాండా దేశాల్లో ఆయన పని చేశారు. బురుండీలో శాంతి ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ప్రాంతీయ అధ్యక్షుల సమూహం 'గ్రేట్ లేక్స్ ప్రాంతీయ వేదిక'కు ముసెవెనీ నేతృత్వం వహించారు, 1993లో బురుండీలో అనేక మంది సాయుధ హుటు వర్గీయులు ఆయుధాలు చేపట్టి తుట్సి మైనారిటీ వర్గం నేతృత్వంలోని ప్రభుత్వం మరియు ఆర్మీపై ఆధిపత్యం చెలాయించారు, మెజారిటీ హుటు వర్గానికి చెందిన, ఎన్నికయిన మొదటి అధ్యక్షుడిని తుట్సీ వర్గీయులు హత్య చేశారనే ఆరోపణలతో ఈ హింసాకాండ జరిగింది.[17]
1999నాటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం యొక్క $5 బిలియన్ల ఆయుధ సేకరణ ఒప్పందానికి సంబంధించి జుమాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, జూన్ 14, 2005న ఈ అవినీతి ఆరోపణలపై అధ్యక్షుడు థాబో బెకీ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి జుమాను తొలగించారు. ఆయన స్థానంలో బులెలానీ నగుకా భార్య ఫుంజిల్ లాంబో-నగుకా దక్షిణాఫ్రికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. లాంబో-నగుకా 1999 నుంచి ఖనిజాలు మరియు ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు. వ్యాపార వర్గం ఆమె నియామకంపై హర్షం వ్యక్తం చేసింది, ఇదిలా ఉంటే అవినీతి అభియోగాలు దాఖలు చేసిన తరువాత మరియు అత్యాచార అభియోగాలు మోపడానికి ముందు మధ్యకాలంలో అనేక ANS ర్యాలీల్లో జుమా మద్దతుదారులు ఆమెను బహిరంగంగా విమర్శించారు, ఉట్రెచ్‌లో మొదటిసారి ఆమె నియామకంపై ఆయన మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.[18]
[మార్చు] ANC అధ్యక్షుడిగా ఎన్నిక
పార్టీ సంప్రదాయం ప్రకారం, బెకీ తరువాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ANC ఉపాధ్యక్షుడుగా జుమా సిద్ధమయ్యారు. అక్టోబరు మరియు నవంబరు 2007 సమావేశాల్లో పార్టీ యంత్రాంగాలు తమ నామినేషన్లను దాఖలు చేశాయి, వీటిలో జుమా ANC అధ్యక్ష బాధ్యతలకు జుమా ప్రధాన అభ్యర్థి, అదే విధంగా 2009లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయ్యేందుకు సంకేతాలు కనిపించాయి.[19][20][21] డిసెంబరు 18, 2007లో 2329 ఓట్లతో ANC అధ్యక్షుడిగా జుమా ఎన్నికయ్యారు, రెండోసారి ANC అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు థాబో బెకీకి 1505 ఓట్ల మాత్రమే వచ్చాయి. డిసెంబరు 28, 2007న, స్కార్పియన్‌లు (ప్రభుత్వ అవినీతి నిరోధక సంస్థ అధికారులు) జుమాపై అక్రమ వ్యాపార కార్యకలాపాలు, నల్లడబ్బును చెలామణీలోకి తీసుకురావడం, అవినీతి మరియు మోసం వంటి వివిధ నేరారోపణలపై హైకోర్టులో అభియోగాలు దాఖలు చేశారు.[22]
సెప్టెంబరు 2008లో, ANC దేశ అధ్యక్ష పదవి నుంచి థాబో బెకీని తొలగించింది, 2009 సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ ఉపాధ్యక్షుడు గాలెమా మోట్లాంథేను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించింది, ఈ ఎన్నికల తరువాత జుమా దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారు.[23][24] మే 6న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, మే 9, 2009న దక్షిణాఫ్రికా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.
[మార్చు] రాజకీయ-ఆర్థిక ధోరణి
జుమా ఒక ఆర్థిక ప్రజాస్వామ్య విధానాల మద్దతుదారు, ఆయన తననుతాను అప్పుడప్పుడు "సామ్యవాది" వర్ణించుకున్నారు.[25] ఆయనకు వాణిజ్య సంఘాలు మరియు సౌత్ ఆఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి మద్దతు లభించింది. మహిళలు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన యువజన సంఘాల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది.[25] ది గార్డియన్ మరియు న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆయన సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేవారు, సంపద పునఃపంపిణీని కోరే సామ్యవాదులు మరియు కమ్యూనిస్ట్‌లతో ఆయన అనుబంధం కలిగివున్నారు.[25][26] ది గార్డియన్ (UK) కూడా జుమా విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడతామని పునరుద్ఘాటించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
[మార్చు] అవినీతి అభియోగాలు
- ప్రధాన వ్యాసం: South African Arms Deal
తన ఆర్థిక సలహాదారు షాబీర్ షేక్ అవినీతి మరియు మోసం కేసుల్లో చిక్కుకుకోవడంతో ఈ అవినీతి సంబంధిత వివాదంలో జుమా కూడా కూరుకుపోయారు. ఆ సమయంలో ప్రభుత్వ నేరవిచారణ యంత్రాంగానికి జాతీయ డైరెక్టర్‌గా ఉన్న బులెలానీ నగుకా ANC చీఫ్ విప్ టోనీ యెంగెనీ మరియు జుమా ఇద్దరి కేసులను విచారించారు, వారిపై అధికార దుర్వినియోగం అభియోగాలు మోపబడ్డాయి. వివాదాస్పద ఆయుధాల ఒప్పందంపై అనుచిత ప్రభావాన్ని చూపించడం మరియు ఇటువంటి ప్రభావం ద్వారా ఆర్థిక ప్రయోజనం కోసం ప్రయత్నించడం వంటి ఆరోపణలు వారిపై మోపబడ్డాయి. యెంగెనీపై నేర నిర్ధారణ జరగ్గా, జుమాపై ఆరోపణలు కొట్టివేయబడ్డాయి, నగుకా ఈ కేసు విచారణ తరువాత"... విచారణకు ముందు అవినీతికి సంబంధించిన సాక్ష్యం ఉన్నప్పటికీ, ఈ కేసును కోర్టులో జయించడానికి ఇది సరిపోదని తీర్పు చెప్పారు".[27] అవినీతి ఆరోపణలపై ANC నుంచి విమర్శలు రావడంతో నగుకా వ్యక్తిగత కార్యకలాపాలు చూసుకునేందుకు వెళ్లిపోయారు.
2004లో, షాబీర్ షేక్ విచారణలో జుమా ఒక ప్రధాన వ్యక్తిగా ప్రస్తావించబడ్డారు. డర్బన్ వ్యాపారవేత్త మరియు ఆయన ఆర్థిక సలహాదారు షాబీర్ షేక్‌ను దక్షిణాఫ్రికా నావికా దళం కోసం వాలౌర్ తరగతి యుద్ధ నౌకల కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలతోపాటు, డర్బన్‌లో తీరం వెంబడి చేపట్టిన ప్రతిపాదిత ప్రాజెక్టు మరియు కాండ్లాలోని జుమా నివాసంపై భారీ వ్యయంపై ప్రశ్నించారు. రక్షణ రంగ వ్యాపారి థామ్సన్ CSFకు మద్దుతు ఇచ్చినందుకు జుమాకు ఆ వ్యాపారి ఏడాదికి R500 000 లంచం ఇవ్వాలని మధ్యవర్తిత్వం చేసినట్లు సూచించే వివాదాస్పద ఫ్యాక్స్ పత్రాలు కొన్ని వెలుగుచూశాయి.[28][29] జూన్ 2, 2005లో, షేక్‌పై అభియోగాలు నిరూపించబడ్డాయి, అతనికి 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు.[30]
జుమా మరియు షేక్ మధ్య జరిగిన అనేక లావాదేవీలపై న్యాయమూర్తి హిలరీ స్కుయిర్స్ దృష్టి పెట్టారు, వీటన్నింటినీ కలిపి ఒకసారి లేదా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీలు జాకబ్ జుమాకు డబ్బు చెల్లించినట్లు పరిగణించారు. స్కుయిర్స్ జుమా మరియు షేక్ మధ్య సంబంధాన్ని "ఒక సాధారణ అవినీతి సంబంధం"గా పేర్కొన్నట్లు ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయి, అయితే వాస్తవానికి ఈ వ్యాఖ్యలు కోర్టు పత్రాల్లో కనిపించలేదు.[31] ఈ వాక్యానికి కారణభూతులు తమను సమర్థించుకునేందుకు, షేక్ కేసు తీర్పు యొక్క పూర్తి సారాంశం[32][33]లో జుమా పేరు 471 సార్లు ప్రస్తావించబడింది, "అవినీతికర" లేదా "అవినీతి" పదాలు 54సార్లు ఉపయోగించారు, "అవినీతికర" పదం మరియు "జుమా" పేరు 12 వాక్యాల్లో ఉంది. ప్రసార మాధ్యమాలు తరువాత పై వాక్యానికి బదులుగా "పరస్పర ప్రయోజన సహజీవనం" అనే వాక్యాన్ని ఉపయోగించింది, దీనిని తీర్పులోని 235వ పేరాగ్రాఫ్ నుంచి తీసుకుంది: "జుమా మంచిపేరును 1997 ముందు కంటే విస్తృతంగా ఉపయోగించుకోవడం కొనసాగించడం వలన తనకు కలిగే ప్రయోజనాలు అతను గుర్తించాడనుకోవడం లోకజ్ఞానం మరియు సాధారణ మానవ ధోరణితో ఆలోచించినా తెలిసిపోతుంది; సాక్ష్యం చూపిస్తున్నట్లుగా వారి మధ్య పరస్పర ప్రయోజన సహజీవనం ఉందని, ప్రారంభ పరిస్థితులు మరియు ఈ చెల్లింపుల తరువాత కొనసాగిన సంబంధాలు, గ్రహీతలో బాధ్యత వివేకాన్ని సృష్టించగలవన్నారు."
ఆయన భవితవ్యంపై పన్నెండు రోజులపాటు తీవ్రస్థాయిలో ప్రసార మాధ్యమాల్లో జరిగిన చర్చలు తరువాత, అధ్యక్షుడు థాబో బెకీ జూన్ 14, 2005న ఆయనను దేశ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు. పార్లమెంట్ సంయుక్త సమావేశంలో బెకీ మాట్లాడుతూ, గౌరవనీయ ఉపాధ్యక్షుడి పదవి, ప్రభుత్వం, మన యువ ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, గౌరవనీయ జాకబ్ జుమాను దేశ ఉపాధ్యక్ష బాధ్యతలు మరియు క్యాబినెట్ సభ్యత్వం నుంచి విముక్తులను చేయడం మంచిందని అభిప్రాయపడ్డారు. జుమా తరువాత పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
షేక్ విచారణ తదనంతర పరిణామాల్లో, జుమాపై అధికారికంగా జాతీయ నేరవిచారణ యంత్రాంగం అవినీతి అభియోగాలు మోపింది. పీటర్‌మేరిట్జ్‌బర్గ్ హైకోర్టులో ఈ కేసును దాఖలు చేశారు, అయితే నేరవిచారణ బృందం కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ, దాఖలు చేసిన దరఖాస్తు రద్దు చేయబడింది (NPA సాక్ష్యం కోసం అవసరమైన పత్రాలను సేకరించేందుకు వీలుగా కేసు దర్యాప్తును వాయిదా వేయాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు). విచారణను వాయిదా వేయాలని కోరిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం, జుమాపై క్రిమినల్ అభియోగాలు మోపేందుకు ఉద్దేశించిన విచారణలపై శాశ్వత స్టే విధించాలని కోరుతూ ప్రతివాదులు దాఖలు చేసిన దరఖాస్తును విచారణకు స్వీకరించింది.[34]
కోర్టులో హాజరు కావాలని తాను కోరుకుంటున్నట్లు జుమా ప్రకటించినప్పటికీ, ఆయన తరపు న్యాయవాద బృందం విచారణలను జాప్యం చేయడం కొనసాగించింది, ఒక నిర్ణీత తేదీకి కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ విషయంలో, న్యాయస్థానానికి కీలకమైన సాక్ష్యం అందుబాటులో లేకుండా చేయడంలో ప్రతివాదులు విజయవంతమయ్యారు. దీంతో వాయిదా కోసం వాదుల తరపు బృందం దాఖలు చేసిన దరఖాస్తు కోర్టులో రద్దు చేయబడింది,[34] ఇదిలా ఉంటే జుమా బృందం ఆయనకు సంబంధించిన విచారణలపై శాశ్వత స్టేను పొందడంలో విఫలమయ్యారు (తద్వారా జుమాపై విచారణలు నిర్వహించేందుకు వీలు కల్పించబడింది). ఈ కారణంగా NPA తమ వాదనకు బలమైన ఆధారాల సేకరణను పూర్తి చేసిన వెంటనే, జుమాపై తిరిగి అవినీతి అభియోగాలు నమోదు చేసేందుకు మార్గం ఏర్పడింది.
