దెయ్యం
వికీపీడియా నుండి
దెయ్యం (Ghost) చనిపోలిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు.[1][2][3] ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ (Haunted) ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి; కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు.[4] దెయ్యపు సైన్యాలు, జంతువులు, రైళ్ళు మరియు ఓడలు కూడా ప్రచురించబడ్డాయి.[5][6]
అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు.[7] దెయ్యాల గురించి ప్రాచీనకాలం నుంచి నమ్మకలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దెయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. హేతువాదులు దెయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దెయ్యాలుగా ప్రచారం చేస్తారని వీరు భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండింటికీ కూడా బలమైన నిరుపణలు లేవు.[8] అమెరికా లో 2005 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం సుమారు 32% మంది దెయ్యాలు ఉన్నాయని నమ్మారు.[9]
విషయ సూచిక |
[మార్చు] హిందూ మతంలో దయ్యాలు
[మార్చు] ఇస్లాం మతంలో దయ్యాలు
- హసన్ హుసేన్ లకు దృష్టితగలకుండా దయ్యాలబారిన పడకుండా ప్రవక్త ప్రార్దించేవారు.
- షైతాను రెండుకొమ్ముల మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తాడు(బుఖారీ 4:494)
- నమాజు చేసేవాని ముందునుంచి నడిచేవాడు దయ్యంలాంటివాడు(బుఖారీ 4:495)
- రాత్రికాగానే పిల్లల్ని దగ్గరకుతీసుకోండి.దయ్యాలు తిరుగుతుంటాయి (బుఖారీ 4:500)
- దయ్యాలు పరలోకం నుండి భవిష్యవిషయాలను ఒకటో రెండో దొంగతనంగా విని జోతిష్కులకు చెబితే వాళ్ళు వంద అబద్దాలు వాటికి కలిపి చెబుతారు(బుఖారీ 6:324)
[మార్చు] క్రైస్తవమతంలో దయ్యాలు
- బైబిల్ లో వీటిని అపవిత్రాత్మలు అంటారు.సాతానును లూసిఫర్,అపవాది లాంటిపేర్లతో కూడా పిలుస్తారు.
- సేన అనే దయ్యాలగుంపు పట్టిన వాడిని ఏసు బాగుచేస్తే ఆ దయ్యాలు వెళ్ళి పందులలో ప్రవేశిస్తే ఆ పందులు సరస్సులో పడి చనిపోతాయి (లూకా 8:33)
- ఏసు దయ్యాల అధిపతివలన దయ్యాలను వెళ్ళ్గొడుతున్నాడని పరిసయ్యులు ఆరోపిస్తారు(మత్తయి 9:34).
- దయ్యలుకూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతాయి (యాకోబు 2:19)
[మార్చు] మూలాలు
- ↑ http://www.merriamwebster.com/dictionary/ghost Merriam Webster dictionary, retrieved December 24, 2007 "a disembodied soul"
- ↑ http://www.parapsych.org/glossary_e_k.html#g Parapsychological Association, glossary of key words frequently used in parapsychology, Retrieved December 13 2006
- ↑ http://www.thefreedictionary.com/ghost Retrieved December 13 2006 "The spirit of a dead person, especially one believed to appear in bodily likeness to living persons or to haunt former habitats."
- ↑ Daniel Cohen (1994) Encyclopedia of Ghosts. London, Michael O' Mara Books: 137-56
- ↑ Christina Hole (1950) Haunted England. London, Batsford: 150-163
- ↑ Daniel Cohen (1994) Encyclopedia of Ghosts. London, Michael O' Mara Books: 8
- ↑ The Oxford Book of the Supernatural (1995) edited by D.J. Enright: 503-542
- ↑ Daniel Cohen (1994) Encyclopedia of Ghosts. London, Michael O' Mara Books
- ↑ Musella, David park (Sept-October 2005). Gallup poll shows that Americans' belief in the paranormal persists. Skeptical Inquirer. తీసుకొన్న తేదీ: 2007-09-19.