తుంగ కుటుంబము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుంగ కుటుంబము

వూరిగడ్డి ఇసుక నేలలో పెరుగును. దీని అడుగున భూమిలో నున్న దుంపలు ఉల్లి గడ్డల నంటి సశునములు. కాని పైన చార చారలుగ బొరలు గలవు. ఇవి ఉల్లి పాయలో వల్లెనే ఆకులు మూలమున ఏర్పడినవి. వీనిలోపల తెల్లని పదార్థమున్నది. అది తినుటకు బాగుండును.

ప్రకాండము
నిడువుగానె బెరుగును. దాని అడుగున మాత్రము ఆకులు గలవు. ఇది కొంచెము గుండ్రముగా నుండును.
ఆకులు
విస్తారము లేవు. లఘు పత్రములు. పాద పీఠమునందు గొట్టము వలె నున్నది. సమ రేఖ పత్రము. సమాంచలము. కొన సన్నము.
పుష్ప మంజరి.
గుత్తులు ఆరు ఒదలు పది వరకు కంకులు గలవు. ఈ కంకుల మీద చిన్న చిన్న పుష్పముల వలె నుండునవి పువ్వులు కావు. అవియు కంకులే. వానికి అల్పకణిశములని పేరు.

పుష్పములలో పుష్ప కోశముగాని, దళ వలయము గాని లేదు. కింజల్కములు, అండ కోశము మాత్రము గలవు. వానిని గప్పుచు పెరుగు పత్రము చేటికలే. ఈ చేటికలకు తుషములని పేరు. అల్ప కణకము మీద మొదట నున్న రెండు తుషములలోనే ఏమియు లేదు. పైవానిలో కింజల్కములు అండకోశము గలదు.

2. కాయ. అల్ప కణిశము, తుషము పెద్దవిగా చూప బడినవి. కింజల్కములు. 3. పుప్పొడి తిత్తులు రెండు గదులు. సన్నముగా నుండును.

అండకోశను ఉచ్చము. ఒక గది. ఒక అండము. కీలము గుండ్రము చివర రెండు చీలికలుగ నున్నది. గింజ కొంచము గుండ్రముగా నుండును.

ఈ కుటుంబములోని మొక్కలు చిన్న గుల్మములు. అన్నియు గడ్డి వలె నుండును. వీని ఆకుల పాద పీఠము పూర్తిగా గొట్టము వలె నుండును. పుష్పములలో పుష్ప కోశము, దళ వలయము లేదు. తుషములు గలవు. వాని లోపల కింజల్కములు అండ కోశము విడివిడిగా నైనను కలిసి యైనను వుండును. సాధారణంగా కింజల్కములు, మూడు, మూడు లోవుగా నుండును. అండాశయపు గది యొకటి. అందొకటియే అండ ముండును. కీలము చివర రెండో మూడో చీలికలు గలవు.

పూరిగడ్డి దుంపలు కరవు కాలమునంది పోగు చేసి, చెరిగి, ఉడక బెట్టి తిందురు. కొందరు వాని నెండ బెట్టి పిండి గొట్టి రొట్టెలుగా చేసి కొందురు. వీని కొక విధమగు పరిమెళము గలదు.

(మస్తుకము) చెక్కతుంగ పలు చోట్ల పెరుగు చున్నది. దాని వేళ్ళు లావుగను, గింజలు మూడు పలకలుగ నుండును. దీని వేళ్ళు అడవి పందులు తినును. వీనికిని సువాసన గలదు. ఈ వేళ్ళను పొడుము చేసి నూనెలో వేసి కొందుము. అగరు వత్తులు చేయుటలో కూడా నీ పొడుమును ఉపయోగించు చున్నారు.

గొడ్డు తుంగ చిన్న మొక్క. ఆకులు మూడో నాలుగో మాత్రమున్నవి. పసువులు దీనిని దినవు. గేదెలు మాత్రముకొంచము కొంచము తినును.

తెగడ తుంగ నీడ తడి యున్న చోట్ల పెరుగును. పువ్వుల కంకులు తెల్లగా నుండును. పశువులు దీనిని తినును.

చలి తుంగ నీటి వార పెరుగు చున్నది. వేళ్ళు నార వేళ్ళ వలె సన్నముగా నుండును. దీనికి ఆకులు చాల గలవు.

జల్లెడ తుంగ నిలుకడగ నున్న మంచి నీటి గుంటల్లో పెరుగు చున్నది. అది ఆరడుగుల వరకు పెరుగును. ప్రకాండము మూడు పలకలు. పలకలయంచులు వాడిగ నున్నవి.

కఱ్ఱ తుంగ చెరువులలోను కాలువల లోను రెండు మొదలు అయిదడుగుల ఎత్తు వరకు పెరుగు చున్నది. దీని కాడ గట్టిగాను, ఆకులు గరకుగాను నుండుట చే పశువులు దీనిని తినవు.

రక్కిస తుంగ తుంగలలో నెల్ల పెద్దది. అది చెరువులోను, నిలకడగ నున్న నీళ్ళలోను ఇరువది అడుగులెత్తు వరకు పెరుగును. ఆకులు కూడా అంత పొడుగు గానుండును. దీని పుప్పొడి తిత్తుల పైన కాడ యొకటి గలదు.

కుషతుంగ చిన్నది. సార వంతమగు చోట్ల గాని మొలవదు. పువ్వుల కంకులలో నొక దానికి కాడ లేదు గాని రెండింటికి గలదు.

గుఱ్ఱపు చెక్క తుంగ ఉప్పు నీళ్ళలో మొలవ లేదు. వేళ్ళు దుంపలుగా నుండును. ఆకులును చాల గలవు.

లొట్టి పిట్ట అల్లి మంచి నీళ్ళ చెరువులలో నుండును. కాడ పొడుగుగానే యుండును. కాని ఆకులు చిన్నవి. గింజలు తెల్లగానుండును.

అల్లిక వేళ్ళు దుంపల వలె నుండును. ఆకులు గుండ్రము గాను నున్నగాను నుండును. దీని దుంపలను కూర వండుకొని తిందురు.