నవంబరు 8, 2007న అత్యున్నత పునర్వినిచారణ న్యాయస్థానం (సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీల్) జాతీయ నేరవిచారణ యంత్రాంగం నిర్వహించిన వివిధ శోధన మరియు జప్తు కార్యకలాపాలకు అనుకూలంగా తీర్పు చెప్పడంతోపాటు, జుమా ప్రతివాద బృందం దాఖలు చేసిన నాలుగు దరఖాస్తులను తోసిపుచ్చింది. ఫ్రాన్స్ ఆయుధాల కంపెనీ సీనియర్ అధికారి యొక్క వ్యక్తిగత డైరీని జాతీయ నేరవిచారణ యంత్రాంగం సేకరించడానికి వీలు కల్పించింది, ఈ డైరీలో ఆయుధాల ఒప్పందాన్ని ఖరారు చేస్తున్న సందర్భంలో జుమాకు సంబంధించిన అవినీతి కార్యకలాపాల సమాచారం ఉండవచ్చని న్యాయస్థానం భావించింది.
డిసెంబరు 28, 2007న, స్కార్పియన్‌లు జుమాపై అక్రమ వ్యాపార కార్యకలాపాలు, నల్లడబ్బును చెలామణీలోకి తీసుకురావడం, అవినీతి మరియు మోసం వంటి వివిధ నేరాలపై హైకోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడినట్లయితే చట్టప్రకారం, జుమా దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో అడుగుపెట్టే వీలుండదు, తద్వారా దక్షిణాఫ్రికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అర్హత కూడా ఆయన కోల్పోతారు.
[మార్చు] అభియోగాలు చట్టవిరుద్ధమైనవిగా తీర్పు
జుమా ఆగస్టు 4, 2008న న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. సెప్టెంబరు 12, 2008న, పీటర్‌మేరీట్జ్‌బర్గ్ న్యాయమూర్తి క్రిస్ నికోల్సన్ విచారణ ప్రాతిపదికన జుమాపై మోపిన అవినీతి అభియోగాలు చట్టవిరుద్ధమని తీర్పు చెప్పారు, నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ("NDPP") జుమాపై అభియోగాలు మోపాలని నిర్ణయం తీసుకోకముందు ఆయన వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని (దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం దీనికి వీలు కల్పించాల్సివుంది) తీర్పు చెప్పారు, మరియు న్యాయపరమైన విచారణలు ఎదుర్కొన్నందుకు ఆయనకు అయిన వ్యయాలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.[35][36][37] జుమాపై తిరిగి అవినీతి అభియోగాలు దాఖలు చేయడంలో రాజకీయ జోక్యం పాత్ర ఉన్నట్లు తాను భావిస్తున్నానని నికోల్సన్ పేర్కొన్నారు, అయితే జుమాపై మోపిన అభియోగాలు చట్ట విరుద్ధమని నిర్ణయం తీసుకోవడానికి ఇది కారణం కాదని వివరించారు. ఈ తీర్పు జుమా యొక్క దోషిత్వం లేదా నిర్దోషిత్వానికి సంబంధించినది కాదు, అయితే ఇది కేవలం ఒక విధానపరమైన కోణమని ఉద్ఘాటించారు. వివిధ ప్రసార మాధ్యమ కథనాలు జుమాపై అభియోగాలు రద్దు చేయబడ్డాయని తప్పుగా పేర్కొన్నాయి[38][39] అయితే ఇది రద్దు చేయడం కాదు. ఈ తీర్పు తరువాత కూడా NDPP జుమాపై తిరిగి అభియోగాలు నమోదు చేయవచ్చు, అయితే, NDPP అటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఆయనకు ఒకసారి తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. తీర్పులోని 47వ పేరాగ్రాఫ్‌లో, న్యాయమూర్తి నికోల్సన్ ఈ విధంగా రాశారు,
ఆడి ఆల్టెరమ్ పార్టెమ్ (అవతలివారి వాదనను వినాలనే) నియమంలో భాగంగా ప్రతివాది వాదన వినాలనే విధాయకం ఉంది. ఒక అనుకూల ఫలితాన్ని పొందే అభిప్రాయంతో, నిర్ణయం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే నిందితుడికి వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలని దీని ప్రకారం సూచించబడింది. సాధారణంగా కేసుకు సంబంధించిన సారాంశం లేదా విషయాన్ని నిందితుడికి తెలియజేయాలి, దానికి అతను జవాబు ఇవ్వాలి.
రాజ్యాంగంలోని 179(5)(d)వ భాగంలో సూచించబడిన ఈ ప్రక్రియను NDPP పాటించడంలో విఫలమైందని, అందువలన NDPP జుమాపై తిరిగి అభియోగాలు నమోదు చేయడం చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. జుమాపై అభియోగాలు నమోదు చేసిన సమయం నుంచి (ANC అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయిన వెంటనే ఈ అభియోగాలు నమోదు చేయబడ్డాయి) వివిధ అనుమాన ప్రమాణాలను గుర్తించవచ్చని న్యాయమూర్తి నికోల్సన్ అభిప్రాయపడ్డారు, వీటిలో ఓ స్థాయి వరకు ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగం యొక్క రాజకీయ జోక్యం ఉందని పరిగణించారు. న్యాయమూర్తి నికోల్సన్ తన తీర్పు 210వ పేరాగ్రాఫ్‌లో ఈ విధంగా రాశారు,
పోలోక్వాన్‌లో అధ్యక్షుడికి రాజకీయ పరాజయం ఎదురైన తరువాత, ఎంషి డిసెంబరు 18, 2007న [జుమాపై] నేరారోపణలు చేసిన సమయం అత్యంత దౌర్భాగ్యమని పేర్కొన్నారు. దీనితోపాటు, కార్యనిర్వాహక జోక్యాన్ని వ్యతిరేకించిన మరియు బహుశా స్వతంత్రుడైన పికోలీని సస్పెండ్ చేయడం నిందితుడిపై అభియోగాల నమోదులో రాజకీయ జోక్యం నిజమనిపించేలా నాకు అనుమానాన్ని కల్పించాయి.
తీర్పులోని 220వ పేరాగ్రాఫ్‌లో న్యాయమూర్తి నికోల్సన్ ఈ విధంగా రాశారు,
దీనిలో రాజకీయ జోక్యం, ఒత్తిడి లేదా ప్రభావాన్ని సూచించే ప్రవర్తన నాకు గోచరిస్తుంది. మంత్రి మడునా నుంచి నగుకా వరకు రాజకీయ నాయకత్వంతో ఈ జోక్యం ప్రారంభమవుతుంది, దరఖాస్తుదారుడి విచారణను ఆయన తిరస్కరించినప్పుడు, తింట్ ప్రతినిధులతో ఆయన సంభాషణలు మరియు సమావేశాలు మరియు నేను ప్రస్తావించిన ఇతర విషయాలు రాజకీయ జోక్యాన్ని సూచిస్తున్నాయి. ఇచ్చిన సాక్ష్యాలు ప్రకారం న్యాయస్థానం ఈ జోక్యాన్ని నిర్ధారిస్తుంది, అసలు వాస్తవాల గురించి అసాధారణ పరిజ్ఞానం ఉన్న పార్టీ ప్రేరణకు అనుకూలంగా ఉంది. యెంగెనీ విషయంలో సూచించిన రాజకీయ జోక్యం యొక్క సూచన లేదా సలహా కంటే ఇది మరింత అతిశయకరంగా ఉంది. జాతి వివక్ష క్రమం కింద నూతన దక్షిణాఫ్రికాలో ఇటువంటి ప్రక్రియ జరగడం తీవ్ర ఆందోళనకర విషయమని అభిప్రాయపడ్డారు.[40]
ఈ కేసు విచారణకు ముందు దక్షిణాఫ్రికా న్యాయవ్యవస్థను జుమా మద్దుతుదారులు తీవ్రంగా విమర్శించారు.[41] పాల్ గోబెనీ వంటి ప్రముఖ న్యాయకోవిదులు కూడా న్యాయవ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు[42], దక్షిణాఫ్రికా న్యాయవ్యవస్థ ఆయనకు అనుకూలంగా తీర్పు వెల్లడించిన సందర్భాల్లో ఇది మూడోవది, జుమాపై తీసుకొచ్చిన అత్యాచార అభియోగాలు వీగిపోయిన సందర్భం కూడా వీటిలో ఒకటి. తరువాత NDPP వెంటనే ఈ నిర్ణయంపై పునర్విచారణను కోరనున్నట్లు ప్రకటించింది.
[మార్చు] అప్పీలుపై పునర్నియమించిన అభియోగాలు
థాబో బెకీ ఆపై పీటర్‌రీట్జ్‌బర్గ్ హైకోర్టు న్యాయమూర్తి క్రిస్ నికోల్సన్ తీర్పుపై పునర్విచారణను కోరుతూ రాజ్యాంగ న్యాయస్థానంలో ఒక వాంగ్మూలాన్ని మరియు పిటిషన్‌ను దాఖలు చేశారు:
న్యాయస్థానం అనేక పరిణామాలు గల సంకటమైన, అవమానమైన మరియు ప్రతికూలమైన నిర్ధారణలకు రావడం అసమంజసమని, జుమా విషయంలో నిర్ధారణల ప్రాతిపదికన తీర్పు చెప్పడం లేదా ఖండించడం తగదని అభిప్రాయపడ్డారు. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, నా యొక్క వినయపూర్వకమైన పిటిషన్ ఈ విషయంలో పునర్విచారణను కోరుతుంది. ఈ ప్రతికూల నిర్ధారణల ఫలితంగా నా రాజకీయ పార్టీ ANC నా పదవిని రద్దు చేసిందని పేర్కొన్నారు, గత 52 సంవత్సరాలుగా ANCకి విధేయుడనై మరియు పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఈ నిర్ణయాన్ని సమ్మతించానని చెప్పారు. దీనిపై పునర్విచారణ జరగనట్లయితే, తనకు మరిన్ని ప్రతికూల పరిణామాలు ఎదురుకావొచ్చని ఈ పిటిషన్‌లో ఆయన తెలియజేశారు.[43]
నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ ప్రతినిధి త్లాలీ త్లాలీ సెప్టెంబరు 23న ప్రిటోరియా నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ, తమకు పత్రాలు అందినట్లు చెప్పారు. ఇది పరిశీలనలో ఉందన్నారు."[44]
బ్లోయెంఫోంటైన్‌లోని సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో జనవరి 12, 2009న పునర్విచారణ పిటిషన్ విచారణకు స్వీకరించబడింది. డిప్యూటీ జడ్జ్ ప్రెసిడెంట్ లూయిస్ హార్మ్ పిటిషన్ రెండు కోణాలపై విచారణ జరిపారు. జుమాపై NPA లంచం మరియు అవినీతి అభియోగాలు నమోదు చేసే ముందు ఆయనకు వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారా లేదా అనేది మొదటి కోణం. ఆ తరువాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తాబో బెకీ ద్వారా రాజకీయ ప్రోద్బలంతో జుమాపై అభియోగాలు మోపాలని NPA నిర్ణయం తీసుకుందని న్యాయమూర్తి నికోల్సన్ ఇచ్చిన తీర్పు సరైనదేనా అనేది ఈ విచారణ యొక్క రెండో కోణం.
