ధర్మో రక్షతి రక్షితః

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున దృశ్య చిత్రం

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం అర్ధం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది".

శ్లోకం[మార్చు]

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌

అని మనుస్మృతిలో చెప్పబడింది. దీని ప్రకారం ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.[1]

శ్లోకం అర్థం[2][మార్చు]

“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;
కనునుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు
మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి”

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2021-04-18. Retrieved 2020-09-15.
  2. "ధర్మో రక్షతి రక్షితః | Pyramid Spiritual Societies Movement". Retrieved 2020-09-15.