నక్షత్ర (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నక్షత్ర
జననం
నక్షత్ర

1990
ఇతర పేర్లుదీప్తి[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009 – ప్రస్తుతం
తల్లిదండ్రులుడి.రాజేంద్రబాబు
సుమిత్ర
కుటుంబంఉమా శంకరి (సోదరి)

నక్షత్ర ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తుంది.

జీవితం తొలి దశలో[మార్చు]

కన్నడ చలనచిత్ర దర్శకుడు డి.రాజేంద్రబాబు, నటి సుమిత్రలకు చిన్న కుమార్తెగా నక్షత్ర జన్మించింది.[2] ఆమెకు ఉమాశంకరి అనే ఒక అక్క ఉంది, ఆమె కూడా నటి.[3] ఆమె ఈరోడ్ సెంగుంతర్ ఇంజనీరింగ్ కళాశాలలో బయోటెక్ చదివింది.[4] నటి కావాలని ఎంత కోరికగా ఉన్నా నక్షత్ర తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించారు.[5][6]

కెరీర్[మార్చు]

17 సంవత్సరాల వయస్సులో నక్షత్రని దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ ఒక ఫంక్షన్‌లో చూసాడు. ఆ తరువాత ఆమె తల్లి సుమిత్రకు ఫోన్ చేసి తన సినిమాలో నటి కోసం ఆసక్తిని వ్యక్తం చేసాడు.[7] అలా ఆయన తన సరిగమ చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్ర ఇచ్చాడు. కొంతకాలం తర్వాత గోకులలో ఒక పాత్రను పోషించింది. ఇది ఆమె తొలిచిత్రంగా విడుదలైంది. హరే రామ హరే కృష్ణలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది.[8] ఆమె గోకులలో సిగ్గుపడే అమ్మాయిగా తల్లితో కలిసి నటించడం విశేషం. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు సానుకూలమైన సమీక్షలు ఇచ్చారు.[9][10][11] చివరకు అనేక కారణాలతో సరిగమ చిత్రం విడుదలకాలేదు.[12] అయితే, విరుద్ధమైన షెడ్యూల్‌ల కారణంగా హరే రామ హరే కృష్ణ నుండి వైదొలగవలసి వచ్చింది.[13] ఆ పాత్ర చివరికి పూజా గాంధీని వరించింది.[14] 2011లో విడుదలైన డూ, మరుధవేలు చిత్రాల ద్వారా నక్షత్ర తమిళ నాట అడుగుపెట్టింది.[15] మరుసటి సంవత్సరం, ఆమె మలయాళంలో వైదూర్యంతో అరంగేట్రం చేసింది.[16] అయితే మలయాళ చిత్రాల కోసం తన స్క్రీన్ పేరును దీప్తిగా మార్చుకుంది. అదే సంవత్సరం తన రెండవ మలయాళ చిత్రం కిలి పాడుం గ్రామమ్‌ విడుదలైంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి.[17]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Film Role Language Notes
2009 గోకుల మహాలక్ష్మి కన్నడ
2011 డూ స్వప్న తమిళం
2011 మరుధవేలు విద్యా వేణుగోపాలన్ తమిళం
2011 హరే రామ హరే కృష్ణ కన్నడ
2012 వైడూర్యం గాయత్రి మలయాళం
2012 కిలి పాడుమ్ గ్రామం పల్లెటూరి అమ్మాయి మలయాళం
2013 ఫర్ సేల్ బాల మలయాళం
2013 ఆర్య సూర్య చంద్రగంధ తమిళం
2014 మొనాయి అంగనే ఆనయి మాయ మలయాళం
2014 ఫెయిర్ & లవ్లీ కన్నడ
2015 విలేజ్ గాయ్స్ ఆరతి వాసుదేవన్ మలయాళం
2015 కూచికూ కూచికూ కన్నడ
2015 ఓరు న్యూ జనరేషన్ పానీ ఇందుజ మలయాళం

మూలాలు[మార్చు]

  1. "Sumithra's daughter Deepthi to star opposite Biyon". timesofindia.indiatimes.com. Retrieved 7 January 2015.
  2. "Director Rajendra Babu dies of cardiac arrest". Newindianexpress.com. Archived from the original on 2016-03-04. Retrieved 2022-08-15.
  3. "Star kids in Sandalwood". Timesofindia.com. Retrieved 7 January 2015.
  4. "One more star from Babu's family". Newindianexpress.com. Archived from the original on 2016-03-07. Retrieved 2022-08-15.
  5. "One more star from Babu's family". Newindianexpress.com. Archived from the original on 2016-03-07. Retrieved 2022-08-15.
  6. "Nakshatra: A star among stars". The Times of India.
  7. "Nakshatra's grand entry". The Times of India. Retrieved 29 November 2021.
  8. [1] [dead link]
  9. "Review: Gokula is a treat to watch". Rediff.com.
  10. "Gokula review. Gokula Kannada movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 29 November 2021.
  11. "Gokula". Sify.com. Archived from the original on 15 ఆగస్టు 2015. Retrieved 29 November 2021.
  12. "Sunil Kumar Desai back with a new film". The Times of India.
  13. "Techie's film in doldrums". New Indian Express. Archived from the original on 2015-07-03. Retrieved 2022-08-18.
  14. "Pooja Gandhi set to replace Honey Rose". Filmibeat.com. 2 March 2010.
  15. "Sumithra's daughter arrives in Tamil". The New Indian Express. Retrieved 29 November 2021.
  16. "Veteran actress Sumithra's daughter Nakshatra enters the Malayalam film industry with a film titled Vaidooryam". The Times of India.
  17. "Nakshatra: A star among stars". The Times of India.