నిందితుడికి వివరణ ఇచ్చే అవకాశం కల్పించడంలో NPA బాధ్యతకు సంబంధించి హార్మ్స్ DP, నికోల్సన్ రాజ్యంగంలోని 179వ విభాగానికి ఇచ్చిన తప్పని, NPAకు అటువంటి బాధ్యత లేదని, జుమాపై అభియోగాలు నమోదు చేసే స్వేచ్ఛ దానికుందని పేర్కొంది. బెకీ యొక్క రాజకీయ జోక్యంపై నికోల్సన్ వివరణలకు సంబంధించిన ప్రశ్నపై, దిగువ కోర్టు తన అధికారాన్ని దాటి వ్యవహరించిందని హార్మ్స్ DP గుర్తించింది.
[మార్చు] అభియోగాలు ఎత్తివేత
ఏప్రిల్ 6, 2009న, నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) జుమాపై అన్ని కేసులను ఎత్తివేసింది, ఆయనతోపాటు నేరారోపణలు ఎదుర్కొన్న ఫ్రెంచ్ ఆయుధాల కంపెనీ తింట్‌పై కూడా కేసులు ఎత్తివేసింది, నేర విచారణలో తీవ్రమైన లోపాలు బయటపడటంతో NPA ఈ నిర్ణయం తీసుకుంది.[45] స్కార్పియన్‌ల అధిపతి లియోనార్డ్ మెక్‌కార్తీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ మాజీ జాతీయ డైరెక్టర్ బులెలానీ నగుకా మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో...జుమా రాజకీయ ప్రత్యర్థి, అధ్యక్షుడు థాబో బెకీ రాజకీయ ప్రయోజనం కోసం ఆయనపై కేసులు నమోదు చేసే సమయంలో కుట్ర జరిగినట్లు వెల్లడైంది. NPA తాత్కాలిక అధిపతి మోకోథెడి ఎప్షి ఆయనపై నమోదు చేసిన అభియోగాలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ ప్రక్రియకు కళంకం తెచ్చే రీతిలో ఈ అభియోగాల నమోదు ప్రక్రియ జరిగిందని, ఈ కారణంగానే వాటిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు, అయితే అభియోగాల ఎత్తివేతను వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు భావించరాదని స్పష్టం చేశారు.[46]
NPA యొక్క ప్రకటనకు ముందు, కనీసం రెండు రాజకీయ పార్టీలు ఈ అభియోగాల ఎత్తివేతపై సొంతగా న్యాయపరమైన చర్యలు చేపడతామని సూచించాయి.[47] డెమొక్రటిక్ అలెయన్స్ తరువాత NPA నిర్ణయంపై న్యాయ సమీక్ష పిటిషన్ దాఖలు చేసింది, కూటమి నేత హెలెన్ జిల్లె ఈ పిటిషన్‌లో ఎప్షి తన నిర్ణయాన్ని చట్ట పరిధిలో తీసుకోలేదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.[48] జూన్ 9, 2009న ఈ కేసుపై విచారణకు రంగం సిద్ధమైంది.[49] ఇదిలా ఉంటే జుమై తగిన సమయంలో తన స్పందనలు దాఖలు చేశారు, ఎప్షి ఈ కేసు విచారణ విషయంలో జాప్యం చేశారు, NPA యొక్క స్పందనను తెలియజేయడంలో రెండుసార్లు గడుపు పొడిగింపు కోరారు. NPA ప్రతినిధి ఎంతుంజీ మాగా మాట్లాడుతూ...ప్రధాన విషయాలు పరిష్కరించాల్సి ఉన్న కారణంగా తాము పత్రాలను దాఖలు చేయలేకపోతున్నామని చెప్పారు. డెమొక్రటిక్ అలెయన్స్ పార్టీ అధిపతి జిల్లె మాట్లాడుతూ జుమా స్పందన సమూలంగా తప్పని మరియు రాజ్యాంగ ప్రాతిపదికకు ఇది విరుద్ధంగా ఉందని వాదించారు.[50] న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, జూన్ 2009నాటి ఒక అధ్యయనంలో సగం మంది దక్షిణాఫ్రికా పౌరులు జాకబ్ జుమా సరిగా పనిచేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. జూన్ 2009 ద్వితీయార్ధంలో TNS రీసెర్చ్ స్టడీస్ నిర్వహించిన సర్వే జుమా ఆమోద రేటు క్రమంగా పెరుగుతుందని సూచించింది. సర్వేలో పాల్గొన్న సుమారుగా 57% మంది పౌరులు జుమాను సమర్థవంతమైన నేతగా గుర్తించారు - ఏప్రిల్ 2009లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కంటే ఆయనకు మద్దతు 3% పెరిగింది. మాజీ అధ్యక్షుడు థాబో బెకీని అధికారం నుంచి తొలగించిన కొన్ని నెలల తరువాత మరియు జుమా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, అంటే నవంబరు 2008లో కేవలం 36% మంది దక్షిణాఫ్రికా పౌరులు మాత్రమే ఆయన విషయంలో అనుకూలంగా స్పందించారు.[51]
[మార్చు] అత్యాచార అభియోగాలు
- ప్రధాన వ్యాసం: Jacob Zuma rape trial
డిసెంబరు 2005లో, జోహనెస్‌బర్గ్‌లోని ఫారెస్ట్ టౌన్‌లో ఉన్న నివాసంలో 31 ఏళ్ల మహిళపై జుమా అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. బాధితురాలు ఒక ప్రముఖ ANC కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం, మరణించిన ఒక ఉద్యమ పోరాటయోధుడి కుమార్తె ఆయన ఆమె ఎయిడ్స్ (AIDS) కార్యకర్తగా పనిచేస్తున్నారు, అంతేకాకుండా ఆమెకు HIV పాజిటివ్ కూడా ఉంది. ఈ అభియోగాలను జుమా ఖండించారు, తమ మధ్య శృంగారం ఇరువురి సమ్మతిపై జరిగిందన్నారు.
అభియోగాలు దాఖలు చేయడానికి ముందుగా, నవంబరులోనే ఆయనపై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన పుకార్లు వ్యాపించాయి, అప్పటికే జుమా యొక్క రాజకీయ జీవితం కష్టాల్లో కూరుకుపోవడం ప్రారంభమైంది. ఆయన యొక్క ఉన్నత-స్థాయి రాజకీయ మద్దతుదారుల్లో ఎక్కువ మంది అవినీతి అభియోగాలపై స్పందించినట్లుగా, ఈ కొత్త ఆరోపణలపై మాట్లాడటానికి ముందుకు రాలేదు. అత్యాచార అభియోగాలపై విచారణకు ముందుగా ఒక విచారణ సమయంలో, వేలాది మంది ఆయన మద్దతుదారులు కోర్టు బయట గుమిగూడారు, ఇదిలా ఉంటే అత్యాచార-వ్యతిరేక సంఘాలకు చెందిన అతికొద్దిమంది కార్యకర్తలు మాత్రమే అత్యాచార బాధితురాలికి మద్దతుగా నిలిచారు.[52] విచారణకు వెళ్లే ముందు, జుమా తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ లెతు ఎంషినీ వామీ (నా మెషిన్ గన్ తీసుకురండి) అని పాట పాడారు, ANC యువజన సంఘం మరియు కమ్యూనిస్ట్ పార్టీ యువజన సంఘం ప్రతినిధులు జుమాకు మద్దతుగా నిలబడ్డారు.[53]
అత్యాచార విచారణ సాగుతున్న కాలంలో, జుమా వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై మరియు SACPతో ఆయన అనుబంధంపై సౌతాఫ్రికా కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్రమైన విభేదాలు వచ్చినట్లు వార్తలు తెరపైకివచ్చాయి. పార్టీ యొక్క యువజన విభాగంలో అనేక మంది సభ్యులు జుమాకు మద్దతుగా నిలబడగా, SACPలోని ఇతరులు పాలనా విధానాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి వెనుక నిలబడటాన్ని వ్యతిరేకించారు.[54][55][56]
కొందరు మాజీ మద్దతుదారులు ఫిరాయించినప్పటికీ, అనేక మంది జుమా మద్దతుదారులు కోర్టు ప్రాంగణం బయట ఆయనకు మద్దతు ఇవ్వడం కొనసాగించారు, తమ ఐక్యత మరియు జుమా యొక్క ఫిర్యాది నైతిక బలంపై వారు నిరంతరం దాడు చేస్తున్నారని అత్యాచార వ్యతిరేక సంఘాలు ఆరోపించాయి, ఫిర్యాది యొక్క ఒక సన్నిహిత మిత్రురాలిని జుమా మద్దతుదారులు అవమానించారని, అంతేకాకుండా ఫిర్యాది అనుకొని ఒక మహిళపై రాళ్లు విసిరారని విమర్శించాయి.[57] బాధితురాలి యొక్క గత లైంగిక సంబంధాలకు సంబంధించిన సాక్ష్యాన్ని జుమా తరపు ప్రతివాద బృందం సమర్పించింది, జుమా-బాధితురాలి మధ్య జరిగిన శృంగారం ఇరువురి సమ్మతంతోనే జరిగిందని నిశ్చితంగా చెప్పింది. ఇదిలా ఉంటే వాదుల బృందం అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి ఆమె నిర్ఘాంతపోవడమే కారణమని వాదించారు, వారిరువురి మధ్య తండ్రి-కూతురి లాంటి సంబంధం ఉండేదని చెప్పారు.[58][59]
జాతీయ ఎయిడ్స్ (AIDS) మండలికి జుమా అధిపతిగా ఉండటంతో ఈ విచారణ రాజకీయ వివాదాన్ని సృష్టించింది, ప్రస్తుతం అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ HIV-పాజిటివ్ అని తెలిసినప్పటికీ, శృంగారంలో పాల్గొనే సమయంలో నేను కండోమ్ ఉపయోగించలేదని జుమా అంగీకరించడంతో ఈ వివాదం చెలరేగింది. "HIV సోకే ప్రమాదాన్ని తగ్గించేందుకు" శృంగారం తరువాత స్నానం చేశానని జుమా న్యాయస్థానంలో చెప్పారు. ఈ ప్రకటనను న్యాయమూర్తి, ఆరోగ్య నిపుణులు మరియు AIDS కార్యకర్తలు ఖండించారు. ప్రముఖ దక్షిణాఫ్రికా హాస్య పత్రిక మేడమ్ & ఈవ్ మరియు ప్రఖ్యాత రాజకీయ కార్టూనిస్ట్ జాపిరో ఈ విషయాన్ని పదేపదే పరిహాసం చేశారు. HIV అవగాహన బృందాలు స్నానం చేయడం వలన HIV సోకకుండా అడ్డుకోలేరని ఉద్ఘాటించాయి.[60]
మే 8, 2006న, అత్యాచారంలో జుమా నేరస్తుడు కాదని న్యాయస్థానం నిర్ధారించింది, ఆమెతో జరిపిన శృంగార చర్య ఇరువురి సమ్మతంతో జరిగిందనే జుమా వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. న్యాయమూర్తి వాన్ డెర్ మెర్వ్ న్యాయస్థానంలో అబద్ధం చెప్పినందుకు ఫిర్యాదిని తీవ్రంగా మందలించారు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జుమాను కూడా న్యాయమూర్తి మందలించారు.
