నడకుదుటి నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నడకుదుటి నరసింహారావు
నడకుదుటి నరసింహారావు


బీసీ సంక్షేమశాఖ మంత్రి
పదవీ కాలం
1999 - 2004
పదవీ కాలం
ఎమ్మెల్యే
ముందు అంబటి బ్రాహ్మణయ్య
తరువాత పేర్ని వెంకటరామయ్య
నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1951
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2021 ఏప్రిల్ 2
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ

నడకుదుటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

నడకుదిటి నరసింహారావు రాజకీయాల్లోకి రాక ముందు నావలు, పడవల తయారీలో చేసేవాడు, ఆ తరువాత నవీన ఇండస్ర్టీస్‌ ద్వారా రైస్‌మిల్లులకు అవసరమైన విడి భాగాలను తయారు చేసేవారు. ఆయన 1982లో టిడిపి ఆవిర్భావం సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. నరసింహారావు 1996 నుంచి 99 వరకు మచిలీపట్నం అర్బన్‌ బ్యాంకు అధ్యక్షులుగా పని చేసి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మత్స్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.

మరణం[మార్చు]

నడకుదుటి నరసింహారావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 2న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (28 March 2019). "బందరు తీరం చైతన్య పథం". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  2. Andhra Jyothy (2 April 2021). "టీడీపీ మాజీ మంత్రి నడకుదిటి కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.