దాసరి
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపు కులం. నుదుటు న నిలువు నామాలు, నెత్తిన కలశం, చేతిలో చిడ తలతో వీధుల్లోకి వచ్చి దేవుని నామాన్ని స్మరిస్తూ గ్రామా లలో తిరు గుతూ భజన చేస్తారు దాసరివారు. ప్రేమతో ఎవరేదిచ్చినా ఈశ్వరార్పణం అంటూ తీసుకుంటారు. ఇవ్వకపోయినా ముందుకు సాగిపోతుంటారు. సాధు స్వభావులుగా పేరు పొందిన ఈ దాసరి కులస్తులు ఎస్సీకులమునకు చెందినవారు.ప్రాంతాన్ని బట్టి వీరి జీవన విధానం మారుతుంది. ఏ ప్రాంతానికి చెందినవారైనానప్ప టికీ వీరంతా సంచార జాతులకు చెందినవారు. కాలగమనంలో వచ్చిన మార్పులతో ఒకప్పుడు చిడతలు పట్టి రాగాన్ని రక్తి కట్టించిన చేతు లు నేడు రాళ్లు మో స్తున్నాయి. వీరి జీవన స్థితిగతులను పరిశీలిస్తే... ఆంధ్ర ప్రాంతంలోని హరిదాసులు సంక్రాంతి సీజన్‌లో దర్శనమి„స్తుంటారు. వీరు వంశపారం పర్యంగా గ్రామాలు తిరుగుతారు కనుక ఆయా దాసరి కుటుంబాల వారు గ్రామాలను పంచు కుంటారు.తెలంగాణ ప్రాంతంలోని దాసరి కులస్తులు యాచక వృత్తి చేయటంతోపాటు వీధి బాగవతాలు ఆడుతుంటారు. చిడతలు, తంబుర, హార్మోనియం వీరి ప్రధాన వాయిద్యా లు. వర్షాకాలం మినహా మిగతా రోజుల్లో గ్రామాల్లో తిరిగి ప్రదర్శనలు ఇస్తుంటారు.వీరు ప్రదర్శించే వీధి బాగవతాలపై నాటి సినిమాల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. టీవీలు, వీటికి కనెక్షన్లు గా వస్తున్న కేబుల్ నెట్‌వర్‌కతో వీరి వృత్తి పూర్తిగా దెబ్బ తింది. వ్యయప్రయాసలకోర్చి గ్రామాలు పట్టి తిరిగినా నేటి దాసరి కులస్తుల వీధి బాగవతాలకు పేక్షకులు కరువయ్యారు. దీంతో బతుకుభారమైన వీరు అడ్డాల దగ్గ ర కూలీలుగా మారారు. మిగిలిన పనులు చేయటం చేత కాకపోవటంతో వీరు చెత్తలో ప్లాస్టిక్ కవర్లు, పాత ఇనుము, సీసాలు కొనుగోలుచేసి వ్యాపారులకు అమ్మే వారిగా రూపాంతరం చెందారు. అక్కడ కూడా భుక్తి గడవ నివారు రాజధాని హైదరాబాదుకు వచ్చి రాళ్లు మోస్తునారు.వీరి పూర్వీకులు సంచార జీవులు కావటంతో ఏ గ్రామంలోనూ రెండు మూడు నెలలకు మించి ఉండేవారు కాదు. కనుక వీరి పిల్లలు పాఠశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో తరతరాలుగా వీరు విద్యకు దూరమయ్యారు. కనుకనే అన్ని రంగాలలో వెనుక బడ్డారు. విద్య విలువ తెలుసుకున్నవారు ఇప్పుడు వారి పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నారు. గతంలో వీరు చేసిన వృత్తినే చేసిన హొలియ దాసరి కులస్తులు నేడు వీరికన్నా అభివృద్ధి చెందటంతో వీరిలోనూ పట్టుదల పెరి గింది. కష్టం చేసైనా తమ పిల్లలను చదివించి వారి జీవితాల్లో మార్పు తేవాలనే దృఢసంకల్పంతో ఉన్నారు. `దాసరి కులానికి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని జిల్లాకొక రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని వీరి డిమాండ్లు.