అత్యాచార విచారణ ముగిసిన తరువాత, ఈ విచారణ ఫలితంగా వెలుగుచూసిన రాజకీయ వ్యవస్థ చీలికలు దక్షిణాప్రికా పౌరుల్లో కలవరం సృష్టించాయి. మెయిల్ అండ్ గార్డియన్ విశ్లేషణ ఒకటి ఈ పరిణామాలను సమస్యాత్మకంగా వర్ణించింది:
- అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ బహిరంగంగానే చీలిపోవడం మరియు బలహీనపడటం వలన లెక్కించలేనంత రాజకీయ నష్టం జరిగింది. దక్షిణాఫ్రికా కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ ఆఫ్ సౌతాఫ్రికన్ ట్రేడ్ యూనియన్‌లపై ఇది ఒక గొలుసు ప్రభావం చూపించింది, దేశంలో తరువాతి అధ్యక్షుడిగా తిరుగులేని మద్దతు ఇచ్చిన ఒక వ్యక్తిపై ఇటువంటి నేరారోపణలు రావడం వాటికి భంగపాటు ఎదురైంది.
- బెకీ మరియు జుమా మధ్య తీవ్రమైన అధ్యక్ష పదవి పోరు నేపథ్యంలో ఈ విచారణ జరిగింది... నేతగా అంగీకరించడంలో పార్టీ విశ్వాసం సడలడంతో, ANCలో బెకీకి మద్దతు క్షీణించింది... అయితే జుమా యొక్క సుదీర్ఘకాల మద్దతుదారులు కూడా విచారణ ఫలితాన్ని పక్కనబెట్టి, ఆయన ఇప్పుడు అధ్యక్షుడు కాలేరని భావించారు. [61]
ఏదేమైనప్పటికీ, బిజినెస్ డేకు చెందిన కరీమా బ్రౌన్ ది గార్డియన్ అనే పత్రికతో అత్యాచార కేసులో తీర్పు వెలుబడిన తరువాత మాట్లాడుతూ, జాకబ్ జుమా తిరిగి తెరపైకి వచ్చారన్నారు. ANC నాయకత్వంలో ఆయన రాక తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించింది. ఇప్పుడు జుమా లుతులీ హౌస్ (ANC ప్రధాన కార్యాలయం)కు వెళుతున్నారు. తనను తిరిగి ఉపాధ్యక్షుడిగా నిలబెట్టాలని డిమాండ్ చేస్తారు, ఇతరులకు ఆయనను నిలువరించడం కష్టమవుతుంది ... ఇది తన రాజకీయ జీవితంలో జుమాకు అతిపెద్ద విజయం అవుతుందని బ్రౌన్ చెప్పారు."[62]
జుమా అధ్యక్ష పోటీదారుగా తిరిగి రావడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించింది. యూనియన్ భవనాలు వద్ద జుమాను మరియు ఆయన మద్దతుదారులను చూసినప్పుడు కలిగే ఆందోళన ఎక్కువగా మధ్యతరగతి మరియు వ్యాపారులను దుర్బలపరుస్తుందని ఒక స్వతంత్ర విశ్లేషణ సూచించింది.[63]
[మార్చు] అవినీతి అభియోగాలు తరువాత కూడా కొనసాగిన మద్దతు
ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో జుమాకు ANC యువజన విభాగం, సౌతాఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ ఆఫ్ సౌతాఫ్రికన్ ట్రేడ్ యూనియన్స్ (COSATU)లతోపాటు ANC యొక్క వామపక్షం గణనీయమైన మద్దతు ఇచ్చాయి[citation needed]. జుమా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా, ఈ సంస్థలు ఆయనకు మద్దతుగానే నిలబడ్డాయి. దేశ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించబడిన తరువాత జుమా తనకు మద్దతు తగ్గకుండా చూసుకునేందుకు పార్టీలోని పాక్షిక-స్వతంత్ర నిర్మాణాల ప్రభావం ఉపయోగపడింది.[citation needed]
జుమా యొక్క తొలగింపు రెండు రకాలుగా వివరించబడింది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం తమలో జరిగే అవినీతిని కూడా తొలగించేందుకు కట్టుబడి ఉందనే స్పష్టమైన సంకేతాన్ని ఈ నిర్ణయం ద్వారా ప్రపంచానికి తెలియజేసిందని అనేక మంది అంతర్జాతీయ పరిశీలకులు ప్రశంసించారు. మరోవైపు, దక్షిణాఫ్రికాకు చెందిన కొందరు పరిశీలకులు, జుమా మరియు బెకీలు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయంపై దృష్టి పెట్టారు. కొందరు వామ-పక్ష మద్దతుదారులు బెకీ మరియు పార్టీలోని ఆయన యొక్క విఫణి-ప్రాధాన్య విభాగం కలిసి ANCలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు జుమాను తొలగించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు.[64]
2005లో న్యాయస్థానంలో అవినీతి-నిరోధక ఆరోపణలపై జరిగిన విచారణలకు జుమా హాజరైన ప్రతిసారి భారీసంఖ్యలో ఆయన మద్దతుదారులు అక్కడకు వచ్చారు. ఒక విచారణ సందర్భంగా, జుమా మద్దతుదారులు బెకీ బొమ్మ ఉన్న టీ-షర్టులను తగలబెట్టారు, ఈ సంఘటనను ANC ఖండించింది; జుమా మరియు అతని మిత్రపక్షాల ప్రతినిధులు తరువాత సమావేశాలకు పార్టీ క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తులు చేశారు. నవంబరులో తరువాతి విచారణ సందర్భంగా, జుమా మద్దతుదారులు ఆయనకు మద్దతుగా వేల సంఖ్యలో తరలివచ్చారు; ఆయన డర్బన్ ప్రజానీకానికి జులులో ప్రసంగించారు, పార్టీ ఐక్యతకు విజ్ఞప్తి చేయడంతోపాటు, జాతి విచక్షణ శకంలో ఉపయోగించిన ఉద్యమ పాట లెతు ఎంషినీ వామీ పాట పాడారు, ఈ పాటకు "నా మిషిన్ గన్ తీసుకురండి" అనే అర్థం వస్తుంది. ANC యువజన విభాగం కోసం జుమా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో నిర్వహించిన అక్టోబరు పర్యటనలో కూడా సమావేశాలకు భారీ సంఖ్యలో పౌరులు హాజరయ్యారు. ఆయన రాజకీయ బలం కొద్దిగా పార్టీ యొక్క అంతర్గత రాజకీయాల్లో తన సంబంధాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, జుమాపట్ల మద్దతుదారుల్లో విధేయత కూడా ఆయన రాజకీయ బలంలో ప్రధాన భాగమని ఒక విశ్లేషకుడు వాదించాడు, విధేయత మరియు పరస్పర సాయానికి సంబంధించిన జులు పద్ధతిని ఇది సూచిస్తుందన్నాడు.[65]
పార్టీ నేతల్లో ఆయనకున్న మద్దతు కారణంగా, జుమా ఒక శక్తివంతమైన రాజకీయ వ్యక్తిగా నిలిచివుండటంతోపాటు, దేశ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించబడిన తరువాత కూడా ANCలో ఉన్నత స్థానంలో కొనసాగాడు. జుమాపై తీసుకొచ్చిన అవినీతి నేరాభియోగాల్లో ఆయన నిర్దోషిగా తేలినట్లయితే, 2009 దేశాధ్యక్ష ఎన్నికల్లో మరే ఇతర ANC అభ్యర్థి ఆయనను ఓడించలేరని రాజకీయ విశ్లేషకుల కమిటీ ఒకటి నవంబరు 2005లో సూచించింది. అయితే, వాస్తవానికి జుమా మద్దతుదారులు ఆయన వామపక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ మరియు జాతీయ ఆర్థిక నిరోధాలకు రూపం ఇచ్చిన బెకీ అధ్యక్ష పాలనకు తరువాతి అధ్యక్ష పాలన భిన్నంగా ఏమీ ఉండబోదని ఈ విశ్లేషకులు పేర్కొన్నారు.[66]
[మార్చు] వ్యక్తిగత జీవితం
[మార్చు] భార్యలు
జాకబ్ జుమా ఒక బహుభార్యా ప్రియుడు, ఆయన ఐదుసార్లు వివాహం చేసుకున్నారు,[67][68] ఆయనకు 20 మంది పిల్లలు ఉన్నారు.[69][70][71]
- గెట్రుడ్ సీజాకెలె ఖుమాలో ను జుమా 1959లో కలుసుకున్నారు, 1973లో జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమెను వివాహం చేసుకున్నారు.[72] క్వాజులు-నాటల్‌లోని కాండ్లాలో ఉన్న ఆయన ఇంటిలో ఆమె నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు.
