జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010 (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏక్ట్ 2010) ను భారతదేశ అధ్యక్షురాలు 2010 వ సంవత్సరం జూన్ 2 వతేదీన ఆమోదించారు. ఈ చట్ట ప్రకారం జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం యేర్పాటు చేసేందుకు వీలవుతుంది. శీఘ్రగతిన పరిష్కరించేందుకు యేర్పాటు చేసిన కోర్టు పర్యావరణ సంబంధిత ప్రజావ్యాజ్యాలను త్వరగా పరిష్కరిస్తుంది.

ఈ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ (న్యాయ స్థానం) భోపాల్ లో యేర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక న్యాయ స్ధానంతో సంధానం చేయబడి 4 సర్క్యూట్ న్యాయ స్థానాలు ఉంటాయి. ఈ కోర్టు జల, వాయు, కాలుష్యాలపై గల పర్యావరణ రక్షణ, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్య చట్టాలు వంటి అన్ని పర్యావరణ చట్టాలననుసరించి తీర్పును ఇస్తుంది. ఈ ట్రిబ్యునల్ కు సభ్యులను ఒక కమిటీ ఎంపిక చేస్తుంది. ఒక జాతీయ పర్యావరణ రక్షణ సంస్థను కూడా ఈ విషయమై త్వరలో యేర్పాటు చేయనున్నారు. ఆ సంస్థ పర్యావరణ చట్టాల అమలును పర్యవేక్షిస్తుంది.

ఈ కృషి ఫలితంగా, భారత దేశం ఆ స్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సరసన చేరుతుంది. ఆ దేశాలలో కూడా ప్రత్యేక పర్యావరణ కోర్టులు (ట్రిబ్యునళ్ళు) ఉన్నాయి.

జాతీయ జల విధానం - 2002[మార్చు]

జాతీయ నీటి వనరుల సంఘం ( National water resources council) జాతీయ జల విధానం - 2002 ( National water policy – 2002) ఏప్రిల్ లో ఏర్పరచింది. ఈ సంఘం, నీటి వనరుల నిర్వహణకు సంబంధించిన వివిధ రకాల సమస్యల గురించి చర్చిస్తుంది. Nwp, జల వనరుల సమర్థవంతమైన నిర్వహణ, దీర్ఘకాలిక అభివృద్ధి గురించి ఎక్కువ ప్రాముఖ్యత నిస్తుంది.

జాతీయ జల విధానం యొక్క ముఖ్యమైన అంశాలు[మార్చు]

జలం, ఒక ప్రధానమైన ప్రకృతి వనరు, మనిషి కనీస అవసరం. ఒక విలువైన జాతీయ ఆస్తి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, నీటి వనరుల ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణ జరగాలి. నీటికి సంబంధించిన జాతీయ, రాష్ట్రస్థాయి వివరాలను, బాగా అభివృద్ధి పరచబడిన సమాచార వ్యవస్థ యొక్క విషయ విధులు, విషయ సూచికలతో అనుసంధానించబడి ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, అప్పటికే ఉన్న కేంద్ర, రాష్ట్రస్థాయి సంస్థలను సమగ్రంగా శక్తి మంతం చేయాలి. దేశంలో అందుబాటులో ఉన్న జల వనరులను, అత్యధిక స్థాయి ఉపయోగించగల వనరుగా వర్గీకరించాలి. సంప్రదాయ బద్ధం కాని పద్ధతులైన నీటి వినియోగం, ఉదాహరణకు ఒక నీటి లోయ నుండి వేరొక చోటకు నీటి బదిలాలు, భూగర్భజలాలను కృత్రిమంగా నింపుట, సముద్రజలాలను లేక చవిటి నేలల జలాలను శుద్ధి చేసి ఉపయోగించడం వంటేవే కాకుండా, సంప్రదాయ పద్ధతులలో నీటి సంరక్షణ, ఉదాహరణకు, వాన నీటి సేకరణ, ఇంటి పై కప్పులపై పడే వాన నీటి సంగ్రహణ వంటి పద్ధతుల ద్వారా నీటి వనరులను పెంపొందించాలి. ఈ విభాగానికి సంబంధించి, అధ్యయనం, అభివృద్ధిని ఏకాగ్ర దృష్టితో ప్రోత్సహించడం, ఇటువంటి విధానాలకు అవసరం. జల ధర్మశాస్త్రాన్ని ఏర్పరచడానికి అనువుగా, జల వనరుల అభివృద్ధి, నిర్వహణ పధకాన్ని రచించాలి. తగినన్ని నదీ లోయ సంస్థలను ఏర్పరచి, నదీ లోయ ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, నిర్వహణ చేయాలి. 1.నీటికొరత ఉన్న ప్రదేశాలకు, నీటి అందుబాటులోనికి తీసుకుని రావాలి. ఆ ప్రాంతాలు, లోయల అవసరాల కనుణంగా ఒక నదీ లోయ ప్రాంతం నుండి యింకొక ప్రాంతానికి నీటిని సరఫరా చేయవచ్చు. 2. నీటి వనరుల అభివృద్ధి పధకాలను ప్రణాళిక చేయడంలో, మానవుల, పర్యావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని, అంతేకాకుండ సంఘంలోని అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన, అనేక విభాగాల తోడ్పాటుతో బహూళార్థ సాధకంగా ఉండాలి. 3.నీటిని కేటాయించడంలో, త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత నిచ్చి ఆ తరువాత వరుసగా సాగు నీరు, జల విద్యుత్, పర్యావరణం, గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధం లేని పరిశ్రమలు, జల మార్గాలు, యితర ప్రయోజనాలకు కేటాయించాలి. 4.భూగర్భ జలాలను వాడుకోవడం, వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవడం సమాజానికి మేలు కలిగించే విధంగా క్రమ బద్ధీ కరించాలి. భూగర్భ జలాలకు పరిమితికి మించి వాడుకోవడం వలన ఏర్పడే పర్యావరణ అనర్థాలను సమర్థవంతంగా నివారించాలి. 5.నిర్మాణ, పునారావాస కార్యక్రమాలు ఒకే సమయంలో, సమర్థవంతంగా చేయడానికి సరియైన ప్రణాళిక అవసరం. ఒక స్థూలమైన జాతీయపధకం, వలస స్థావరాలు, పునరావాస అవసరాలకు సంబంధించి ఏర్పాటు చేయాలి. అందువలన ఈ నీటి ప్రాజెక్టుల (కట్టడాలు) వలన బాధితులైన ప్రజలు పునారావాస సౌకర్యాలను దీని ద్వారా పొందుతారు. 6.భౌతికమైన, ఆర్థికపరమైన నిలకడ కొరకు ప్రస్తుతం ఉన్న జలవనరుల సౌకర్యాలకు తగినంత ప్రాధాన్యతనివ్వాలి. నీటికి విలువ, అది ఉపయోగించే వివిధ రకాల విధానాలను బట్టి నిర్ణయించి, మొదట కనీసం నిర్వహణ ఖర్చు వచ్చేటట్లు, క్రమంగా తరువాత, పెట్టుబడి ఖర్చులు వచ్చేటట్టు చూసుకోవాలి. 7.వివిధ ప్రయోజనాల కొరకు ఉపయోగించే జలవనరుల నిర్వహణలో, వినియోగదారులు, యితర లబ్ధిదారులు, వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి ఒక సమర్థవంతమైన, నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాలి. 8.నీటి వనరుల పధకాలను వివిధ రకాలుగా ఉపయోగించే ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వీలైనంతగా ప్రోత్సహించాలి. 9.ఉపరిత, జలాలు, భూగర్భ జలాలు, ప్రమాణాలకై నిరంతర పర్యవేక్షణలో ఉండాలి. వ్యర్థ పదార్థాలు అంగీకరింప దగిన స్థాయిలో, కొన్ని ప్రమామాలతో శుద్ధి చేయబడి, సహజమైన నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా, నిరంతరం ప్రవపించే జలాలలో, తప్పని సరిగా కొంతైనా ప్రవాహం ఉండేటట్లు చూడాలి. 10.నీటికి సంబంధించిన వివిధ ప్రయోజనాలలో సమర్థవంతమైన వాడకాన్ని అభివృద్ధి పరచాలి. నీటి సంరక్షణా స్పృహను, విద్యచట్టం, ప్రోత్సాహాకాలు, శిక్షల ద్వారా ప్రోత్సహించాలి. 11.ప్రతీ వరద రాగలిగే ప్రాంతానికి, వరద నివారణ, నిర్వహణ కొరకై ఒక దృఢమైన ప్రణాళికను ఏర్పరచాలి. 12.సముద్రం వలన గాని లేక నది వలన గాని భూమి కోతకు గురికావడాన్ని తక్కువ చేసేందుకు, ఖర్చు తక్కువ అయ్యే పద్ధతులను పాటించాలి. సముద్రతీర ప్రాంతాలలో, ముంపుకు గురికాని ప్రాంతాలలో విచ్చల విడిగా ఆక్రమించి వ్యాపారాలను చేయడాన్ని చట్టప్రకారం నిరోధించాలి. 13.కరువు పీడిత ప్రాంతాల అవసరాలకు, నీటి వనరుల అభివృద్ధి ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ప్రాంతా నష్టాన్ని తగ్గించే విధంగా వివిధ పనులను చేపట్టాలి. 14.రాష్ట్రాల మధ్య జల పంపకాలు, జలకేటాయింపులు, ఒక జాతీయ విధానాన్ని అనుసరించి చేయాలి. ఇదంతా కూడా జలవనరుల అందుబాటు, నదీలోయ అవసరాలపై ఆధారపడి చేయాలి. 15.జల వనరుల సమగ్రాభివృద్ధితో శిక్షణ, పరిశోధనా ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.

జాతీయ జల పధకం, తన కార్యసిద్ధి మొత్తం, ఒక జాతీయ అభిప్రాయం, నిబద్ధతను ఏర్పరచడం, పాటించడంలో, తన లక్ష్యాలు, నియమాలను సాధించడంలో, రాష్ట్ర జల విధానం తోడ్పాటుతో ఒక కార్యచరణ విధానాన్ని నిర్దేశించుకోవాలని తెలుసుకుంది. ఇందులో, యిప్పటి వరకు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర జలవిధానాన్ని పాటిస్తున్నాయి. భారతదేశ ప్రభుత్వం, జాతీయ జలపధక లక్ష్యాలను సాధించడంలో, సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని రాష్ట్రాలకు అందజేస్తూ, వాటి ప్రయత్నాలకు అదనపు ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది. వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ పధకం

వాతావరణ మార్పు జాతీయ కార్యాచరణ పధకం, లాంఛనంగా 2008 జూన్ 30 న ప్రారంభింపబడింది NAPCC, అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉండడమే కాకుండ. వాతావరణ మార్పుల గురించి సమర్థవంతంగా పనిచేసి ఫలితాలను రాబడుతుంది. జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎనిమిది అతి ముఖ్యమైన “జాతీయ సంఘాలు” ఉన్నాయి. ఆ సంఘాలు వాతావరణ మార్పుల అవగాహన పై దృష్టి సారించి, వాటి అనుకూలతతీవ్రత, క్షీణత, శక్తి సామర్థ్యం, ప్రకృతి వనరుల పరిరక్షణ గురించి అధ్యయనం చేస్తాయి.

ఆ ఎనిమిది సంఘాలు :[మార్చు]

జాతీయ సౌరశక్తి సంఘం
శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచే సంఘం
ఆసరాగా ఉండే నివాసస్థలాలపై జాతీయ సంఘం
జాతీయ జల సంఘం
హిమాలయ పర్యావరణ పరిరక్షణకై జాతీయ సంఘం
హరిత భారతదేశం కొరకు జాతీయ సంఘం
వ్యవసాయ బలోపేతం కొరకు జాతీయ సంఘం
వాతావరణ మార్పులపై వ్యుహాత్మకమైన అవగాహన కొరకు జాతీయ సంఘం

జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం - 2006[మార్చు]

జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం ఇప్పటికీ ఉన్న విధానాల మీద ఆధారపడి నిర్మింపబడింది. (ఉదాహరణకు జాతీయ అరణ్య కార్యాచరణ విధానం 1988; జాతీయ పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి కార్యాచరణ పద్ధతి వివరణ 1992; జాతీయ వ్యవమాయ విధానం 2000; కాలుష్య నివారణ కార్యాచరణ పద్ధతి 1992 జాతీయ జనాభా గురించి పథకాలు, 2000; జాతీయ జల పధకం 2002 మొదలైనవి.
ఈ విధానం, కార్యాచరణకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది, క్రమబద్ధీకరించడంలో సంస్కరణలు ఉపయోగించడానికి పర్యావరణ పరిరక్షణ కొరకు పథకాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర, రాష్ర, స్థానిక ప్రభూత్వాలు ఏర్పరచే చట్టాలు నిర్మించడానికి, సమీక్షీంచడానికి ఉపయోగపడుతుంది.
ఈ పథకం యొక్క ప్రధాన విషయం, ఏమిటంటే, ప్రజరందరి సంక్షేమం, జీవనోపాధి ప్రకృతి వనరుల నుండి లభించినప్పటికీ, వారు మరింత మేలైన జీవనోపాధికి, పర్యావరణం పరిరక్షించుకుని ప్రకృతి వనరులను భద్రంగా కాపాడుకోవాలి అంతేకాని పర్యావరణ నాశనానికి కారకులు కాకుడదు. అని తెలియచెబుతుంది.
ఈ విధానం, వివిధ రకాలైన వ్యక్తుల భాగస్వామ్యం (స్టేక్ హోల్డర్స్ - stake – holders) పర్యావరణ పరిరక్షణలో ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వ సంస్థలు, స్ధానిక సంఘాలు, విద్యా, శాస్త్ర పరిశోధనా సంస్థలు, పెట్టుబడి సంస్థలు, అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాములు, వారి వారి వనరులు, శక్తులనూ బట్టి పర్యావరణ నిర్వాహణను ఉత్తేజ పరుస్తారు.

వనరులు[మార్చు]

http://te.pragatipedia.in/rural-energy/policy-support/environment#section-1[permanent dead link]