తూర్పు తీరంలో తెలుగు రేఖలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు తీరంలో తెలుగు రేఖలు
కృతికర్త: మల్లికేశ్వర రావు కొంచాడ
భాష: తెలుగు
ప్రచురణ: తెలుగుమల్లి ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రేలియా
విడుదల:
పేజీలు: 287
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-06458648-0-9

తూర్పు తీరంలో తెలుగు రేఖలు ఆస్ట్రేలియాలోని తెలుగువారి గురించి మల్లికేశ్వర రావు కొంచాడ రాసిన తెలుగు పుస్తకం.[1][2]

రచన నేపథ్యం[మార్చు]

ఆస్ట్రేలియాలో తెలుగు వారు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పుస్తక రూపంలో ఒక సమగ్రమైన గ్రంథం ఉంటే బాగుంటుందని తెలుగుమల్లి “తూర్పు తీరంలో తెలుగు రేఖలు” పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో తెలుగువారి గత 60 ఏళ్ల ప్రయాణంతో పాటు కొంతమంది వ్యక్తిగతంగా అందించిన సేవలు, మాతృ భాషా వికాసాలు, మాధ్యమ సాధ్యమాలు, లలిత కళా వికాసాలు, తెలుగు సంస్థలు, తెలుగు బడుల గురించి సమగ్రంగా వ్రాయడం జరిగింది.[3]

ఇతివృత్తం[మార్చు]

ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ళ కింద మొదలైన తెలుగు వారి జీవితాన్ని, 1960-70 దశకంలో అక్కడికి చేరుకున్న మొదటి తెలుగు వారు ఎదుర్కొన్న అనుభవాలని ఈ పుస్తకం ద్వారా తెలియజేసారు. 1960-70 దశకంలో తెలుగు వారు అక్కడికి చేరుకున్న తరువాత అక్కడి నగరాలలో తెలుగు వారి సంఖ్య గురించి, ఆ తరువాతి కాలంలో ఆస్ట్రేలియాలో తెలుగు వారి సంఖ్య ఎలా పెరిగిందో ఈ పుస్తకం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. తెలుగు వారు సంఖ్యా పరంగానే కాకుండా ఆ దేశంలో తెలుగు భాష అభివృద్ధికై నిర్వహించిన విషయాలను గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు.

చింతపండు దొరక్క వెనిగర్ తో సరిపెట్టుకొనే రోజుల నుంచి పేటకొక భారతీయ దుకాణం వెలసిన ఈనాటి వరకు భారతీయ జీవన ప్రగతి, తెలుగు సామాజిక సంస్కృతీ సుగతి మూడు పూవులూ, ఆరు కాయలుగా వికసించిన తీరు, ఆస్ట్రేలియా దేశానికి చదువుకొందామని వచ్చినవారు చదువులు చెప్పే సంస్థలను తెరిచిన విషయాలు, వివిధ రంగాలలో తెలుగు వారు అలంకరించిన పదవులను గురించి, అలాగే విద్య, వైద్య, సాంకేతిక, వ్యాపార, రాజకీయ రంగాలలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలను అందుకొన్న వ్యక్తుల జీవన విషయాలను, పరాయి సంస్కృతితో సహజీవనం చేస్తూ కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన సంస్కృతిని కాపాడుకోవాలని భాషా సంస్కృతులకై పని చేస్తున్న వారిని గురించి ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది.

ఇలా ఆస్ట్రేలియాలో తెలుగువారి జీవనాన్ని ప్రపంచానికి తెలిసేలా, 1960 నుండి 2020 లో ఆస్ట్రేలియాలో తెలుగు సామాజిక భాషగా గుర్తింపు పొందే స్థాయిని చేరుకున్న కృషి[4], ఆ దేశంలో తెలుగు వారు అడుగుపెట్టి అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, తెలుగు “షష్ఠిపూర్తి” సంప్రదాయానికి ఒక జ్ఞాపికగా మల్లికేశ్వర రావు కొంచాడ రాసిన ఈ పుస్తకాన్ని తెలుగుమల్లి సంస్థ ప్రచురించడం జరిగింది.[5][6]

సమీక్షలు[మార్చు]

ఆరు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో తెలుగు వారి జీవనాన్ని ఈ పుస్తకం ద్వారా భద్రపరిచే ప్రయత్నం చేయబడిందని, ఈ పుస్తక రచన కోసం రచయిత మల్లికేశ్వర్ రావు కృషి చేసిన విధానాన్ని తెలుపుతూ, ఈ పుస్తకం చాలా దేశాల్లో ఉన్న తెలుగు వారికి కరదీపిక లాగ ఉపయోగపడుతుందని దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న తెలుగు కవి రాపోలు సీతారామరాజు తన సమీక్షలో ప్రస్తావించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 telugu, NT News (2023-09-21). "'తూర్పు తీరంలో తెలుగు రేఖలు' పుస్తక సమీక్ష". www.ntnews.com. Retrieved 2023-11-05.
  2. Rajasuka, G. (2023-10-23). "Sahithi Vanam: తూర్పు తీరంలో తెలుగు రేఖలు". Telugu Prabha Telugu Daily. Retrieved 2023-11-05.
  3. "తూర్పు తీరంలో వెల్లివిరిసిన ' తెలుగు రేఖలు'". Sakshi. 2023-10-10. Retrieved 2023-11-05.
  4. ఆంధ్రజ్యోతి ఈ పేపర్ 2020, retrieved 2023-11-07
  5. "Prajasakti E-Paper". epaper.prajasakti.com. Retrieved 2023-11-05.
  6. "Telugu Book Release - 'Toorpu Teeram lo Telugu Rekhalu'". Retrieved 2023-11-05.