- కోసాజానా డ్లామినీ-జుమా , 1999 నుంచి క్యాబినెట్ మంత్రి, ఆమెతో ఆయన నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు, ఈ దంపతుల పిల్లల పేర్లు షోలోజీ (జననం 1982), గుకులెథు (జననం 1987), థులీ (నోకుథాలా నోమాక్వావే) (జననం 1988) మరియు థాతు (థాతుకిలే జోలిల్ నోమోండ్) (జననం 1988). జూన్ 1998లో వీరిరువురు విడాకులు తీసుకున్నారు.[73]
- కేట్ మాంట్షో , ఈమె మొజాంబిక్‌కు చెందిన వ్యక్తి, ఈమెతో ఆయన ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చారు, ఎంజోలిషి శాడీ (జననం 1980), కవలలు డుడుజైల్ మరియు డుడుజాన్ (జననం 1984), ఫుంజైల్ (జననం 1989) మరియు వుషి (జననం 1993). డిసెంబరు 8, 2000లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.[73]
- నోంపుమెలెలో ఎన్టులీ (మాన్‌టులీ), ఈమెను జుమా జనవరి 8, 2008లో వివాహం చేసుకున్నారు. 1975లో జన్మించిన ఎన్టులీ స్టాంజెర్ సమీపంలోని క్వామాఫుములో నివాసి, జుమాతో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు—వారి పేర్లు థాండిసివ్ , జననం 2002, మరియు సింకోబిల్ , జననం ఫిబ్రవరి 2006.[73]
- తోబెకా స్టాసీ మేడిబా (అసలు పేరు మాభిజా , ఇది ఆమె తల్లి పేరు), జుమా ఆమెను జనవరి 4, 2010న వివాహం చేసుకున్నారు, వీరు ఒక బిడ్డకు జన్మనిచ్చారు.[74] 2007లో జుమా తన సంతతికి లోబోలా చెల్లించారు. వారి బిడ్డ అక్టోబరు 2007లో జన్మించింది. జుమాతో వివాహానికి ముందు ఆమెకు మరో బిడ్డ ఉంది, ఆ బిడ్డ కూడా ఆమెతోనే ఉంది.[74] మాభిజా ఉమ్లాజీలో పెరిగారు, ఉమ్లాజీ కమర్షియల్ హై స్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఐథాలాలోని స్టాండర్డ్ బ్యాంక్ మరియు లా లూసియాలోని సెల్ సి మరియు SA హోమ్‌లోన్స్‌లలో ఆమె పని చేశారు.[75][76][77]
[మార్చు] పెళ్లికూతుళ్లు
- స్వాజీ రాజ కుమారి సెబెంటైల్ ద్లామినీ కోసం 2002లో 10 పశువులను లోబోలా (కన్యాశుల్కం)గా ఇచ్చారు.[78]
- గ్లోరియా బోంగెకైల్ గెమా కోసం కూడా ఆయన లోబోలా చెల్లించారు, వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.[79][80]
[మార్చు] ఇతర పిల్లలు
- న్యాయమూర్తి జెరెమియా షోంగ్వే చెల్లెలు మినాహ్ షోంగ్వేతో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు, అతని పేరు ఎడ్వర్డ్ , అక్రమ సంబంధం కారణంగా జుమాను అత్యాచార విచారణ నుంచి రక్షించాలని కోరారు.[81]
- పీటర్‌మేరిట్జ్‌బర్గ్ వ్యాపార మహిళ ప్రిసిల్లా నోన్‌క్వాలెకో ఎంలోంగోతో ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నాయి, వీరు జనవరి 18, 1998 మరియు సెప్టెంబరు 19, 2002న జన్మించారు.[82]
- ఆయనకు మరో నలుగురు బిడ్డలకు కూడా ఉన్నట్లు వార్తలు ఉన్నాయి - జోహనెస్‌బర్గ్ నగరానికి చెందిన ఒక మహిళతో ముగ్గురు బిడ్డలు మరియు రిచర్డ్స్ బేకు చెందిన మరో మహిళతో ఒకరికి జుమా జన్మనిచ్చినట్లు ఈ వార్తలు తెలియజేస్తున్నాయి.[74]
[మార్చు] 2009 'అక్రమ సంతానం'
జనవరి 2010లో, ది సండే టైమ్స్ పత్రిక ఇర్విన్ ఖోజా కుమార్తె సోనోనో ఖోజా అక్టోబరు 8, 2009న జుమా ఇరవైయ్యొవ బిడ్డకు జన్మనిచ్చినట్లు వార్తలు ప్రచురించింది, ఈ కుమార్తె పేరు థాండెకైల్ మాటినా జుమా.[69][83]
- జుమా స్పందన
- ఫిబ్రవరి 3న, జుమా దీనిపై స్పందిస్తూ, ఆ బిడ్డ తన సంతానమేనని ధ్రువీకరించారు, తాను తన పితృత్వాన్ని గుర్తిస్తూ ఇన్‌హ్లావులో చెల్లించినట్లు చెప్పారు. బిడ్డ పేరును ప్రచురించడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు, బిడ్డను ఉపయోగించుకొని అక్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం యొక్క AIDS కార్యక్రమంతో ఈ సంఘటనకు సంబంధం లేదని స్పష్టం చేశారు, గోప్యత కోసం విజ్ఞప్తి చేశారు.[84] ఫిబ్రవరి 6, తన కుటుంబానికి, ANC, కూటమికి మరియు దక్షిణాఫ్రికా పౌరులకు దీని వలన కలిగిన ఇబ్బంది తనను తీవ్రంగా విచారపరిచిందని జుమా పేర్కొన్నారు.[85]
- సోనోనో ఖోజా స్పందన
- బిడ్డ తల్లి మాట్లాడుతూ: "మీరు ఏ బిడ్డ గురించి మాట్లాడుతున్నారు? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు పాఠశాలకు వెళుతున్నారు. ఇవి వ్యక్తుల జీవితాలు. వాటి జోలికి రావొద్దని, ఆమె సోవెటాన్‌తో చెప్పారు.[86]
- అధ్యక్ష కార్యాలయ స్పందన
- అధ్యక్ష కార్యాలయం దీనిని వ్యక్తిగత విషయంగా పేర్కొంది.[87].
- ANC స్పందన
- ANC ఈ విషయంలో జుమాకు మద్దతుగా నిలిచింది, HIV/ఎయిడ్స్‌కు సంబంధించిన తమ విధానాలు మరియు జుమా వ్యక్తిగత జీవితం మధ్య ఎటువంటి సంబంధం లేవని స్పష్టం చేసింది.[88] ఫిబ్రవరి 5న, ఈ అనుభవం తమకు అనేక విలువైన పాఠాలు నేర్పిందని, వీటిని ప్రజలు కూడా విన్నారని వాఖ్యాలతో విస్తృత అసంతృప్తిని ANC గుర్తించింది.[89]
- ANC యువజన విభాగ నేత జూలియస్ మాలెమా మాట్లాడుతూ, ఇక్కడ కూర్చున్నవాళ్లందరూ ఆఫ్రికన్లు, జుమా మనకు తండ్రి, అందువలన మనకు దాని గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. మాలెమా మాట్లాడుతూ ANCYL తన యొక్క HIV కార్యక్రమంపై దృష్టి పెడుతుందని చెప్పారు, దేశవ్యాప్తంగా "ఒకే ప్రియుడు, ఒకే ప్రియురాలు" అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమానికి ఉపయోగించుకుంటుందని చెప్పారు.[90]
- ANC మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నోషిఫో డోరోథీ ట్వాంబీ మాట్లాడుతూ: "ఒక వివాహానికి కట్టుబడి ఉన్నప్పుడు, వివాహేతర సంబంధం పెట్టుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. అయితే వ్యవహారిక వివాహాల చట్టం పరిధిలో, మొదటి భార్య సమ్మతి లేకుండా, ఈ సమస్యలన్నీ ఆమెతో మాట్లాడకుండా, మనం ఏదీ చేయలేము.[91]
- ANC కూటమి భాగస్వామి COSATU ఎటువంటి అభిప్రాయం వెల్లడించలేదు, జుమా అంతరాత్మకు సంబంధించిన విషయమని చెప్పింది,[89] వావీ మరోసారి మాట్లాడుతూ జుమా విజ్ఞప్తి చేసినట్లుగా అధ్యక్షుడికి గోప్యత కల్పించాలని, బిడ్డను అసమంజసమైన ప్రచారం నుంచి రక్షించాలని పేర్కొన్నారు.
- ప్రతిపక్ష స్పందన
- డెమొక్రటిక్ అలెయన్స్ నేత హెలెన్ జిల్లె మాట్లాడుతూ AIDS తీవ్రస్థాయిలో ఉన్న దక్షిణాఫ్రికా పౌరులకు జుమా పంపిన సురక్షిత శృంగారానికి సంబంధించిన సందేశానికి ఆయనే విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.[92] ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని చెప్పడం తప్పని ఆమె పేర్కొన్నారు, ఎన్నికయిన ప్రభుత్వ అధికారులు వారు చెప్పే సిద్ధాంతాలు మరియు విలువలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.[93]
- ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీ HIV మరియు ఎయిడ్స్ బారిన ప్రజలు పడకుండా అడ్డుకునేందుకు సురక్షిత శృంగారంపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను జుమా నాశనం చేస్తున్నారని విమర్శించింది.[92]
- కాంగ్రెస్ ఆఫ్ పీపుల్ (COPE) మాట్లాడుతూ తన స్వైరప్రవర్తనను సమర్థించుకునేందుకు జుమా ఆఫ్రికా సాంస్కృతిక పద్ధతులను ఏమాత్రం ఉపయోగించుకోరాదని వ్యాఖ్యానించింది.[92]
- ఇండిపెండెంట్ డెమొక్రాట్స్ నేత పాట్రిసియా డి లిల్లీ మాట్లాడుతూ, ఈ వ్యవహారం జుమా ప్రజలను నేను చెప్పిన విధంగా చెయ్యమని, అయితే చేసే విధంగా చేయరాదని కోరుతున్నట్లుందన్నారు.[94]
[మార్చు] జుమా మరియు జింబాబ్వే
అధ్యక్షుడు జుమా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ చారిత్రాత్మకంగా ZANU-PF పార్టీతో సహజ అనుబంధం కలిగివుంది, ఈ రెండు పార్టీలు శ్వేతజాతీయుల అణిచివేత చర్యలపై జరిపిన పోరాటం నుంచి పుట్టుకొచ్చాయి. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు థాబో బెకీ ఎన్నడూ ముగాబే యొక్క విధానాలను బహిరంగంగా విమర్శించలేదు - ముగాబే నాయకత్వంపై పశ్చిమ దేశాల నుంచి కఠిన స్పందనలు వస్తున్నప్పటికీ, ఆయన "ఆర్భాట దౌత్యానికి" బదులుగా "నిశ్శబ్ద దౌత్యానికి" ప్రాధాన్యత ఇచ్చారు.[95][96] ఇదిలా ఉంటే, పార్టీ యొక్క వామపక్ష విభాగం మరియు పార్టీ-అనుబంధ సంస్థలు ANC యూత్ లీగ్, సౌతాఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ ఆఫ్ సౌతాఫ్రికన్ ట్రేడ్ యూనియన్స్ (COSATU) జింబాబ్వే విషయంలో కఠిన వైఖరిని ప్రదర్శించాయి[97][98][99]. ఈ సంస్థల నుంచే జుమా మద్దతు పొందారు.
జింబాబ్వేపై జుమా వైఖరి మిశ్రమంగా కనిపిస్తుంది. జర్మన్ మేగజైన్ డెర్ స్పీగెల్ కు 2006లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ముగాబే విషయంలో తనకు దయనీయమైన అనుబంధాలు ఉన్నాయన్నారు, ఆఫ్రికన్‌లలో ముగాబే ఒక ప్రసిద్ధ వ్యక్తి అనే విషయాన్ని ఐరాపావాసులు విస్మరిస్తున్నారన్నారు. వారి దృష్టిలో, శతాబ్దాల కాలనీ పాలన తరువాత నల్లజాతీయులకు ఆయన వారి దేశాన్ని ఇచ్చారు. జుమా చేసిన వ్యాఖ్యలు: "ప్రజలు ఆయన్ను ప్రేమిస్తున్నారు, అందువలన మనం ఆయనను ఎలా ఖండించగలం? ముగాబే విషయంలో ఐరోపా మరియు అమెరికా దేశాలు చేస్తున్న విమర్శల్లో జాతి దురహంకారపూరితమైన కోణం ఉందని అనేక మంది ఆఫ్రికన్లు భావిస్తున్నారు. అంగోలా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు రువాండాల్లో మిలియన్ల మంది నల్లజాతీయులు మరణించారు. దురదృష్టవశాత్తూ జింబాబ్వేలో కూడా అతికొద్ది మంది శ్వేతజాతీయులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు, దీనిని పశ్చిమ దేశాలు ఇప్పటికే తమకు అనుకూలంగా మార్చుకున్నాయి."[100]
ఇదిలా ఉంటే, డిసెంబరు 2007లో, ఆయన జింబాబ్వే నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, బెకీకి విరుద్ధంగా తన విధానాన్ని నిర్వచించారు:
అనేక మంది ప్రపంచ దేశాల నేతలు కోరుకుంటున్న హింసాకాండ అణిచివేత జరగకపోగా, ఇది పెరుగుతుండటం మరింత బాధాకరమైన విషయమన్నారు. చరిత్ర చివరకు నియంతలను తుదముట్టిస్తుందని, వారికి అండగా నిలిచినవారు, హింసాకాండను చూస్తూ నిలబడినవారికి కూడా పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అన్యాయాన్ని ఆశ్రయించడం మరియు ఇతరుల కష్టాన్ని విస్మరించడం ఆధునిక ప్రపంచం యొక్క అవమానకర లక్షణమని చెప్పారు.[101]
నియంతల విషయంలో కఠినంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని బెకీని ఆయన విమర్శించారు.[102]
జింబాబ్వేలో మార్చి 29, 2008న జరిగిన వివాదాస్పద ఎన్నికల తరువాత, ఆయన జింబాబ్వే ఎన్నికల ప్రక్రియలో కీలకంగా మారారు,[103] ఫలితాల వెల్లడిలో జాప్యం అనుమానాస్పదంగా ఉందని సూచించారు.[104] జూన్ 24న జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: ZANU-PFతో మేము ఏకీభవించలేము. విలువల ప్రాతిపదికన వారి విధానాలను తాము అంగీకరించలేమన్నారు. ఓటు వేసిన పౌరుల హక్కు కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామన్నారు.[105] జులైలో జరిగిన ఒక ANC విందులో, పదవి నుంచి తప్పుకునేందుకు ముగాబే నిరాకరించడంపై ఆయన నిప్పులు చెరిగారు.[106]
[మార్చు] జుమా-ప్రసార మధ్యమాలు
అత్యాచార విచారణ సందర్భంగా తనపై ప్రసార మాధ్యమాలు విస్తృతంగా ప్రచురించిన కథనాల నేపథ్యంలో, జూన్ 30, 2006న వివిధ దక్షిణాఫ్రికా ప్రసార మాధ్యమ సంస్థలపై పరువు నష్టం వ్యాజ్యాలు దాఖలు చేశారు, తన ప్రతిష్టను మంటగలిపే విధంగా ఈ సంస్థలు కార్టూన్‌లు, వ్యాఖ్యానాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్యాత్మక భాగాలను ప్రచురించినందుకు ఆయన ఈ చర్య తీసుకున్నారు. ఆయన న్యాయపరమైన చర్యలు చేపట్టిన ప్రసార మాధ్యమ సంస్థల్లో ది స్టార్ (R 20 మిలియన్ల పరువునష్టం దావా), రాపోర్ట్ (R 10 మిలియన్లు), హైవెల్డ్ స్టెరియో (R 6 మిలియన్లు), ది సిటిజెన్ (R 5 మిలియన్లు), సండే సన్ (R 5 మిలియన్లు), సండే ఇండిపెండెంట్ (R 5 మిలియన్లు) మరియు సండే వరల్డ్ (R 5 మిలియన్లు) ఉన్నాయి.
