టి.ఆర్. జెలియాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.ఆర్. జెలియాంగ్
టి.ఆర్. జెలియాంగ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మార్చ్ 2023
గవర్నరు లా గణేశన్
ముందు ఐ.కె. సెమా (1989)

పదవీ కాలం
19 జులై 2017 – 8 మార్చి 2018
గవర్నరు పద్మనాభ ఆచార్య
ముందు షుర్హోజెలీ లీజీట్సు
తరువాత నెయిఫియు రియో
పదవీ కాలం
24 మే 2014 – 20 ఫిబ్రవరి 2017
గవర్నరు
  • అశ్వని కుమార్
  • క్రిషన్ కాంత్ పాల్
  • పద్మనాభ ఆచార్య
ముందు నెయిఫియు రియో
తరువాత షుర్హోజెలీ లీజీట్సు

నాగాలాండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
15 మార్చి 2018 – 7 మే 2022
తరువాత ఖాళీ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008
ముందు వత్సు మేరు
నియోజకవర్గం పెరెన్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-02-21) 1952 ఫిబ్రవరి 21 (వయసు 72)
మ్బౌపుంగ్వా, అస్సాం , భారతదేశం (ప్రస్తుతం నాగాలాండ్ , భారతదేశం )
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు నాగా పీపుల్స్ ఫ్రంట్
జీవిత భాగస్వామి కెవిజేనువో రంగ్‌కౌ
నివాసం రంగకౌ మాన్షన్, దిమాపూర్, నాగాలాండ్

తాడితుయ్ రంగ్‌కౌ జెలియాంగ్ (జననం 1952 ఫిబ్రవరి 21) నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు టెన్నింగ్ & పెరెన్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2017 నుండి 2018 వరకు 10వ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేసి[1] ప్రస్తుతం నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

జెలియాంగ్ 1982 & 1987 నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో టెన్నింగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత 1989 ఎన్నికలలో నాగా పీపుల్స్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1993, 1998, 2003లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు టెన్నింగ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. జెలియాంగ్ 1989 నుండి 90 వరకు రాష్ట్ర సమాచార, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా, 1994 నుండి 1998 వరకు సహాయ & పునరావాస శాఖ సహాయ మంత్రిగా, 1998 నుండి 2003 వరకు పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు. అయన 2003లో నాగాలాండ్ కాంగ్రెస్‌ని స్థాపించి ఆ తరువాత దానిని నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) లో విలీనం చేసి 2004 నుండి 2008 వరకు నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికై తిరిగి 2008లో రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వచ్చి నెయిఫియు రియో ​​మంత్రివర్గంలో ప్లానింగ్, జియాలజీ & మైనింగ్, పశుసంవర్ధక & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు.

నాగాలాండ్ ముఖ్యమంత్రి[మార్చు]

జెలియాంగ్ 2014 మే నుండి 2017 ఫిబ్రవరి వరకు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా[2], 2017 జూలై నుండి 2018 మార్చి వరకు రెండు పర్యాయాలు నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు[3]. ఆయన ఆ తరువాత నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు శాసనసభాపక్ష నేతగా, 2022 నుండి నాగాలాండ్ ప్రభుత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (నాగాలాండ్) చైర్మన్ నియమితుడయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. BusinessLine (24 May 2014). "T R Zeliang sworn in as Nagaland CM" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023. {{cite news}}: |last1= has generic name (help)
  2. The Hindu (24 May 2014). "Zeliang sworn in as Nagaland CM" (in Indian English). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. The Hindu (19 July 2017). "Zeliang appointed Nagaland Chief Minister" (in Indian English). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.