Jump to content

తమ్మలి

వికీపీడియా నుండి

తమ్మలి : అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, వెనుకబడిన తరగతులలో డి - గ్రూపునకు చెందిన ఒక శాఖ. తమ్మలి వారు శివాలయాల్లో శివుడికి అర్చనలు అభిషేకములు శివకళ్యాణములు నిర్వహిస్తూ ఉండేటువంటి ఆదిశైవ బ్రాహ్మణులు. వీరి స్వశాఖ ----శైవాగమ శాస్త్రం. వీరు ముందుగా స్మశాఖను అధ్యయనం

చరిత్ర - సామాజిక జీవనం

[మార్చు]

వారు దేవాలయాలలో స్వార్థ, పరార్థ పూజలనువేదపారాయణరదారులుగా కారం కొనసాగించేవా.వీరు ఈ శాఖ వారు తమిళనాడు నుంచి వలస పోయి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతములలో శివాలయాలలో అర్చకత్వం చేస్తూ స్థిర పడటం చేత ........తమిళనాడు నుంచి వచ్చారు కావున తమిళ అయ్యంగార్లు అనే నామధేయంతో ఉంటూ కాలక్రమములో తమ్మలి వారుగా పిలవబడ్డారు. రు. కర్షణాది ప్రతిష్ఠాంతము, ప్రతిష్ఠాది ఉత్సవాం తము, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతము... వంటి పూజాకలాపాలను నిర్వహించేవారు. శివార్చకులని, వివద్విజులని, స్థాపకులని, శివాచార్యులని, దీక్షితులని, తమ్మళులని కూడా అంటారు. పూర్వం తమిళప్రాంతం నుంచి వలస వచ్చిన `తమ్మళి' కులస్థులు తెలుగు నేలపై స్థిరపడ్డారు. కనుకనే వీరిని తమ్మళులు, తంబళులు అని పిలిచేవారు. కాలక్రమేణా వీరు తమ్మళిలు అయ్యారు. శివుని ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదనేది వీరి భావన. ఇప్పటి తరంలోని తమ్మళివారిని చూపించి వీరు తమిళ ప్రాంతపు వారంటే ఎవ్వరూ నమ్మరు కూడా. వీరి కట్టూ బొట్టూ, ఆచార వ్యవహారాలు, మాట్లాడే తీరు... అన్నీ తెలుగుదనమే..

వృత్తి

[మార్చు]

దేవాలయాలలో పూజలు అదేవిధంగా వైదిక స్మార్త పూజలు అర్చకులుగా గ్రామ పురోహితులు

రిజర్వేషన్లు - ఉద్యమాలు

[మార్చు]

వైష్ణవ ఆలయాల్లోని అర్చకులు కూడా తమ్మలి వారికిచ్చిన రిజర్వేషన్‌ తమకూ వర్తింప చేయాలని కోర్టుకు వెళ్ళారు. పైగా తెలంగాణ ప్రాంతం మినహా మిగతా ప్రాంతా లలో తమ్మలి కులస్థులు లేరని అన్నారు. ఇందుకు ప్రభుత్వం స్పందించి 1997లో జీఓ నెం 20 విడుదల చేసింది. దీని ప్రకారం నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలోని తమ్మలి వారికే రిజర్వేషన్‌ వర్తిస్తుం దనీ, రాష్ర్టంలోని మిగతా జిల్లాలలో నివసిస్తున్న తమ్మలి వారికి బిసి రిజర్వేషన్‌ వర్తించదని స్పష్టం చేసింది. తమ్మలివారు కోర్టును ఆశ్రయించటంతో స్టేటస్‌కో ఇవ్వటం జరిగింది. కనుక రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న తమ్మళిలు ప్రస్తుతం రిజర్వేషన్‌ పొందగలుగుతున్నారు. కులవృత్తి దెబ్బతిన్నా, మరోవైపు కోర్టులో రిజర్వేషన్‌పై వ్యాజం నడుస్తున్నా, ఆదాయం వచ్చినా రాకపోయినా శైవాలయాల్లో సేవలు చేస్తూ కాలం గడుపుతున్నారు. పుట్టుస్వామి కమిషన్‌ ఎటువంటి సర్వే జరపక గుడ్డిగా తమ్మళి కులంవారు ఐదు జిల్లాలలోనే ఉన్నారని ప్రభుత్వానికి నివేదిక సమర్పించటం సమంజసం కాదంటున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారందరికి‚ ఒకే ఇంటిపేరు ఉన్నప్పటికీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే అంశంలో అధికారులు వివక్ష చూపుతున్నారని వీరి మరోబాధ.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తమ్మలి&oldid=4354870" నుండి వెలికితీశారు