కన్జర్వేటివ్ పార్టీ మాజీ MP, న్యాయవాది జుర్గ్ ప్రిన్‌స్లోతోపాటు వైక్లిఫ్ మోథులోయ్‌లకు మీడియాకు సంబంధించిన వివాదాలను చూసే బాధ్యతలను అప్పగించారు. జుమా వ్యాఖ్యలు ప్రకారం:
- "ఐదేళ్లపాటు తమ మనుషులు ప్రసార మాధ్యమాలు మరియు ఇతర ప్రభావాత్మక మాధ్యమాల్లో వెల్లడించబడిన అన్ని రకాల ఆరోపణలు మరియు చలోక్తులపై పరిశీలిన జరిపారు, ఈ ఆరోపణల్లో నిజానిజాలేవీ నిగ్గుతేల్చకుండా ప్రచారం చేయడం జరిగిందన్నారు. తనకు వీటిపై ప్రతిస్పందన మరియు స్వీయరక్షణకు అవకాశం లేకుండా రాజ్యాంగబద్ధంగా తనకు లభించిన హక్కును కాలరాయడం జరిగిందని, జూన్ 29, 2005న ఆయన పేర్కొన్నారు.[107]
తమపై కేసులు పెట్టడంపై ప్రసారమాధ్యమాలు కూడా తీవ్రంగా స్పందించాయి, జుమా ఈ చర్యల చేపట్టడంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ కథనాలు ప్రచురించాయి, ఆయన పత్రికా స్వాతంత్ర్యాన్ని సవాలు చేస్తున్నారని ఆరోపించాయి.
ఎయిడ్స్ రాకుండా ఉండేందుకు శృంగారం తరువాత స్నానం చేశానని ప్రకటించిన జుమాపై ప్రోంటో కండోమ్‌లకు సంబంధించిన ఒక ప్రకటనలో మరింత వ్యంగ్యాత్మక అనుకరణ వచ్చింది.[108]
[మార్చు] మీడియాలో కనిపించడం
- మదర్ల్యాండ్ (చలనచిత్రం), 2009 డాక్యుమెంటరీ[109] దర్శకుడు ఒవెన్ అలిక్ షాహాద్
[మార్చు] రాజకీయ అభిప్రాయాలు
[మార్చు] స్వలింగ-వివాహాలపై వ్యాఖ్యలు
సెప్టెంబరు 24, 2006న స్టాంజెర్‌లో జరిగిన వారసత్వ దిన వేడుకలో స్వలింగ-సంపర్కుల వివాహాలను విమర్శించినందుకు జుమాపై స్వలింగ సంపర్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, ఆయన స్వలింగ-సంపర్కుల వివాహంపై మాట్లాడుతూ, దేశానికి మరియు దేవుడికి ఇటువంటి వివాహాలను అవమానంగా వ్యాఖ్యానించారు: నేను పెరుగుతున్నప్పుడు, ఉగ్గింగిలీ (స్వలింక సంపర్కుడు) తనకు ఎన్నడూ తనకు తారసపడలేదని చెప్పారు. అటువంటివారు కనిపించి ఉంటే కొట్టి ఉండేవాడినన్నారు.[110]
జాయింట్ వర్కింగ్ గ్రూపు (స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట సంస్థ) జుమా నాయకత్వ లక్షణాలను ప్రశ్నించింది, నిజమైన నేత తెలివి మరియు వివేకంతో నాయకత్వం వహించాలని - ప్రాచుర్యం లేదా ఆదరణతో కాదని సూచించింది. ఇటువంటి సంకుచిత స్వభావం గల వ్యక్తిని దేశానికి నాయకత్వం వహించే వ్యక్తిగా ఏ విధంగా భావించగలమని ప్రశ్నించింది?"[111] తన ప్రకటనతో మనస్తాపం చెందిన వ్యక్తులకు జుమా తరువాత క్షమాపణ చెప్పారు,[112] మనకు స్వాతంత్ర్యం తీసుకురావడంలో పోరాడిన అనేక మంది స్వలింగ సంపర్కులపై తనకు కూడా గౌరవం ఉందని, వారి సేవలను గుర్తిస్తానని మరియు ప్రశంసిస్తానని చెప్పారు, జాతివివక్ష లేని, పక్షపాతరహిత విజయవంతమైన దక్షిణాఫ్రికా నిర్మాణంలో వారు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
[మార్చు] పశ్చిమ సహారాపై వ్యాఖ్యలు
జూన్ 2007లో పశ్చిమ సహారాకు స్వాతంత్ర్యం లభించడంపై జుమా మద్దతు తెలపడాన్ని దక్షిణాఫ్రికాలో మొరాకో దౌత్యాధికారి హబీద్ డెఫౌడ్ విమర్శించారు.[113] 1970వ దశకం నుంచి ANC సహ్రావీ స్వాతంత్ర్య ఉద్యమం ఫ్రాంట్ పోలిసారియోకు మద్దతు ఇస్తుంది, మండేలా మరియు బెకీ పాలనలో కూడా దీనికి మద్దతు కొనసాగింది. 2004లో దక్షిణాఫ్రికా సహ్రావీ అరబ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ లేదా SADRను ఒక చట్టబద్ధమైన ప్రవాస-ప్రభుత్వంగా గుర్తించింది.
[మార్చు] కౌమార దశలో గర్భధారణపై వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికా కౌమార దశ బాలల్లో గర్భధారణను నిరోధించేందుకు జుమా సూచించిన పరిష్కారం వారి బిడ్డలను ఆధీనంలోకి తీసుకొని, తల్లులను కళాశాలకు పంపించాలని, వారికి బలవంతంగానైనా డిగ్రీలు వచ్చేలా చేయాలన్నారు.[114][115]
[మార్చు] క్రీస్తు ద్వితీయాగమనంపై వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికాను ఏసుక్రీస్తు తిరిగి వచ్చే వరకు ANC పాలిస్తుందని జుమా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి, పాలనలో తమ పార్టీ కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నారన్నారు, ఈ వ్యాఖ్యలపై మత మరియు లౌకిక సమూహాలు నుంచి జుమాను మందలించాయి:
తమ పార్టీ ప్రారంభమైనప్పుడు పాస్టర్‌ల దీవెనలు లభించాయని, ఈ దీవెనలు పొందిన ఒకేఒక్క సంస్థ తమదే కాబట్టి, దేవుడు తమ పాలనను కోరుకుంటున్నాడని చెప్పారు. స్వర్గంలో కూడా తమ పార్టీ దీవెనలు అందుకుంది. అందువలన ఏసుక్రీస్తు తిరిగి వచ్చే వరకు మేము ఈ దేశాన్ని పాలిస్తామన్నారు. మనం దేశాన్ని పాలిస్తున్నప్పుడు, మన నగరాన్ని పాలించేందుకు మరెవరినీ అనుమతించరాదని పేర్కొన్నారు.[116][117]
జుమా తరువాత తన వ్యాఖ్యలను రాజకీయ వ్యాఖ్యలుగా సమర్థించుకున్నారు: ఏసుక్రీస్తు గురించి మాట్లాడటం, ఆయనను అవమానించడం కాదని; వాస్తవానికి చారిత్రాత్మకంగా ANC గురించి తాను మాట్లాడానని చెప్పారు. ఇవి కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే, తాము బలంగా ఉన్నామని, సుదీర్ఘకాలం తాము ఇటువంటి బలమైన స్థితిలోనే ఉంటామని తన వ్యాఖ్యల సారాంశమన్నారు. ఇతరులకు ఎవరికైనా ఈ వ్యాఖ్యలు అసౌకర్యాన్ని కలిగించినట్లయితే, వారికి క్షమాపణలు చెబుతానన్నారు.[118] నేను కూడా బాప్టిజం స్వీకరించానని, ఏసుక్రీస్తు గురించి తెలుసన్నారు: నాకు దేవుడంటే భయం ఉంది [.... ]ఈ వ్యాఖ్యలు దేవుడిని తృణీకరించేవి కాదన్నారు."[118]
[మార్చు] ఆఫ్రికానెర్‌లపై వ్యాఖ్యలు
NPA తనపై అవినీతి కేసు ఎత్తివేసిన కొద్దికాలానికే, జుమా మరో వివాదంలో చిక్కుకున్నారు, జోహనెస్‌బర్గ్‌లోని శాండ్‌టన్‌లో ఉన్న హిల్టన్ హోటల్ వద్ద జుమా ఆఫ్రికాన్స్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారు (ఎన్నికల ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు)
దక్షిణాఫ్రికాలోని అన్ని శ్వేతజాతి సమూహాల కంటే ఆఫ్రికానెర్‌లు మాత్రమే నిజమైన దక్షిణాఫ్రికా పౌరులని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ రోజు వరకు, వారెన్నడూ రెండు పాస్‌పోర్టులు కలిగిలేను: వారి వద్ద ఒకే పాస్‌పోర్ట్ ఉందని వ్యాఖ్యానించారు. వారు ఇక్కడ ఉండేందుకే ఉన్నారు.[118]
జాతి వివక్షపై మాట్లాడుతూ, జుమా వ్యంగ్యాత్మకంగా నిరసనలకు ఆఫ్రికానెర్ విన్నూత్న పద్ధతిని ప్రశంసించారు, ఇది ప్రత్యేక అభివృద్ధి అనే పదాలతో దాని యొక్క నేరాలను దాచిపెట్టిందన్నారు. పోలీసుల అవినీతి విషయంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, క్రిమినల్ అయిన ఒక వ్యక్తి చేతుల్లో దేశం భారాన్ని పెట్టరాదనన్నారు."[118]
[మార్చు] వివాదం
[మార్చు] షేక్ యొక్క పెరోలు
మార్చి 2009లో, పదిహేనేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న షాబీర్ షేక్ 28 నెలలు తరువాత జైలు నుండి విడుదలయ్యాడు. ఆయనకు మెడికల్ పెరోల్ ఇచ్చారు, ప్రాణాంతక రోగం సోకినప్పుడు మాత్రమే ఔదార్యంతో ఇచ్చేందుకు ఇటువంటి పెరోల్ ఉద్దేశించబడింది, ఆస్పత్రి నుంచి విడుదల చేసేందుకు ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు సూచించినప్పటికీ ఆయనకు ఇటువంటి పెరోల్ మంజూరు చేయడం వివాదాస్పదమైంది.
