దేవిందర్ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవిందర్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
In office
2003–2005
అంతకు ముందు వారుఏ.ఆర్. లక్ష్మణన్
తరువాత వారుజి.ఎస్. సంఘ్వి
వ్యక్తిగత వివరాలు
జననం4 ఏప్రిల్ 1943

దేవిందర్ గుప్తా (జననం: 4 ఏప్రిల్ 1943) భారత న్యాయమూర్తి.[1][2] 2003-2005 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[3]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

గుప్తా 1943, ఏప్రిల్ 4న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో జన్మించాడు. బిఏ పూర్తిచేసి న్యాయవిద్యలో చేరాడు.

వృత్తిజీవితం[మార్చు]

ఎల్‌.ఎల్.బి. పూర్తయిన తర్వాత 1967, మార్చి 23న న్యాయవాదిగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. తొలిరోజుల్లో (1967 నుండి 1975 వరకు) హిమాచల్ ప్రదేశ్ జిల్లా కోర్టులు, హైకోర్టులలో ప్రాక్టీస్ చేశాడు. 1990, జూన్ 25న, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1994, ఏప్రిల్ 28న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యాడు. నాలుగు వేరువేరు సందర్భాల్లో ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[4] ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యాడు.[5] 2003, మార్చి 10న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి పదోన్నతి పొంది 2005, ఏప్రిల్ 4 న పదవీ విరమణ చేశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Former Judges". delhihighcourt.nic.in. Retrieved 2021-06-15.
  2. "DGCJ". tshc.gov.in. Retrieved 2021-06-15.
  3. "Justice Devinder Gupta appointed Chief Justice of Andhra HC". Zee News (in ఇంగ్లీష్). 2003-03-03. Archived from the original on 2021-06-16. Retrieved 2021-06-15.
  4. "Hon". www.supremecourtcaselaw.com. Archived from the original on 2011-07-20. Retrieved 2021-06-15.
  5. "DGCJ". tshc.gov.in. Retrieved 2021-06-15.
  6. "Former Judges". delhihighcourt.nic.in. Retrieved 2021-06-15.