జాతీయ వైద్య కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ వైద్య కమిషన్
సంకేతాక్షరంఎన్‌ఎంసి)
ముందువారుభారత వైద్య మండలి
స్థాపన25 సెప్టెంబర్ 2020
కేంద్రీకరణవైద్య విద్య, వృత్తి నియంత్రణ
ప్రధాన
కార్యాలయాలు
న్యూఢిల్లీ
చైర్‌పర్సన్‌డా. సురేష్ చంద్ర శర్మ
ప్రధానభాగంకమిషన్
అనుబంధ సంస్థలుకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
జాలగూడుhttps://www.nmc.org.in/

జాతీయ వైద్య కమిషన్ దేశంలో వైద్య విద్య, వృత్తి యొక్క అత్యున్నత నియంత్రకం కోసం ఏర్పాటైన కమిషన్. జాతీయ వైద్య కమిషన్ బిల్లు - 2019ను పార్లమెంట్ ఆమోదించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ఏర్పాటు చేయడంతో ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ యాక్ట్ -1956 ప్రకారం ఏర్పాటైన ఎంసీఐ దాదాపు ఏడు దశాబ్దాల పాటు పనిచేసి రద్దయ్యింది. యూజీ, పీజీ విద్య, సంబంధిత వైద్య సంస్థల సమీక్ష, ప్రమాణాలు, అభ్యాసకుల రిజిస్ట్రేషన్ ను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు రాష్ట్రపతి 2019 ఆగస్టు 9న ఆమోదం తెలిపాడు.[1]

బోర్డ్లు[మార్చు]

ఎన్‌ఎంసీ పరిధిలో వైద్యవిద్యను నియంత్రించేందుకు మొత్తం నాలుగు బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[2]

  1. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు
  2. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు
  3. మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌
  4. బోర్డు ఆఫ్‌ ఎథిక్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌

ఈ బోర్డులన్నీ స్వయంప్రతిపత్తి సంస్థలుగా వ్యవహరిస్తాయి.

  • మెడికల్‌ అసెస్‌మెంట్‌, ఎథిక్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డుల్లో ఒక్కో దాంట్లో అధ్యక్షుడితో పాటు ఎనిమిది మంది సభ్యులుంటారు.
  • దేశంలో వైద్యవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ బోర్డులు క్రియాశీలకంగా పనిచేస్తాయి.

సభ్యులు[మార్చు]

జాతీయ వైద్య కమిషన్ ఛైర్మన్‌గా డాక్టర్ సురేష్ చంద్ర శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్ల పాటు ఛైర్మన్‌గా విధులు నిర్వహించనున్నాడు.[3] జాతీయ వైద్య కమిషన్‌లో కార్యదర్శి, ఛైర్మన్‌తో పాటు, 10 మంది ఎక్స్‌-అఫిషియో సభ్యులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన 22 మంది పార్ట్‌టైమ్‌ సభ్యులు ఉంటారు.

మూలాలు[మార్చు]

  1. Suryaa (9 August 2019). "జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
  2. "THE NATIONAL MEDICAL COMMISSION BILL, 2019" (PDF). 29 July 2019. Archived from the original (PDF) on 20 సెప్టెంబర్ 2021. Retrieved 9 May 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. ANI News (25 September 2020). "National Medical Commission takes charge, Medical Council of India abolished" (in ఇంగ్లీష్). Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.