ఈ పరిణామంలో జుమా పాత్ర ఉందని ప్రసార మాధ్యమాలు ఊహాగానాలు వెల్లడించాయి, అయితే ANC అధ్యక్ష ప్రతినిధి ఈ పుకార్లను ఖండించారు. అయితే కొన్ని రోజుల ముందు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జుమా బహిరంగంగా మాట్లాడుతూ తాను షేక్ విడుదలకు వ్యక్తిగతంగా ప్రయత్నిస్తానని చెప్పారు.[119]
[మార్చు] ప్రధాన న్యాయమూర్తిగా నకోబో నామినేషన్
ఆగస్టు 6, 2009న, జుమా శాండిల్ నకోబోను దక్షిణాఫ్రికా ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిపాదించారు,[120] దీనిపై నాలుగు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.[121] అక్టోబరు 1, 2009న, ఈ నియామకం ధ్రువీకరించబడింది. డెమొక్రటిక్ అలెయన్స్, కాంగ్రెస్ ఆఫ్ ది పీపుల్, ఇకాథా ఫ్రీడమ్ పార్టీ మరియు ఇండిపెండెంట్ డెమొక్రాట్స్ పార్టీలు దీనిపై మాట్లాడుతూ, నకోబో పేరును ప్రతిపాదించే ముందు సరైన సంప్రదింపులు జరపలేదని విమర్శించాయి. ప్రస్తుత ఉప ప్రధాన న్యాయమూర్తి డిక్‌గ్యాంగ్ మోసెనెక్ ఈ పదవికి తగిన వ్యక్తి అని, ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు తిరిగి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రతిపక్షం జుమాకు విజ్ఞప్తి చేసింది.[122]
[మార్చు] దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆస్తుల వెల్లడిలో వైఫల్యం
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 60 రోజుల్లోగా తన ఆస్తుల వివరాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే మార్చి 2010నాటికి కూడా ఆయన ఆస్తులను ప్రకటించలేదు, అప్పటికి ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి తొమ్మిది నెలల సమయం గడిచింది. ప్రతిపక్ష పార్టీలు మరియు ANC కూటమి భాగస్వామి COSATU జుమా ఆస్తులు ప్రకటించాలని డిమాండ్‌లు వచ్చాయి [1]. జుమా విషయాన్ని ప్రత్యేక సందర్భంగా పరిగణించాలని ANC ప్రతినిధి బ్రియాన్ సోకోటు విజ్ఞప్తి చేశారు, పెద్ద కుటుంబం ఉండటంతో తన ఆస్తులను ప్రకటించడంలో జాప్యం జరిగిందని వివరించారు. ఈ ప్రకటన నుంచి తరువాత ANC కూడా దూరంగా ఉంది [2]. [3] తరువాత జుమా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
[మార్చు] రక్షక భటులపై వేధింపుల ఆరోపణలు
2010లో జుమా రక్షక భటులు కొందరు ప్రభుత్వ సేవకులు మరియు జర్నలిస్ట్‌లతో వివాదాస్పద విషయాల్లో చిక్కుకున్నారు. జుమా యొక్క రక్షక భటులతో అసహ్యంగా ప్రవర్తించినందుకు ఫిబ్రవరిలో, కేప్‌టౌన్ విద్యార్థి చుమానీ మాక్స్‌వెల్‌ను పోలీసులు నిర్బంధించారు. మాక్స్‌వెల్ ఒక క్రియాశీల ANC సభ్యుడు [4], 24 గంటల తరువాత అతని విడుదలయ్యాడు, పోలీసులకు ఒక రాతపూర్వక క్షమాపణ రాసిన తరువాత అతడిని విడుదల చేశారు, అతను తరువాత దీనిపై మాట్లాడుతూ...తన చేత బలవంతంగా క్షమాపణ లేఖ రాయించారని చెప్పాడు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బంది తన ఇంటిపై దాడి చేశారని, తుపాకీతో బెదిరించి తనను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పాడు. మాక్స్‌వెల్ తరువాత పోలీసులపై న్యాయపరమైన చర్యలు చేపట్టాడు [5], అతని తరపున హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు కూడా ఒక ఫిర్యాదు దాఖలు చేయబడింది[6]. పార్లమెంట్ సమావేశాల్లో ఈ వివాదం వాడివేడి చర్చనీయాంశం అయింది [7].
మార్చిలో, జుమా కాన్వాయ్‌ను ఫోటోలు తీసిన జర్నలిస్ట్ షెపో లెసోల్ చేత బలవంతంగా ఆ ఫోటోలను పోలీసులు అతని కెమేరా నుంచి తొలగించారు, జుమాను జోహనెస్‌బర్గ్ నివాసంలో ఫోటోలు తీసినందుకు ఇద్దరు ఫోటోగ్రాఫర్‌లను పోలీసులు నిర్బంధించారు [8]. స్కై న్యూస్ విలేకరి ఎమ్మా హర్డ్ తరువాత మాట్లాడుతూ, తనను అక్కడి నుంచి గెంటివేశారని, జుమా రక్షక భటులు 2009 [9]న తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు.
[మార్చు] వీటిని కూడా చూడండి
మూస:Portal box మూస:Commonscat-inline
- షబీర్ షేక్ విచారణ
[మార్చు] మరింత చదవడానికి
- అలెక్ రసెల్ (2009), ఆఫ్టర్ మండేలా: ది బ్యాటిల్ ఫర్ ది సోల్ ఆఫ్ సౌతాఫ్రికా , హచిసన్.
[మార్చు] సూచనలు
- ↑ Berger, Sebastien. "ANC's Jacob Zuma to marry for fifth time", The Daily Telegraph, 2009-01-05. Retrieved on 2010-05-05.
- ↑ "SA's Zuma marries his third wife", BBC News, 2010-01-04. Retrieved on 2010-05-05.
- ↑ http://www.iol.co.za/index.php?set_id=1&click_id=6&art_id=vn20070506095935384C518838
- ↑ "Zuma sworn in as SA's fourth democratic President", SABC, 2009-05-09. Retrieved on 2009-05-09.
- ↑ 5.0 5.1 5.2 Jacob Gedleyihlekisa Zuma. The Presidency. తీసుకొన్న తేదీ: 2007-12-11.
- ↑ Mbuyazi, Nondumiso. "JZ receives 'death threat'", The Star, 2008-09-13, p. 4. Retrieved on 2008-09-14.
- ↑ Gordin, Jeremy. "So what are Msholozi's options?", Sunday Tribune, 2008-08-31. Retrieved on 2008-09-14.
- ↑ Lander, Alice. "Durban basks in Zuma's ANC victory", BBC News, 2007-12-19. Retrieved on 2008-09-14.
- ↑ 9.0 9.1 9.2 Beresford, David. "Zuma's missing years come to light", The Times, 22 February 2009.
- ↑ Gevisser, Mark (2007). Thabo Mbeki: The Dream Deferred.
- ↑ "SA's Mbeki says he will step down", BBC news, 2008-09-20. Retrieved on 2008-09-21.
- ↑ గార్డిన్, జే: జుమా, ఎ బయోగ్రఫీ , పేజీ 1. జోనాథన్ బాల్, 2008.
- ↑ గోర్డిన్, జే: జుమా, ఎ బయోగ్రఫీ , పేజీ 4. జోనాథన్ బాల్, 2008.
- ↑ జుమాస్ బయోగ్రఫీ ఆన్ ANC వెబ్‌సైట్, యాక్సెస్డ్ ఆన్ 30 మే 2009, స్టేట్స్ దట్ జుమా రిసీవ్డ్ నో ఫార్మల్ స్కూలింగ్.
- ↑ Fifa gives Zuma his ref's certificate. SouthAfrica.info (2009-06-30). తీసుకొన్న తేదీ: 2009-11-03.
- ↑ Trewhela, Paul (15 February 2009). Jacob Zuma in exile: three unexplored issues.
- ↑ "Tutsis boycott Burundi talks", BBC, 27 July 2004.
- ↑ How a lone cameraman 'dented' SABC's credibility. Mail & Guardian (2005-08-19). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ ANC ర్యాంక్-అండ్-పైల్ వోట్ ఫర్ చేంజ్ IOL
- ↑ జుమా ఫైండ్స్ ఫావర్ ఎమాంగ్ హిజ్ ANC కామ్రేడ్స్ IOL
- ↑ జుమా సేస్ హి ఈజ్ రెడీ టు గవర్న్ IOL
- ↑ "New charges for S Africa's Zuma", BBC News, 2007-12-28.
- ↑ afriquenligne.fr, సౌతాఫ్రికా: బెకీస్ రిజిగ్నేషన్ ఎఫెక్టివ్ థర్స్‌డే
- ↑ news.bbc.co.uk, మోట్లాంథే: సౌతాఫ్రికాస్ సేఫ్ హ్యాండ్స్
- ↑ 25.0 25.1 25.2 "South Africa in turmoil as Mbeki heads for defeat", The Guardian, 15 December 2007.
- ↑ Wines, Michael. "Leadership Battle Grips South Africa's Dominant Party", The New York Times, 17 December 2007.
- ↑ "Ngcuka accused of 'derailing justice'", 24 August 2003. Retrieved on 2009-04-07.
- ↑ Encrypted Fax. తీసుకొన్న తేదీ: 2009-05-12.
- ↑ Fowler, Andrew. "Jacob Zuma", ABC News, 7 April 2009.
- ↑ Shaik sentenced to 15 years in prison. SABC news (2005-08-06). తీసుకొన్న తేదీ: 2008-09-04.
- ↑ Berger, Guy (2006-11-22). Suckers for the sound bite. Mail & Guardian Online. తీసుకొన్న తేదీ: 2006-11-22.
- ↑ Shaik Judgment in full (PDF).
- ↑ Shaik Judgment in full (HTML).
- ↑ 34.0 34.1 Zuma corruption trial struck off the roll. SABC news (2006-09-20). తీసుకొన్న తేదీ: 2006-09-20.
- ↑ reuters.com, S. ఆఫ్రికన్ జడ్జ్ డిస్మిసెస్ జుమా కరప్షన్ కేస్
- ↑ news.bbc.co.uk, SA కోర్ట్ రిజెక్ట్స్ జుమా గ్రాఫ్ట్ కేస్
- ↑ సౌతాఫ్రికన్ కోర్ట్ క్లియర్స్ వే ఫర్ జుమా ప్రెసిడెన్షియల్ రన్
- ↑ Template error: argument title is required.
- ↑ Burgis, Tom. "Court clears Zuma to run for president", Financial Times, 12 September 2008.
- ↑ Full Zuma judgment. News24 (13 September 2008).
- ↑ "'Judges think they're descendants of God'", 6 September 2008.
- ↑ STATE-Versus-JACOB GEDLEYIHLEKISA ZUMA - A LITIGATION COOKBOOK.
- ↑ afp.google.com, బెకీ ఛాలెంజెస్ కోర్ట్ రూలింగ్ టు డిఫెండ్ రిప్యుటేషన్
- ↑ bloomberg.com, సౌతాఫ్రికాస్ బెకీ ప్లాన్స్ టు ఛాలెంజ్ ఇంప్రాపర్ కోర్ట్ రూలింగ్
- ↑ గోర్డిన్, జెరేమీ. "జాకబ్ జుమా: జెరేమీ గార్డియన్ ఎనాలసిస్." డిస్పాచ్ నౌ 24/7 8 ఏప్రిల్ 2009
- ↑ "Mpshe: Zuma decision not an acquittal", Mail & Guardian, 6 April 2009.
- ↑ Du Plessis, Carien. "Is NPA entitled to drop Zuma charges?", Cape Times, 2 April 2009.
- ↑ DA files for judicial review.
- ↑ The Spy Who Saved Zuma.
- ↑ http://www.iol.co.za/index.php?set_id=1&click_id=6&art_id=nw20090930151035182C289179
- ↑ http://www.ewn.co.za/articleprog.aspx?id=20017
- ↑ "Zuma rape case judge stands down", BBC News, 2006-02-13. Retrieved on 2007-12-20.
