జే.ఆర్. పుష్పరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జే.ఆర్. పుష్పరాజ్

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1989
ముందు టి. అమృతరావు
తరువాత తిరువాయిపాటి వెంకయ్య
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు జి.ఎం.ఎన్.వి. ప్రసాద్
తరువాత డొక్కా మాణిక్యవరప్రసాద్
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌
పదవీ కాలం
2017 ఆగస్టు 7 – 2021 జూన్ 1

వ్యక్తిగత వివరాలు

జననం 1960
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

జువ్విగుంట్ల రత్న పుష్పరాజ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తాడికొండ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యునిగా గెలిచాడు.[1] అతను 2017లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

పుష్పరాజ్‌ 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యునిగా శాసనసభకు ఎన్నికయ్యాడు.[3] ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికై[4] నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో క్రీడా శాఖా మంత్రిగా పని చేశాడు. అతను 1989లో ఎన్నికల్లో ఓడిపోయి[5] 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి శాసనసభ్యునిగా ఎన్నికై నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేశాడు.[6] పుష్పరాజ్‌ 2017 ఆగస్టు 7[7] నుండి 2021 జూన్ 1 వరకు రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌గా పని చేశాడు.[8][9]

మరణం[మార్చు]

జే.ఆర్. పుష్పరాజ్ అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 జులై 28న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[10][11]

మూలాలు[మార్చు]

  1. Sakshi (1 April 2019). "తాడికొండలో పాగా ఎవరిదో..?". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  2. Andhra Jyothy (24 September 2017). "రాజధాని జిల్లా నేతలకు పెద్ద పీట వేసిన టీడీపీ". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2020-07-19. Retrieved 2022-06-07.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-07.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2022-06-19. Retrieved 2022-06-07.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2022-06-07.
  7. Andhra Jyothy (8 August 2017). "అందరికీ ఆహార భద్రతే లక్ష్యం". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  8. Nava Telangana (19 July 2017). "ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ నియామకం". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  9. Andhra Jyothy (1 June 2021). "ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌గా ముగిసిన పుష్పరాజ్‌ పదవీకాలం" (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  10. Eenadu (29 July 2022). "మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.
  11. Andhra Jyothy (29 July 2022). "మాజీ మంత్రి పుష్పరాజ్‌ కన్నుమూత" (in ఇంగ్లీష్). Retrieved 29 July 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)