జీవితచక్రం

వికీపీడియా నుండి
(జీవిత చక్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జీవిత చక్రం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్. రావు
నిర్మాణం పి. గంగాధరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ,
శారద
సంగీతం శంకర్ జైకిషన్
నిర్మాణ సంస్థ నవశక్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాత్రలు:పాత్రధారులు

[మార్చు]
  • రాజా: రామారావు
  • సుశీల: వాణిశ్రీ
  • కమల: శారద

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

ఉన్నత కుటుంటంలో పుట్టిన రాజా, అమెరికాలో చదువు పూర్తిచేసుకుని తిరిగివస్తాడు. వ్యాపారాలు చూసుకోమన్న తండ్రి ఆజ్ఞను కొంతకాలం జీవితాన్ని ఆనందిస్తానంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు. రాజా తన మేనత్త ఇంటికి వెళ్ళి అక్కడి వారందరినీ పలకరించి తనేమీమారలేదని వారిని ఆశ్యర్యపరుస్తాడు. రాజా, మేనత్త కూతురు కమల తమ చిన్ననాటి అల్లర్లుతో సందడిగా ఉంటారు. ఓ పేద కుటుంబం పెద్ద కూతురు సుశీల సంపాదనపైనే ఆధారపడి జీవిస్తుంటుంది. తండ్రి (రమణారెడ్డి) తన సరదాలకోసం, అన్న (పద్మనాభం) లాటరీ వ్యసనం కోసం సుశీల నెలజీతం కోసమే ఎదురుచూస్తూఉంటారు. సుశీల అమ్మగారు జబ్బు మనిషి. పరిస్థితిని అర్థంచేసుకుని మిగతా అవసరాలకే ప్రాధాన్యతనిచ్చి, తన మందులను కొనకుండా వాయిదా వేయిస్తుంది. సుశీల చెల్లెలు కాలేజీకి వెళ్తూ తన ముస్తాబులకై అక్కని డబ్బు అడుగుతూంటుంది. వీరందరినీ సంభాళిస్తుా సుశీల నెట్టుకొస్తుంటుంది. ఇంకా ఉంది.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు - గుండెల్లో గుండె కలిపి చూడు ఆరుద్ర శంకర్ - జైకిషన్ ఘంటసాల శారద
కంటిచూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగమనసులో మాట ఓ పిల్లా ఆరుద్ర శంకర్ - జైకిషన్ ఘంటసాల
మధురాతి మధురం, మన ప్రేమ మధువు, మదీ నిండలేదూ - తమీ తీరలేదు ఆరుద్ర శంకర్ - జైకిషన్ ఘంటసాల శారద
సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా లోకాన పన్నీరు జల్లేవులే నీకేమో కన్నీ మిగిలిందిలే ఆరుద్ర శంకర్ - జైకిషన్ ఘంటసాల
  • బతకమ్మ బతకమ్మ ఉయ్యాల - సుశీల, బి. వసంత బృందం
  • సువ్విసువ్వి సువ్విసువ్వి చూడే ఓలమ్మి - ఎస్.పి. బాలు, సుశీల

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.