- ↑ Zuma judge recuses himself from trial. Mail & Guardian (2006-02-13). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ The trouble with JZ. Mail & Guardian (2007-12-20). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ Young communists plan move against Mazibuko Jara. Mail & Guardian (2007-12-20). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ SACP divided on Zuma. Mail & Guardian (2007-12-20). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ Accuser insulted as Zuma hailed at court. IOL (2006-02-14). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ "Zuma's rape accuser questioned", BBC News, 2007-03-06. Retrieved on 2007-12-20.
- ↑ S. African denies rape allegation at trial. The Boston Globe (2006-04-03). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ "SA's Zuma showered to avoid HIV", BBC Online, 2006-04-05. Retrieved on 2007-12-20.
- ↑ 23 days that shook our world. Mail & Guardian (2006-04-28). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ Meldrum, Andrew. "Acquitted Zuma ready to fight for presidency", The Guardian, 2006-05-09. Retrieved on 2010-05-05.
- ↑ ANC moves to allay succession paranoia. IOL (2006-06-01). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ "Analysis: SA's Zuma in the dock", BBC News, 2005-10-10. Retrieved on 2007-12-20.
- ↑ Riding on Zulu empathy. Mail & Guardian (2005-11-18). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ Acquitted Zuma will be 'unbeatable'. Mail & Guardian (2005-11-03). తీసుకొన్న తేదీ: 2009-04-07.
- ↑ జుమా ఛార్మ్‌డ్ వైవ్స్ అండ్ నేషన్ ది ఆస్ట్రేలియన్
- ↑ జుమా టు వెడ్ ఆన్ శాటర్‌డే M&G
- ↑ 69.0 69.1 Govender, Prega. "Zuma fathers baby with Irvin Khoza's daughter", The Sunday Times (South Africa), 2010-01-31. Retrieved on 31 January 2010.
- ↑ జాకబ్ గెడ్లెయిహ్లెకిసా జుమా thepresidency.gov.za
- ↑ New storm about Zuma's 'virility'. IOL (2007-07-17). తీసుకొన్న తేదీ: 2007-12-20.
- ↑ http://blogs.thetimes.co.za/khumalo/2008/01/07/i-am-able-to-fight-my-own-battles/
- ↑ 73.0 73.1 73.2 Molele, Charles. "So who will the Zuma First Lady be?", The Times, 15 December 2007.
- ↑ 74.0 74.1 74.2 ఆల్ ది ప్రెసిడెంట్స్ చిల్డ్రన్ M&G
- ↑ "Zuma's ladies", The Post, 23 December 2007.
- ↑ Khumalo, Sipho. "Zuma's bride-to-be 'a glamorous beauty'", IOL, 9 January 2009.
- ↑ సౌతాఫ్రికా ప్రెసిడెంట్ జాకబ్ జుమా టు మ్యారీ థర్డ్ వైఫ్ BBC
- ↑ జుమాస్ ఫియాన్సీ హాస్పిటలైజ్డ్ News24
- ↑ జుమా మే టేక్ ఫిఫ్త్ వైఫ్ News24
- ↑ జుమాస్ ఫిప్త్ మ్యారేజ్ టు టేక్ ప్లేస్ వన్ ఆఫ్ దీజ్ డేస్' M&G
- ↑ జుమా గెట్స్ మ్యారీడ్ ఇన్ క్వాజులు-నాటల్ M&G
- ↑ నౌ జుమాస్ KZN లవ్ కిడ్స్ రివీల్డ్ IOL
- ↑ జుమా అండ్ కోజా ఆర్ "మ్యారీడ్' IOL
- ↑ జుమా కన్‌ఫైర్మ్స్ లవ్-ఛైల్డ్ IOL
- ↑ జుమా 'డీప్లీ రీగ్రెట్స్' లవ్-ఛైల్డ్ పెయిన్ M&G
- ↑ కోజాస్ డాటర్ స్పీక్స్ అవుట్ IOL
- ↑ జుమా లవ్-ఛైల్డ్: నో కామెంట్ News24
- ↑ ANC డిఫెండ్స్ జాకబ్ జుమా ఓవర్ 'లవ్-ఛైల్డ్' క్లయిమ్స్ BBC
- ↑ 89.0 89.1 JZ బ్రోక్ సెక్స్ పాక్ట్ IOL
- ↑ లవ్-ఛైల్డ్ టాక్ 'డిస్‌రస్పెక్ట్‌ఫుల్' News24
- ↑ SA హాజ్ 'రైట్ టు నో ఎబౌట్ లవ్-ఛైల్డ్' News24
- ↑ 92.0 92.1 92.2 జుమా ఫ్లౌట్స్ సేఫ్ సెక్స్ క్యాంపైన్, సేస్ COPE IOL
- ↑ జుమా షుడ్ అపాలజైజ్, సేస్ జిల్లీ M&G
- ↑ జుమా సెక్స్ రిపోర్ట్ 'ఎ పీఆర్ నైట్‌మేర్' IOL
- ↑ "Mbeki defends 'quiet diplomacy' on Zim", Financial Gazette, 21 November 2003.
- ↑ Lodge, Tom. "Quiet diplomacy in Zimbabwe: a case study of South Africa in Africa" (PDF), Paper delivered to the African Studies Centre, Leiden, 27 October 2004, p. 7. Retrieved on 2008-07-14.
- ↑ http://www.laborrights.org/end-violence-against-trade-unions/zimbabwe/1597
- ↑ http://www.news24.com/News24/Africa/Zimbabwe/0,,2-11-1662_1624610,00.html
- ↑ http://www.zwtube.com/view_video.php?viewkey=5a96a7da4d1105d584dd
- ↑ "The West Is Bent out of Shape", Der Spiegel, 20 December 2006. Retrieved on 2008-07-14.
- ↑ "Zuma blasts Mbeki's Zimbabwe quiet diplomacy", Zimbabwe Metro, 16 December 2007. Retrieved on 18 December 2007.
- ↑ మైకెల్ వైన్స్, "లీడర్‌షిప్ బ్యాటిల్ గ్రిప్స్ సౌతాఫ్రికాస్ డామినెంట్ పార్టీ," "ది న్యూయార్క్ టైమ్స్," 17 డిసెంబర్ 2007 http://www.nytimes.com/2007/12/17/world/africa/17anc.html
- ↑ "Zuma condemns Zimbabwe poll delay", BBC Online, 9 April 2008. Retrieved on 2008-07-14.
- ↑ "ZIMBABWE: Mugabe is losing the region's support", IRIN (UN Office for the Coordination of Humanitarian Affairs), 11 April 2008. Retrieved on 2008-07-14.
- ↑ "Zuma: Zimbabwe is out of control", Mail & Guardian Online, 24 June 2008. Retrieved on 2008-07-14.
- ↑ "Mugabe has overstayed welcome, Zuma", The Zimbabwe Times, 9 July 2008. Retrieved on 2008-07-14.
- ↑ ఫ్రెండ్స్ ఆఫ్ జాకబ్ జుమా ట్రస్ట్
- ↑ Flashplayer ad for Pronto Condoms.
- ↑ మదర్లాండ్ జాకబ్ జుమా ఎట్ IMDB
- ↑ "PROFILE: Jacob Zuma", The Sunday Times, 23 December 2007. Retrieved on 2009-04-07.
- ↑ "Zuma earns wrath of gays and lesbians", Mail & Guardian, 2006-09-26. Retrieved on 2006-09-26.
- ↑ "Zuma Apologises", Gay South Africa Lifestyle, 2006-09-28. Retrieved on 2006-10-02.
- ↑ సౌతాఫ్రికా: మొరాకన్ ఎన్వే స్కాథింగ్ ఆన్ జుమాస్ సహారా రిమార్క్స్, బట్ గెట్స్ నో అపాలజీ, 26 జూన్ 2007. ఆల్‌ఆఫ్రికా.
- ↑ కోటెడ్ ఇన్ "జాకబ్ జుమా, బోర్డింగ్ స్కూల్స్, అండ్ అవర్ టీచర్స్", మైనక్ మేటర్స్ ఎట్ ది టైమ్స్ , 24 నవంబర్ 2008.
- ↑ "క్లూలెస్ హు టు వోట్ ఫర్? డు ఎ పార్టీ పాలసీ మ్యాచ్", IOL , 8 ఏప్రిల్ 2009.
- ↑ డెమొక్రటిక్ అలెయన్స్: "జాకబ్ జుమా, జీసెస్, అండ్ రాబర్ట్ ముగాబే" (పాలిటిక్స్‌వెబ్ , 30 జూన్ 2008).
- ↑ ఎకుమెనికల్ న్యూస్ ఇంటర్నేషనల్: "సౌతాఫ్రికన్ రో ఓవర్ లింకింగ్ ఆఫ్ ANC లీడర్ టు జీసెస్" (7 డిసెంబరు 2008).
- ↑ 118.0 118.1 118.2 118.3 Jenni O'Grady and Natasha Marrian. "Zuma: 'It's only the Afrikaners who are truly South African'"", Mail & Guardian, 3 April 2009.
- ↑ బీరాక్, బ్యారీ. "వెయిటింగ్ టు హెల్మ్ సౌతాఫ్రికా: ప్రెసిడెంట్ టు కన్విక్ట్? ఆర్ బోత్?" న్యూయార్క్ టైమ్స్. 10 మార్చి 2009. (సేకరణ తేదీ ఏప్రిల్ 22, 2009).
- ↑ "Zuma looks to Ngcobo as new chief justice", Mail & Guardian, 6 August 2009. Retrieved on 10 August 2009.
- ↑ "Zuma abused his power: opposition", The Times, 10 August 2009. Retrieved on 10 August 2009.
- ↑ http://www.timeslive.co.za/news/article134121.ece
[మార్చు] బాహ్య లింకులు
| జాకబ్ జుమా
]]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జాకబ్ జుమా పేజీ
- ANC బయోగ్రఫీ
- ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఎగైనెస్ట్ షాబీర్ షేక్, జుమాస్ ఫైనాన్షియల్ అడ్వైజర్
| ముందు Thabo Mbeki |
Deputy President of South Africa 1999–2005 |
తరువాత Phumzile Mlambo-Ngcuka |
| ముందు Kgalema Motlanthe |
President of South Africa 2009–present |
|
| ముందు Thabo Mbeki |
President of the African National Congress 2007–present |
| Jacob Zuma |
|
మూస:SAPresidents మూస:ANCpresidents మూస:SAVices మూస:Current G20 Leaders మూస:SecondMbeki మూస:Jacob Zuma cabinet 1 |
- All articles with unsourced statements
- Articles with unsourced statements from May 2010
- Articles with invalid date parameter in template
- Articles with unsourced statements from April 2009
- 1942 జననాలు
- జాతి వివక్ష వ్యతిరేక కార్యకర్తలు
- ప్రస్తుత జాతీయ నేతలు
- దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షులు
- రోబెన్ ద్వీప కారాగార వాసులు
- నైట్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బాత్
- జీవించి ఉన్నవారు
- ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు
- సౌతాఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు
- క్వాజులు-నాటల్‌కు చెందిన వ్యక్తులు
- బహుభార్యాత్వం
- దక్షిణాఫ్రికా అధ్యక్షులు
- ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు
- దక్షిణాఫ్రికా కార్యకర్తలు
- దక్షిణాఫ్రికా క్రిస్టియన్లు
- దక్షిణాప్రికా కమ్యూనిస్ట్‌లు
- దక్షిణాఫ్రికా పౌరులు
- దక్షిణాఫ్రికా రాజకీయ నాయకులు
- దక్షిణాఫ్రికా తిరుగుబాట్లు
- దక్షిణాఫ్రికా సామ్యవాదులు
- దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష అణిచివేత బాధితులు
- జులు పౌరులు