జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్

వికీపీడియా నుండి
జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్

J.J.R. Macleod ca. 1928
Born సెప్టెంబరు 6 1876(1876-09-06)
Clunie, Perthshire, స్కాట్లాండ్
Died మార్చి 16, 1935(1935-03-16) (వయసు 58)
Aberdeen, స్కాట్లాండ్
Citizenship యునైటెడ్ కింగ్డమ్
జాతీయత Scottish
Fields వైద్యశాస్త్రం
విద్యాసంస్థలు Case Western Reserve University
Alma mater University of Aberdeen
ప్రసిద్ధి ఇన్సులిన్
Notable awards నోబెల్ బహుమతి (1923)

జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్ (ఆంగ్లం: John James Rickard Macleod) FRS[1] (6 సెప్టెంబర్ 1876 – 16 మార్చి 1935) స్కాట్లాండ్ కు చెందిన వైద్యుడు. ఇతనికి మధుమేహంలో కీలకపాత్ర పోషించే ఇన్సులిన్ కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతిని పంచుకున్నాడు.[2][3]

జీవితసంగ్రహం [మార్చు]

మెక్లియాడ్ దంపతుల సమాధి.

మెక్లియాడ్ స్కాట్లాండ్ లో రాబర్ట్ మెక్లియాడ్ దంపతులకు జన్మించాడు. ఇతడు 1898 లో ఎబర్డీన్ విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రంలో పట్టాపొందారు. తర్వాత లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేశారు. 1899 లో ఫిజియాలజీలో బోధకునిగా లండన్ హాస్పిటల్ వైద్య పాఠశాలలో చేరి 1902 లో లెక్చరర్ గా పదవీ వున్నతి పొందారు. తర్వాత ఫిజియాలజీ శాఖ ప్రొఫెసర్ గా కేస్ వెస్టర్న్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో 1903లో చేరారు. టొరాంటో విశ్వవిద్యాలయంలో 1918 లో ప్రొఫెసర్ గా ఎన్నికకాబడ్డాడు. 1928 లో తిరిగి ఎబర్డీన్ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చి మరణానంతం వరకు అక్కడే పనిచేశారు.

మెక్లియాడ్ ప్రధానంగా కార్బోహైడ్రేట్ల జీవక్రియ మీద పనిచేశాడు. ఇతడు ఫ్రెడెరిక్ బాంటింగ్ మరియు చార్లెస్ బెస్ట్ తో కలిసి ఇన్సులిన్ ను కనుగొన్నారు. ఆ కాలంలో మధుమేహానికి ఇదొక్కటే వైద్యం. ఇందుకు గాను బాంటింగ్ మరియు మెక్లియాడ్లకు సంయుక్తంగా 1923లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. కొందరు ఈ ఆవిష్కరణలో మెక్లియాడ్ పాత్ర ఏమీ లేదని విమర్శించారు. ఈ పరిశోధనలో పాంక్రియాస్ ఇంజెక్షన్ ను పాంక్రియాస్ తొలగించబడిన కుక్కలను ఇవ్వాలని మెక్లియాడ్ ఇచ్చిన ప్రతిపాదన కీలకమైనది.

మెక్లియాడ్ సుమారు 11 పుస్తకాలు రచించాడు:

  1. Recent Advances in Physiology (1905)
  2. Diabetes: its Pathological Physiology (1925)
  3. Carbohydrate Metabolism and Insulin (1926).

టొరంటో విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం ఇతని జ్ఞాపకార్ధం నామకరణం చేయబడినది.

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది