నవ్వవే నా చెలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవ్వవే నాచెలీ 1972లో విడుదలైన అంతా మన మంచికే సినిమాలో పాట. దాశరథి రచించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత లు గానం చేసారు. ఈ పాటలు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. సినిమాలో ఈ పాటకు భానుమతీ రామకృష్ణ, చలం లు నటించారు. [1]

పాట[2][మార్చు]

ఓహోహోహో.. ఓహో.. ఓహో..
ఆహా.. ఆహా.. ఆహా..
హేహేహే.. హేహేహే.. హేహేహే..

నవ్వవే నా చెలి
నవ్వవే నా చెలి
చల్లగాలి పిలిచేను మల్లె పూలు నవ్వేను
వలపులు పొంగే వేళలో
నవ్వనా నా ప్రియా
నవ్వనా నా ప్రియా
మూడు ముళ్ళు పడగానే
తోడు నువ్వు కాగానే
మమతలు పండే వేళలో
మమతలు పండే వేళలో
నవ్వనా నా ప్రియా

మనసులు ఏనాడో కలిసాయిలే
మనువులు ఏనాడో కుదిరాయిలే
మనసులు ఏనాడో కలిసాయిలే
మనువులు ఏనాడో కుదిరాయిలే
 నీవు నా దానవే నీవు నా వాడవే
నేను నీ వాడనే నేను నీ దాననే
ఇక నను చేరి మురిపించ బెదురేలనే
నవ్వవే నా చెలి నవ్వనా నా ప్రియా

జగమేమి తలిచేనో మనకెందుకు
జనమేమి పలికేనో మనకేమిటి
జగమేమి తలిచేనో మనకెందుకు
జనమేమి పలికేనో మనకేమిటి
నీవు నా దానవే నీవు నా వాడవే

మూలాలు[మార్చు]

  1. "Navvave Naa Cheli MP3 Song Download- Antha Mana Manchike". Saregama. Retrieved 2020-08-30.
  2. "Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation". www.teluguvelugu.in. Retrieved 2020-08-30.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]